-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 5th June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 05 , 2026 | 06:34 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 05, 2026 21:57 IST
అనకాపల్లి జిల్లాలో వడ్డాది శారదా నదిలోకి దూసుకెళ్లిన అంబులెన్స్
వడ్డాది వద్ద అదుపుతప్పి నదిలో పడిన అంబులెన్స్
అదృష్టవశాత్తూ వాహనంలో రోగి లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
నిర్మాణంలో ఉన్న డైవర్షన్ బ్రిడ్జిపై అదుపుతప్పిన వాహనం
బంగారుమెట్ట నుంచి అనకాపల్లి వెళ్తుండగా వడ్డాది వద్ద ప్రమాదం
-
Jun 05, 2026 21:10 IST
ప.గో: ఉండి మండలం పాములపర్రులో ప్రమాదం
విద్యుత్ వైర్లు తగిలి.. దర్మాకోల్ లారీ దగ్ధం
సురక్షితంగా బయటపడ్డ లారీ డ్రైవర్
పొగ దట్టంగా కమ్మేయడంతో భయాందోళనలకు గురైన స్థానికులు
-
Jun 05, 2026 21:09 IST
కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?
నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా: సీఎం రేవంత్
చర్చలో ఓడితే నేను దేనికైనా సిద్ధం: సీఎం రేవంత్
-
Jun 05, 2026 21:00 IST
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఐసోలాషన్‌లో ఉన్న సూడాన్ వ్యక్తికి ఎబోలా నెగటివ్
కొద్దీ సేపటి క్రితమే గాంధీ వైద్యులకు రిపోర్ట్ అందించిన ఎన్ఐవి పూణే
-
Jun 05, 2026 20:43 IST
'అమరావతి ఐ' ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కృష్ణా నదీ తీరంలో భారీ ఫెర్రిస్ వీల్ నిర్మాణానికి అనుమతి
DBFOT విధానంలో 'అమరావతి ఐ' ప్రాజెక్టు అభివృద్ధి
'అమరావతి ఐ' కోసం పోటీ టెండర్లు, RFPకి అనుమతి
30 ఏళ్ల లీజ్‌పై 6 ఎకరాల భూమి కేటాయింపు
-
Jun 05, 2026 20:42 IST
ఏపీ హైకోర్టు భవన అభివృద్ధి పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
హైకోర్టు భవన వెలుపలి అభివృద్ధి, ఇతర పనులకు రూ.547 కోట్ల నిధుల మంజూరు
-
Jun 05, 2026 19:28 IST
జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్
లింగమనేని రమేష్ పేరును ఖరారు చేసిన పవన్
అధికారికంగా ప్రకటించిన జనసేన
-
Jun 05, 2026 18:49 IST
కామారెడ్డి: పిట్లం మండలం బొల్లాక్‌పల్లిలో విషాదం
మంజీరా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
మృతులు కిష్టాపూర్‌కు చెందిన అనిత, పావని, శ్రీవాణి, భానుగా గుర్తింపు
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు
-
Jun 05, 2026 18:47 IST
ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
క్యూర్ పరిధిలో LIG, MIG వర్గాలకు లక్ష ఇళ్ల నిర్మాణం: మంత్రి పొంగులేటి
పేదల నివాస ప్రాంతాల దగ్గర ఇళ్ల నిర్మాణం: పొంగులేటి
మహిళలకు ఇంటి స్థలంలో యాజమాన్య హక్కులు: పొంగులేటి
2026-27లో మొత్తం 3.50 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతులు: మంత్రి పొంగులేటి
-
Jun 05, 2026 18:01 IST
హైదరాబాద్: మంత్రి వివేక్‌తో జపాన్ ప్రతినిధుల భేటీ
ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చ
జపాన్‌లో తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలపై చర్చ
తెలంగాణ అభివృద్ధి అవకాశాలపై IAS హరిచందన ప్రెజెంటేషన్
-
Jun 05, 2026 17:36 IST
కడప: జమ్మలమడుగు ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లి, శిశువు మృతి
డెలివరీ కోసం వచ్చిన మహిళతో పాటూ నవజాత శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బంధువుల ఆరోపణ
ఆస్పత్రి ఎదుట మృతదేహాలతో బంధువుల ధర్నా
మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
-
Jun 05, 2026 17:17 IST
హైదరాబాద్‌లో స్పా సెంటర్లపై పోలీసుల దాడులు
మల్కాజ్‌గిరిలో పలు స్పా సెంటర్లలో ఏకకాలంలో సోదాలు
స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు
భవన యజమానులను ప్రశ్నిస్తున్న పోలీసులు
-
Jun 05, 2026 17:01 IST
రష్యా: రోసాటమ్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ
ఏపీలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేయండి: లోకేష్
ఇండస్ట్రియల్ పార్క్‌లో డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టండి: మంత్రి నారా లోకేష్
-
Jun 05, 2026 16:17 IST
కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది: సీఎం రేవంత్
కష్టకాలంలో ఆదుకున్న పాలమూరును కేసీఆర్ పట్టించుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తారని ఆశించాం: రేవంత్
ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీలేదు: రేవంత్
ప్రాజెక్టులపై BRS అబద్ధపు ప్రచారం చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 05, 2026 16:02 IST
విజయవాడ: ఎంపీ కేశినేని చిన్నిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
పోలీసులకు ఎంపీ చిన్ని ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు
విచారణ చేపట్టిన పటమట పోలీసులు
తాతినేని రాంబాబు అరెస్ట్, మరికొందరిపైనా కేసులు
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: ఏసీపీ దామోదర్
-
Jun 05, 2026 15:46 IST
సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ
ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు ప్రమాదం
ఎత్తిపోతల పంపుల నిర్వహణపై హెచ్చరికలను పట్టించుకోలేదు
కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం: హరీష్‌రావు
-
Jun 05, 2026 15:45 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
117 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
50 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Jun 05, 2026 15:18 IST
సుప్రీంకోర్టుపై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఎన్నికల పిటిషన్ల ఆలస్యంపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి
వివాదాలను సకాలంలో తేల్చకపోతే భారత్ నిరంకుశ దేశంగా మారుతుంది: మద్రాస్ హైకోర్టు
2016 నాటి కేసు తేల్చడానికి ఆరేళ్లు పడుతుందా?: మద్రాస్ హైకోర్టు
-
Jun 05, 2026 15:15 IST
ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతాం: సీఎం చంద్రబాబు
సముద్ర ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో భారత్
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎగుమతుల్లో గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాం: సీఎం చంద్రబాబు
పదేళ్లలో 5 శాతం నుంచి 70 శాతానికి వృద్ధి: సీఎం చంద్రబాబు
-
Jun 05, 2026 15:15 IST
ఎన్టీఆర్: మూలపాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బటర్‌ఫ్లై పార్క్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టిన పవన్ కల్యాణ్
ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: పవన్ కల్యాణ్
మనం నాటే ప్రతి మొక్క.. మహావృక్షం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jun 05, 2026 15:14 IST
నెల్లూరు: ఆత్మకూరు మండలం నారంపేటలో రోడ్డు ప్రమాదం
కారు బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 05, 2026 14:41 IST
బెంగళూరు: రాజ్యసభ సభ్యుడిగా AICC చీఫ్ ఖర్గే నామినేషన్
హాజరైన రాహుల్‌గాంధీ, సీఎం డీకే, సిద్దరామయ్య
-
Jun 05, 2026 14:38 IST
అమరావతి: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్
లింగమనేని 2015 నుంచి జనసేనతో ఉన్నారు: పార్టీ నేతలతో పవన్
కొద్దిసేపటి కిందట జరిగిన పార్టీ నేతల సమావేశంలో పేరు వెల్లడించిన పవన్
ఈరోజు సాయంత్రం ముహూర్తం చూసుకుని అధికారికంగా ప్రకటించనున్న పవన్
-
Jun 05, 2026 14:37 IST
పోలవరం జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్‌లో ప్రమాదం
మినీ బస్ బోల్తా.. 17 మందికి గాయాలు
క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు
-
Jun 05, 2026 14:24 IST
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్
కాంచీపురంలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
గండిపేట భూకబ్జా కేసులో బ్రహ్మనాయుడు అరెస్ట్
ఫేక్ జీవోలతో భూముల కబ్జా కేసులో బ్రహ్మనాయుడు అరెస్ట్
గండిపేటలో 10 ఎకరాలు కబ్జా చేసినట్టు ఆరోపణలు
-
Jun 05, 2026 14:23 IST
అమరావతి: IFS అధికారి సందీప్ కృపాకర్ బదిలీ
ఏపీ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా నియామకం
-
Jun 05, 2026 13:41 IST
కృష్ణా: పేర్ని నానిపై గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు ఫైర్
నాపై పేర్ని నానివి నిరాధార ఆరోపణలు: MLA యార్లగడ్డ
పవన్ కల్యాణ్‌పైనా పేర్ని నోరు పారేసుకుంటున్నారు: యార్లగడ్డ
పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలి: MLA యార్లగడ్డ
-
Jun 05, 2026 13:30 IST
ఎన్టీఆర్: యూట్యూబర్ రమానందన దంపతులపై లుకౌట్ నోటీసులు
UK వీసాల రెన్యువల్ పేరుతో రూ.కోట్లలో మోసం చేసినట్లు ఆరోపణలు
రమానందన దంపతులపై ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు నమోదు
మామిళ్లపల్లికి చెందిన క్రాంతికుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు
-
Jun 05, 2026 13:09 IST
నంద్యాలలో నిరుద్యోగులకు కేటుగాళ్ల టోకరా
వర్క్ ఫ్రం హోం పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు
సుమారు 500 మంది నుంచి రూ.5 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ నిర్వాహకులు
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
-
Jun 05, 2026 13:08 IST
తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం
కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభిస్తున్నా: అన్నామలై
భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నా: అన్నామలై
నా ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తా: అన్నామలై
తమిళనాడు అభివృద్ధే నా ప్రథమ ప్రాధాన్యం: అన్నామలై
మార్పు కోసమే బీజేపీలో చేరా: అన్నామలై
-
Jun 05, 2026 13:07 IST
ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం: ఎంపీ అర్వింద్
బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధాన్యం పోస్తామనడం సరికాదు: అర్వింద్
రైతుల పేరుతో రాజకీయం చేయడం తగదు: ఎంపీ అర్వింద్
సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్
రేవంత్‌కు చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి: అర్వింద్
-
Jun 05, 2026 12:50 IST
రేపు బెంగళూరుకు సీఎం రేవంత్
హిందూ దినపత్రిక కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్
-
Jun 05, 2026 12:50 IST
ఢిల్లీ: రాహుల్ గాంధీ ఆన్‌లైన్ క్యాంపెయిన్
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై కేంద్రానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్
#GreenOverGreed, #NicobarMatters హ్యాష్‌ట్యాగ్స్‌తో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపు
నికోబార్ దీవుల్లో స్కూబా డైవింగ్‌తో పగడపు దిబ్బలను విధ్వంసం చేస్తున్నారంటూ రాహుల్ ఆందోళన
-
Jun 05, 2026 12:39 IST
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు: టీజీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
BRS పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలు: రాంచందర్‌రావు
అవినీతి, నిర్లక్ష్యంతో కాంగ్రెస్ పాలన సాగుతోంది: రాంచందర్‌రావు
రైతు రుణమాఫీ పూర్తిగా అమలుకాలేదు: రాంచందర్‌రావు
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి: రాంచందర్‌రావు
-
Jun 05, 2026 12:28 IST
ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు నిరాకరణ
రేపు జంతర్‌మంతర్ దగ్గర కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన
సేవ్ ఇండియా ఫౌండేషన్ పిల్‌ను తక్షణమే విచారించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
-
Jun 05, 2026 12:20 IST
రాజకీయ ఉద్యమం మొదలుపెడుతున్నా: అన్నామలై
నా ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తా: అన్నామలై
మార్పు కోసమే బీజేపీలో చేరా: అన్నామలై
-
Jun 05, 2026 12:11 IST
హైదరాబాద్: మైత్రీవనం అగ్నిప్రమాద స్థలికి హైడ్రా కమిషనర్
బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న రంగనాథ్
హర్ష మెస్‌ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
-
Jun 05, 2026 12:03 IST
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
120 పాయింట్లకుపైగా లాభంలో సెన్సెక్స్
20 పాయింట్లకుపైగా లాభంలో నిఫ్టీ
-
Jun 05, 2026 12:01 IST
వీగన్ ఆహార పదార్థాల ప్యాకేజీలపై ప్రత్యేక లోగో తప్పనిసరి
కీలక నిర్ణయం తీసుకున్న FSSAI
2027 జులై 1 నుంచి కొత్త నిబంధన అమలు
వినియోగదారులకు వీగన్ ఉత్పత్తులను సులభంగా గుర్తించే అవకాశం
నిబంధనలు పాటించని ఉత్పత్తులపై చర్యలకు అవకాశం
-
Jun 05, 2026 11:41 IST
కర్ణాటక: మంత్రి రామలింగారెడ్డి రాజీనామాపై స్పందించిన సీఎం డీకే శివకుమార్
మంత్రి రామలింగారెడ్డి ఆందోళనలను పరిశీలిస్తాం: సీఎం డీకే శివకుమార్
రామలింగారెడ్డి నాకు మంచి మిత్రుడు: సీఎం డీకే
ఈ సమస్యను మేం పరిష్కరించుకుంటాం: సీఎం డీకే
-
Jun 05, 2026 11:25 IST
ఢిల్లీ: అన్నామలై రాజీనామాను ఆమోదించిన నితిన్ నబీన్
ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై
తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై
-
Jun 05, 2026 11:12 IST
అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా సైకిల్ తొక్కిన హోం మంత్రి
తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కిన హోంమంత్రి వంగలపూడి అనిత
-
Jun 05, 2026 11:03 IST
నాగర్‌కర్నూల్: కొల్లాపూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల నిర్మాణ పనుల పరిశీలన
ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనుల ఏరియల్ వ్యూ
-
Jun 05, 2026 10:45 IST
కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ఈ సారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడి
-
Jun 05, 2026 10:37 IST
పోలవరం: దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం
పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెం పరిసరాల్లో సంచారం
తీవ్ర భయాందోళనలో గిరిజన గ్రామాల ప్రజలు
పులికి అమర్చిన రేడియోకాలర్, డ్రోన్ కెమెరాలతో కదలికల గుర్తింపు
గండిపోశమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డు మూసివేసిన అధికారులు
పెద్దపులిని బంధించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
Jun 05, 2026 10:32 IST
విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మొక్కలు నాటిన చంద్రబాబు
-
Jun 05, 2026 10:11 IST
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్
రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా
పుణెలో కీలక సూత్రధారుల అరెస్ట్
పోలీసుల అదుపులో మొత్తం ఆరుగురు నిందితుల ముఠా
-
Jun 05, 2026 10:05 IST
స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 286, నిఫ్టీ 62 పాయింట్లకుపైగా లాభం
-
Jun 05, 2026 10:03 IST
భద్రాద్రి: దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవు ప్రధాన రహదారిపై బైక్-ట్రాక్టర్ ఢీ
చర్ల మండలం గోంపల్లికి చెందిన చుంచు చరణ్ సాయి, సంతోశ్ మృతి
-
Jun 05, 2026 10:02 IST
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం
మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి అసంతృప్తి
రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించిన డీకే
బెంగళూరు నగర అభివృద్ధిశాఖ ఆశించిన రామలింగారెడ్డి
సిద్ధరామయ్య కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా ఉన్న రామలింగారెడ్డి
-
Jun 05, 2026 09:24 IST
తిరుపతి: మంగళం క్వార్టర్స్ పద్మావతి నగర్‌లో దారుణ హత్య
భవన నిర్మాణ కార్మికుడు శివయ్యను రాయితో కొట్టి చంపినట్టు గుర్తింపు
దర్యాప్తు చేపట్టిన తిరుచానూరు పోలీసులు
-
Jun 05, 2026 08:51 IST
ఎన్టీఆర్ జిల్లా: మూలపాడు బటర్‌ఫ్లై పార్కును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బటర్‌ఫ్లై పార్కులో సీడ్ బాల్స్, తెల్ల పొనికి చెట్లను నాటిన పవన్
కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కూటమి పార్టీ నేతలు
-
Jun 05, 2026 08:32 IST
రంగారెడ్డి: అత్తాపూర్ తేజస్వీనగర్‌లో దారుణ హత్య
భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి చంపిన భర్త
కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో భర్త
-
Jun 05, 2026 08:30 IST
హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ప్రమాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన నిపుణుల బృందం
రెండో ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా
ప్రమాదంలో రూ.కోటిన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు చెబుతున్న అధికారులు
-
Jun 05, 2026 08:27 IST
ఉత్తర్ ప్రదేశ్: నొయిడాలో భారీ అగ్నిప్రమాదం
ఐవీ కౌంటీ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు
12వ అంతస్తులోని ఫ్లాట్‌లో చెలరేగిన మంటలు
సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది
-
Jun 05, 2026 08:24 IST
ఉమ్మడి మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి: సీఎం
భూసేకరణకు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం
-
Jun 05, 2026 08:10 IST
పల్నాడు: నరసరావుపేటలో పెరిగిన పొలిటికల్ హీట్
అభివృద్ధిపై MLA అరవింద్ బాబు, మాజీ MLA గోపిరెడ్డి పరస్పర సవాళ్లు
అభివృద్ధిపై చర్చకు రావాలన్న MLA అరవింద్‌బాబు
అరవింద్‌బాబు సవాల్‌ను స్వీకరించిన మాజీ MLA శ్రీనివాస్‌రెడ్డి
కోటప్పకొండపై చర్చ పెడదామన్న MLA అరవింద్‌బాబు
-
Jun 05, 2026 07:56 IST
ప్రకాశం: సింగరాయకొండ వద్ద హైవేపై బైక్‌ను ఢీకొన్న లారీ
అల్లిసాహెబ్, నాగూర్ దంపతుల మృతి
మరో వ్యక్తికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jun 05, 2026 07:43 IST
విశాఖ: గంజాయితో పట్టుబడిన నలుగురు యువకుల అరెస్ట్
టాస్క్‌ఫోర్స్, భీమిలి పోలీసుల సంయుక్త తనిఖీల్లో పట్టుబడిన యువకుల బృందం
రెండు కిలోల గంజాయి స్వాధీనం
పోలీసుల అదుపులో జొండి అఖిల్, వాసుపల్లి జితేశ్, సాయికుమార్, చెన్నా తేజ సుజీ
-
Jun 05, 2026 07:25 IST
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి
స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న న్యాయమూర్తి జేకే మహేశ్వరి
స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, మంత్రి అనగాని సత్యప్రసాద్
-
Jun 05, 2026 07:23 IST
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం
ఎబోలా లక్షణాలతో మరో ఇద్దరు గాంధీ ఆస్పత్రికి తరలింపు
ఎబోలా హిస్టరీ ఉన్న ముగ్గురు ఒకే విమానంలో వచ్చినట్లు గుర్తింపు
నిన్న సుడాన్ దేశస్థుడికి ఎబోలా లక్షణాల గుర్తింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొనసాగుతున్న హెల్త్ స్క్రీనింగ్
-
Jun 05, 2026 07:22 IST
తెలంగాణలో నేటి నుంచి డాక్టర్ల సమ్మె.. ఓపీ సేవల బంద్
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కీలక ప్రకటన
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవల బంద్
తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు వైద్యుల పిలుపు
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారని ఆరోపణ
జీవో 38ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్
-
Jun 05, 2026 07:21 IST
నేడు అసోం కేబినెట్ విస్తరణ
9 నుంచి 12 మంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం
-
Jun 05, 2026 07:21 IST
తమిళనాడు: నేడు అన్నామలై కీలక ప్రకటన
సోషల్ మీడియా ద్వారా ఆలోచనలు పంచుకోనున్న అన్నామలై
-
Jun 05, 2026 07:20 IST
నేటి నుంచి తెలంగాణలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ఈ నెల 12 వరకు జరగనున్న టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్షలు రాయనున్న 31,542 మంది విద్యార్థులు
-
Jun 05, 2026 07:19 IST
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు
ఏయూలో మొక్క నాటనున్న చంద్రబాబు
సముద్రపు ఆహార ఉత్పత్తుల ఎగుమతుల వర్క్ షాప్‌లో పాల్గొననున్న సీఎం, పలువురు కేంద్ర మంత్రులు
-
Jun 05, 2026 07:17 IST
నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాజెక్ట్, రిజర్వాయర్ పనులను పరిశీలించనున్న సీఎం రేవంత్
సాయంత్రం 6:30 గంటలకు జడ్చర్లలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం
-
Jun 05, 2026 07:01 IST
నేడు RBI ద్రవ్య పరపతి సమీక్ష
కీలక వడ్డీ రేట్లను ప్రకటించనున్న RBI
-
Jun 05, 2026 07:01 IST
తెలంగాణలో నేటి నుంచి భూముల మార్కెట్ ధరల పెంపు
భూముల రేట్లు ఏరియాను బట్టి 50 నుంచి 100 శాతం పెంపు
ప్రైమ్ ఏరియాలో ధరలు 100 శాతం పెంపు: మంత్రి పొంగులేటి
వ్యాల్యూ పెరగటంతో ప్రభుత్వానికి రూ.1200 నుంచి రూ.1400 కోట్ల ఆదాయం
శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడలో ధరల పెంపు లేదు: పొంగులేటి
-
Jun 05, 2026 06:50 IST
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత
మళ్లీ ముదురుతున్న మంజీర సరిహద్దు వివాదం
నేడు రెండు రాష్ట్రాల అధికారుల మధ్య జాయింట్ సర్వే
-
Jun 05, 2026 06:45 IST
ఏపీ టెట్-2026 నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఆగస్టులో పరీక్షల నిర్వహణ
-
Jun 05, 2026 06:44 IST
ఎన్టీఆర్: నేడు మూలపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మూలపాడు సీతాకోకచిలుకల పార్క్‌ను సందర్శించనున్న పవన్
-
Jun 05, 2026 06:43 IST
నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన
పోలవరం, కాకినాడ, తూ.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరులో పిడుగులతో కూడిన వర్షాలు
మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
-
Jun 05, 2026 06:39 IST
రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణకు రుతుపవనాలు
అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
మరోవైపు కొన్ని జిల్లాల్లో కొనసాగుతున్న ఎండ తీవ్రత
-
Jun 05, 2026 06:37 IST
నల్లగొండ: మిర్యాలగూడలో ఓ ఇంట్లో పేలిన సిలిండర్
నిద్రలోనే అమ్మమ్మ, మనవడు, మనవరాలు సజీవదహనం
మృతులు చంద్రమ్మ(50), లక్ష్మణ్(17), ప్రణతి(14)
కలాల్‌వాడలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పేలిన సిలిండర్