-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 27th June 2026 VK
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 27 , 2026 | 07:03 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 27, 2026 21:55 IST
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆదేశాలు
శ్లాబ్ విస్తీర్ణానికి పరిమితుల విధింపు
ముందు భాగంలో 3 అడుగుల వరకే శ్లాబ్ పొడిగింపు
మిగిలిన మూడు వైపులా ఒక్కో అడుగుకే అనుమతి
600 స్క్వేర్ ఫీట్ ఇంటికి 750 స్క్వేర్ ఫీట్ స్లాబ్ మించరాదు
400 స్క్వేర్ ఫీట్ ఇంటికి 500 స్క్వేర్ ఫీట్ స్లాబ్ పరిమితి
నిర్మాణంలో ఉన్న ఇళ్లకూ కొత్త నిబంధనల వర్తింపు
నిర్మాణ వ్యయం, అప్పుల భారం తగ్గించేందుకే నిర్ణయం
-
Jun 27, 2026 21:47 IST
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డీజీపీతో మాట్లాడిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
పోలీసుల అదుపులో ఇప్పటికే ముగ్గురు నిందితులు
-
Jun 27, 2026 21:33 IST
భారత్, పాక్.. తెర వెనుక చర్చలు!
పాక్ మీడియాలో కథనాలు
ఇరు దేశాల రిటైర్డ్ అధికారుల సమక్షంలో సమావేశం
కొలంబో వేదికగా సమావేశం జరిగినట్టు కథనాలు
-
Jun 27, 2026 21:33 IST
భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం
ముంబైలో వెలుగు చూసిన ఘటన
నిందితుడు ఫయాజ్ నుంచి విషపు గుళికలు స్వాధీనం
ఫయాజ్ పలుమార్లు ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లొచ్చినట్టు దర్యాప్తులో వెల్లడి
-
Jun 27, 2026 21:32 IST
ఈనెల 29 నుంచి జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ
పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమాచార సేకరణ
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశీలకుడు సహా కమిటీ సభ్యులను నియమించిన జనసేనాని పవన్ కల్యాణ్
-
Jun 27, 2026 21:31 IST
నంద్యాల: కానాల గ్రామ శివారులో యువకుడి దారుణ హత్య
బీరు బాటిల్‌తో కొట్టి యువకుడిని హత్యచేసిన దుండగులు
-
Jun 27, 2026 21:23 IST
తెలంగాణలో SIR ప్రక్రియ.. డోర్ టూ డోర్ సర్వే వేగవంతం
ఇప్పటివరకు 1,02,75,000 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా 30.08 శాతం సర్వే పూర్తి
-
Jun 27, 2026 21:19 IST
అమరావతి రైతుల పేరుతో వైసీపీ కొత్త డ్రామా: మంత్రి అచ్చెన్న
రైతుల మనోభావాలతో రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు: మంత్రి
తామే బాధితులం అని నటించడం వైసీపీ నైజం: మంత్రి అచ్చెన్న
అమరావతిని నిర్వీర్యం చేసిందే గొడ్డలి పార్టీ: మంత్రి అచ్చెన్న
పోలీసులపై దాడి చేయడం అత్యంత హేయం: మంత్రి అచ్చెన్న
వైసీపీ నేతలకు అమరావతి వెళ్లే నైతిక హక్కు లేదు: మంత్రి అచ్చెన్న
-
Jun 27, 2026 20:55 IST
అమరావతిలో అడుగు పెట్టే అర్హత వైసీపీకి లేదు: రాజధాని రైతులు
వైసీపీ గుండాల దాడులను ఖండిస్తున్నాం: రాజధాని రైతులు
మమ్మల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు: రాజధాని రైతులు
-
Jun 27, 2026 20:39 IST
కుర్చీ కోసం ఆరాటం వైసీపీది: మంత్రి కందుల దుర్గేశ్
ప్రజా సేవ కోసం పోరాటం పవన్ కల్యాణ్‌ది: దుర్గేశ్
పవన్ ఎదుగుదలను చూసి వైసీపీ కాపు నేతలకు కడుపుమంట: దుర్గేశ్
ఇచ్చిన మాటపై నిలబడే రాజకీయ నాయకుడు పవన్: దుర్గేశ్
అమరావతిపై మొదటినుంచీ వైసీపీ కక్షగట్టింది: దుర్గేశ్
ఏపీలో అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది: దుర్గేశ్
-
Jun 27, 2026 20:33 IST
కర్మ ఎవరినీ వదిలిపెట్టదని వైసీపీ నేతలు తెలుసుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర
ఐదేళ్లపాటు రాజధాని రైతులను ముప్పుతిప్పలు పెట్టి హింసించారు: రవీంద్ర
రైతు పరిరక్షణ సమితి పేరుతో 3 రాజధానుల డ్రామా ఆడారు: కొల్లు
ఇప్పుడు మళ్లీ రైతు పరిరక్షణ పేరుతో అమరావతి రైతులతో ఆటలాడాలని చూసినందుకు రైతులు గుణపాఠం చెప్పారు: మంత్రి కొల్లు
రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తే ఉపేక్షించం: మంత్రి కొల్లు
-
Jun 27, 2026 20:21 IST
తిరుమల: భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
భక్తుల రద్దీ నేపథ్యంలో రేపు, ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటన
కరెంట్ బుకింగ్‌లో జారీచేసే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను రెండు రోజులపాటు రద్దు చేస్తున్నట్టు వెల్లడి
-
Jun 27, 2026 20:03 IST
RS ప్రవీణ్ భద్రతలో అనుమానాలు అవసరంలేదు: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
సీఎం రేవంత్ స్వయంగా తన భద్రత కుదించుకున్నారు: అద్దంకి
సీఎం కాన్వాయ్‌లో జామర్, అంబులెన్స్ కూడా లేవు: అద్దంకి
సీఎం రేవంత్ కాన్వాయ్‌లో 3 వాహనాలే ఉన్నాయి: అద్దంకి
సీఎం రేవంత్‌కు ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా లేదు: అద్దంకి
రాజకీయాల కోసం భద్రత అంశంపై మాట్లాడుతున్నారు: అద్దంకి
-
Jun 27, 2026 19:58 IST
SBI-తెలంగాణ ప్రభుత్వం మధ్య చర్చలు సఫలం
రాయదుర్గం భూముల వివాదానికి తెర
ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు SBI అంగీకారం
SBI బోర్డు ఆమోదం తర్వాత తదుపరి చర్యలు
-
Jun 27, 2026 19:54 IST
రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
మ.3.35కి కనగల్ AMC మార్కెట్ యార్డు ప్రాంగణంలో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం
సా.4 గంటలకు నల్గొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌కు రేవంత్
రూ.83 కోట్లతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1కు శంకుస్థాపన చేయనున్న రేవంత్
అనంతరం సీఎం రేవంత్ బహిరంగ సభ
-
Jun 27, 2026 19:51 IST
జమ్మూకశ్మీర్: గల్మార్గ్‌లో భారీ పేలుడు
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
-
Jun 27, 2026 19:47 IST
అఫ్గానిస్థాన్‌లో భూకంపం, తీవ్రత 6.2గా నమోదు
జమ్మూకశ్మీర్ వరకు భూ ప్రకంపనలు
పంజాబ్, హరియాణా, హిమాచల్‌లోనూ ప్రకంపనలు
ఢిల్లీలోనూ స్వల్పంగా కంపించిన భూమి
-
Jun 27, 2026 19:36 IST
విశాఖ సీపీని కలిసిన రాధా గాయత్రి తల్లిదండ్రులు
శ్రీచరణ్ పెద్ద క్రిమినల్: రాధా గాయత్రి తండ్రి
మా అమ్మాయిని శ్రీచరణే హత్య చేసాడు: రాధా గాయత్రి తండ్రి
తల్లితండ్రులు లేకుండా శవ పంచనామా చేశారు: రాధా గాయత్రి తండ్రి
శ్రీచరణ్ మృగంలా ప్రవర్తిస్తున్నాడు: రాధా గాయత్రి తల్లి
మాకు న్యాయం జరిగేవరకు పోరాడతాం: రాధా గాయత్రి తల్లి
-
Jun 27, 2026 19:29 IST
అమరావతి: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
ఉండవల్లిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్
49.2 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు
-
Jun 27, 2026 19:16 IST
ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్
తిరుపతి ఎయిర్‌పోర్టు మినహా అన్ని ఎయిర్‌పోర్టులకు వర్తింపు
ఎయిర్‌పోర్టు ఆపరేటర్ సిఫారసు ఉంటేనే బార్ లైసెన్స్ మంజూరు
బార్ లైసెన్స్ దరఖాస్తుకు రూ.5లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు
ప్రయాణికుల రద్దీ 20 లక్షలకు పైగా ఉన్న ఎయిర్‌పోర్టులకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ.25లక్షలు
-
Jun 27, 2026 19:07 IST
నిజామాబాద్: వర్ని మండలం సత్యనారాయణపురంలో మిస్సింగ్ కలకలం
భార్య, ఇద్దరు కుమార్తెల అదృశ్యంపై పోలీసులకు భర్త ఫిర్యాదు
5 రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన తల్లి కల్పన, కుమార్తెలు అక్షర, శ్రీవిద్య
-
Jun 27, 2026 19:06 IST
ఢిల్లీ: ఎర్రకోట బాంబు పేలుడు కేసులో మరో ముగ్గురిపై ఎన్ఐఏ సప్లమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు
జమ్మూకశ్మీర్‌కు చెందిన జమీర్ హమ్మద్ అహంగేర్, తుఫైల్ అహ్మద్ భట్, ముజఫర్ అహ్మద్‌పై సప్లమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు
గతంలో 10 మంది నిందితులపై 7500 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
ఎర్రకోట కారుబాంబు పేలుడు ఘటనలో 11 మంది మృతి, 20 మందికి గాయాలు
-
Jun 27, 2026 18:42 IST
నెల్లూరు: తోటపల్లి గూడూరు మం. కొత్తకోడూరులో విషాదం
సముద్రంలో యువకుడు రుక్సానా, బాలుడు సోఫియాన్ గల్లంతు
రొట్టెల పండుగ కోసం చిత్తూరు నుంచి వచ్చిన ఇద్దరి గల్లంతు
గల్లంతైన వారికోసం కొనసాగుతున్న గాలింపు
-
Jun 27, 2026 18:13 IST
హైదరాబాద్: TGERCకి రూ.11.65 కోట్ల నిధుల మంజూరు
2026-27 ఏడాదికి జీతాల చెల్లింపులకు పరిపాలన అనుమతి
నెలవారీ పరిమితులకు లోబడి నిధుల వినియోగానికి అనుమతి
మొత్తం రూ.22.65 కోట్లలో TGERC వాటా రూ.11.65 కోట్లు
SBI TGERC ఖాతాకు నిధులు జమచేయాలని ఆదేశాలు
ఖర్చుల వివరాలతో యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించాలని ఆదేశం
-
Jun 27, 2026 18:03 IST
ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు
హైదరాబాద్ మెట్రో రైల్ అడిషనల్ ఎండీగా అదనపు బాధ్యతలు
జీఓ ఆర్‌టీ నం.920 విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైల్‌లో అదనపు ఎండీగా అజిత్ రెడ్డి నియామకం
నిన్న అజిత్ రెడ్డిని CMO నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం
-
Jun 27, 2026 17:54 IST
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మం. అనంతవరం సమీపంలో రోడ్డు ప్రమాదం
బైక్, మోపెడ్ ఢీ.. ఒకరు మృతి
మరో ముగ్గురి పరిస్థితి విషమం
-
Jun 27, 2026 17:50 IST
కేతన్ కేసులో వెలుగులోకి క్రికెట్ కోణం
పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పిన సియా సోదరుడు
సోదరుడి క్రికెట్ మ్యాచ్‌లు చూడ్డానికి వెళ్లిన సియాతో చేతన్‌కు పరిచయం
దివాళీ పార్టీతో ఇద్దరి మధ్య బలపడిన బంధం
-
Jun 27, 2026 17:37 IST
హైదరాబాద్: CMOలో మరో అధికారి బదిలీ
తెలంగాణ రెరా ఛైర్మన్‌గా శ్రీనివాసరాజు నియామకం
ప్రస్తుతం CMO ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరాజు
-
Jun 27, 2026 17:32 IST
జులై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం
జులై 1న నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న సంజయ్ జాజు
-
Jun 27, 2026 17:16 IST
నేడు రాత్రి హైదరాబాద్‌కు వర్ష సూచన
మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం
-
Jun 27, 2026 17:12 IST
తమిళనాడు పీసీసీ చీఫ్‌గా మాణిక్కం ఠాకూర్ నియామకం
-
Jun 27, 2026 17:03 IST
సీషెల్స్‌లో ప్రధాని మోదీ పర్యటన
విక్టోరియాలో మోదీకి ఘన స్వాగతం
సీషెల్స్‌లో 3 రోజులపాటు సాగనున్న మోదీ పర్యటన
ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు
బొటానికల్ గార్డెన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ
194ఏళ్ల తాబేలును వీక్షించిన మోదీ
ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం
-
Jun 27, 2026 16:39 IST
హైదరాబాద్: KPHBలోని ఇంట్లో చోరీ
3 తులాల బంగారం, రూ.50 వేల నగదు అపహరణ
-
Jun 27, 2026 16:35 IST
ములుగు: తాడ్వాయిలో పిడుగుపాటుతో 21 ఆవుల మృతి
-
Jun 27, 2026 16:19 IST
గుజరాత్: భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ప్రైవేట్ క్యాబ్ సంస్థలపై తీవ్ర విమర్శలు చేసిన అమిత్ షా
రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరించనున్నట్లు వెల్లడి
భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు అక్రమ పోటీ పద్ధతులు అవలంబిస్తున్నారని ఆరోపణ
ప్రజలకు తక్కువ ధరలో, పారదర్శక రవాణా సేవలే లక్ష్యమని వ్యాఖ్యలు
-
Jun 27, 2026 16:14 IST
మార్కాపురం: వైసీపీ కులరాజకీయాలు చేస్తోంది: సీఎం చంద్రబాబు
విజయవాడ సాయికృష్ణ కేసు అంశంలో పవన్ కల్యాణ్‌ను లాగి కుట్రలు చేయాలని చూశారు: చంద్రబాబు
మహిళల మేకప్ గురించి మాట్లాడతారా?: సీఎం చంద్రబాబు
ఆడబిడ్డలను అవమానిస్తారా?: సీఎం చంద్రబాబు
హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?: చంద్రబాబు
ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే వారికదే చివరిరోజు: చంద్రబాబు
రాజకీయాలకు అర్హత లేని పార్టీ.. గొడ్డలి పార్టీ: చంద్రబాబు
-
Jun 27, 2026 15:59 IST
విశాఖ: బాక్సైట్‌పై ప్రభుత్వం ఎలాంటి జీఓ ఇవ్వలేదు: ఎమ్మెల్యే బండారు
జడ్పీ సమావేశంలో కొంతమంది కావాలని వివాదం చేశారు: బండారు
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేసింది: బండారు
సర్వేలు, టెస్టింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు: ఎమ్మెల్యే బండారు
-
Jun 27, 2026 15:29 IST
హైదరాబాద్: మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కూలిన లిఫ్ట్
5వ అంతస్తు నుంచి తెగిపడిన లిఫ్ట్
ఎనిమిది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
ఫ్లాట్ చూసేందుకు వచ్చిన బాధితులు
-
Jun 27, 2026 15:16 IST
మార్కాపురం: గిద్దలూరు మం. కిష్టంశెట్టిపల్లిలో సీఎం చంద్రబాబు
సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: సీఎం చంద్రబాబు
ప్రజల కోసమే కూటమి ఏర్పడింది: సీఎం చంద్రబాబు
ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
-
Jun 27, 2026 15:09 IST
ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు: కిషన్‌రెడ్డి
SIRపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
SIR ప్రక్రియలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి: కిషన్‌రెడ్డి
SIR చేసిన రాష్ట్రాల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది: కిషన్‌రెడ్డి
-
Jun 27, 2026 14:57 IST
US ఓపెన్ టోర్నీ సెమీస్‌కు ఛత్తీస్‌గఢ్ ప్లేయర్ రౌనక్
మిషా జిల్బెర్‌మన్‌పై 23-21, 21-11 తేడాతో రౌనక్ విజయం
38 నిమిషాల్లోనే ఇజ్రాయెల్ టాప్ ప్లేయర్‌ను ఓడించిన రౌనక్
-
Jun 27, 2026 14:43 IST
హైదరాబాద్: VB-G RAM Gపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, సీతక్క, తుమ్మల, వివేక్
-
Jun 27, 2026 14:39 IST
భద్రాచలం కరకట్ట విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
రూ.38 కోట్లతో కరకట్ట విస్తరణ పనులు: మంత్రి తుమ్మల
భద్రాచలానికి కరకట్ట శ్రీరామ రక్ష: మంత్రి తుమ్మల
విస్తరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
-
Jun 27, 2026 14:37 IST
నిజామాబాద్: బస్వాపూర్ శివారులో చిరుత సంచారం
అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
-
Jun 27, 2026 14:33 IST
హైదరాబాద్: లక్షల్లో డబ్బు మోసం చేసిన NRI పూజారి అరెస్ట్
అమెరికా నుంచి తిరిగొస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్
బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jun 27, 2026 14:19 IST
వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదు: అనిత
రైతులను పరామర్శించడానికి వెళ్లారా? లేక రౌడీయిజం చేయటానికి వెళ్లారా?
వారిలో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారో మొత్తం సమాచారం ఉంది: హోంమంత్రి అనిత
-
Jun 27, 2026 14:01 IST
ఏలూరు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఘనంగా ఆర్జీయూకేటీ స్నాతకోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన నీతి ఆయోగ్ సభ్యుడు గోబర్ధన్ దాస్
రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల నుంచి హాజరైన విద్యార్థులు
విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసిన యూనివర్సిటీ ఛాన్స్‌లర్ మధుమూర్తి
-
Jun 27, 2026 13:59 IST
తమిళనాడు: DMK కూటమి నుంచి వైదొలిగిన MDMK
MDMK జనరల్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
ఎన్నికల సమయంలో పరిస్థితులను బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం: MDMK అధినేత వైకో
-
Jun 27, 2026 13:55 IST
నిజామాబాద్: బోధన్‌లో బీజేపీ వినూత్న నిరసన
రాకాసిపేట్ ప్రధాన రోడ్లపై వరినాట్లు వేసిన నేతలు
గుంతలు పూడ్చి, రోడ్లు నిర్మించాలని డిమాండ్
-
Jun 27, 2026 13:54 IST
గిద్దలూరు బయలుదేరిన సీఎం చంద్రబాబు
మార్కాపురం గంటావానిపల్లి నుంచి హెలికాప్టర్‌లో గిద్దలూరు బయలుదేరిన సీఎం చంద్రబాబు
-
Jun 27, 2026 13:53 IST
మార్కాపురం: భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగనివ్వం: సీఎం చంద్రబాబు
బాధిత రైతులందరికీ న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత: సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టుతో నాలుగు జిల్లాల అభివృద్ధి: సీఎం చంద్రబాబు
ప్రతి నిర్వాసిత కుటుంబానికీ పూర్తి న్యాయం చేస్తాం: సీఎం చంద్రబాబు
వెలిగొండ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాం: సీఎం చంద్రబాబు
-
Jun 27, 2026 13:46 IST
మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్ర టెట్ పరీక్ష వాయిదా
ఆదివారం జరగాల్సిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిలిపివేత
పరీక్షకు 24 గంటల ముందే ఠాణెలో పేపర్ లీక్ వెలుగులోకి
ఘటనపై విచారణ ప్రారంభించిన అధికారులు
లీక్ వ్యవహారం నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసిన ప్రభుత్వం
కొత్త పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్న అధికారులు
-
Jun 27, 2026 13:37 IST
పోలీసుల అదుపులో గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్
షాద్ నగర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
సూర్య భాయ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు
తక్కువ ధరకే బంగారం పేరుతో బాధితులను బురిడీ కొట్టించిన సూర్య
హైదరాబాద్ నుంచి షాద్ నగర్ పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
-
Jun 27, 2026 13:36 IST
వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని రాజధానికి వస్తారు: రైతులు
మావిగన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: రాజధాని రైతులు
శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై కోడిగుడ్లతో వైసీపీ శ్రేణులే దాడులు చేశారు: రాజధాని రైతులు
-
Jun 27, 2026 13:21 IST
2005కు ముందు కరెన్సీ నోట్లు చెల్లవన్న ప్రచారంపై స్పష్టత
జూన్ 30 తర్వాత పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవంటూ ప్రచారం
తమ పేరుతో చక్కర్లు కొడుతున్న సర్క్యులర్ నకిలీదని వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పాత కరెన్సీ నోట్ల చెల్లుబాటుపై ఎలాంటి కొత్త ఆదేశాలూ లేవని స్పష్టం
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచన
-
Jun 27, 2026 13:18 IST
అమరావతి: వైసీపీ పర్యటనకు నిరసనగా ఉండవల్లి సెంటర్‌లో రైతుల ధర్నా
నల్ల బ్యాడ్జీలు ధరించి... వైసీపీ గో బ్యాక్ అంటూ రాజధాని రైతుల నినాదాలు
పెనుమాక, కృష్ణాయపాలెంలో రైతుల నిరసన ర్యాలీ
రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని డిమాండ్
-
Jun 27, 2026 13:17 IST
హైదరాబాద్: ప్రజాభవన్‌లో సెర్ప్ ఆధ్వర్యంలో ఈ-ఆటోల పంపిణీ
దివ్యాంగుల నైబర్‌హుడ్ కేంద్రాలకు ఈ-ఆటోల పంపిణీ కార్యక్రమం
కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క
పాల్గొన్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, సీఈవో దివ్య దేవరాజన్
-
Jun 27, 2026 13:16 IST
వరంగల్‌లో పేదల ఇళ్ల కూల్చివేతపై వామపక్షాల నిరసన
ఏకశిలా పార్క్‌కు భారీగా వామపక్ష నాయకులు, కార్యకర్తలు
ఎర్రజెండాలు పట్టుకుని ఏకశిలా పార్క్ ఎదుట బైఠాయింపు
కాసేపట్లో హనుమకొండ కలెక్టర్ ముట్టడికి వామపక్ష శ్రేణులు
-
Jun 27, 2026 13:12 IST
సాయికృష్ణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
క్రిమినల్‌కు కులం ఎలా అంటగడతారు?: పవన్
తప్పు ఎవరు చేసినా.. తప్పే: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jun 27, 2026 13:09 IST
తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి
భాగ్యరాజ్ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: చిరంజీవి
-
Jun 27, 2026 12:41 IST
పోలవరం: మారేడుమిల్లి ఘాట్ రోడ్‌లో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు
బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పిన బస్సు
బస్సు లోయలోకి పడిపోకుండా చాకచక్యంగా అదుపు చేసిన డ్రైవర్
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు
-
Jun 27, 2026 12:16 IST
అమరావతి: వైసీపీతో నాకెలాంటి శత్రుత్వం లేదు: పవన్ కల్యాణ్
వారి విధివిధానాలను ప్రశ్నిస్తే.. నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: పవన్
మెత్తగా ఉండాలి కానీ.. మరీ మౌనంగా ఉంటే చేతకాని తనంగా చూస్తారు: పవన్
అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు: పవన్
ఇప్పుడూ అదే విధంగా మాట్లాడుతున్నారు.. తగ్గకండి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jun 27, 2026 12:15 IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద చిరుత కనిపించిందంటూ ప్రచారం
చిన్మయ స్కూల్ సమీపంలో చిరుత కనిపించిందన్న స్థానికులు
చిరుత ఆనవాళ్లు గుర్తించే ప్రయత్నంలో అటవీశాఖ సిబ్బంది
చిరుత కనిపించిందన్న వార్తలతో భయాందోళనకు గురవుతున్న స్థానికులు
-
Jun 27, 2026 12:10 IST
శంషాబాద్ వస్తున్న విమానంలో బాలిక మృతి
ఇథియోపియా నుంచి క్యాన్సర్ వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్న బాలిక
విమానంలో బాలికకు సడన్‌గా అస్వస్థత
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి
-
Jun 27, 2026 12:04 IST
అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం అలర్ట్
ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ ప్రారంభం
ఇకపై 'హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్' ఫామ్ తప్పనిసరి చేసిన కేంద్రం
విమానం ఎక్కడానికి 24 గంటల ముందే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి
-
Jun 27, 2026 12:03 IST
కేంద్ర ప్రభుత్వంపై సోనియాగాంధీ తీవ్ర విమర్శలు
పశ్చిమాసియా సంక్షోభంపై కేంద్రం తీరు సరిగా లేదు: సోనియా గాంధీ
ప్రధాని మోదీ మౌనం దేశ ప్రయోజనాలను దెబ్బతీసింది
పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా గాంధీ
-
Jun 27, 2026 11:08 IST
ఫిఫా వరల్డ్ కప్2026: నాకౌట్‌కు చేరిన ఈజిప్ట్
1-1తో డ్రాగా ముగిసిన ఇరాన్, ఈజిప్ట్ మ్యాచ్
నాకౌట్‌లో తొలి రెండు స్థానాల్లో బెల్జియం, ఈజిప్ట్
మూడో స్థానం కోసం పోటీ పడుతున్న ఇరాన్
-
Jun 27, 2026 10:14 IST
తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
గుండెపోటుతో కె.భాగ్యరాజ్ (73) మృతి
75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్, 25 సినిమాలకు దర్శకత్వం
రచయిత, దర్శకుడు, నటుడిగా విశేష గుర్తింపు పొందిన భాగ్యరాజ్
భాగ్యరాజ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు

-
Jun 27, 2026 10:06 IST
కృష్ణా జిల్లా: పామర్రులో భారీ వర్ష బీభత్సం
అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
జలమయమైన పామర్రు రోడ్లు, వీధులు
నీట మునిగిన పామర్రు తహసీల్దార్ కార్యాలయం
కార్యాలయ గదుల్లోకి చేరిన వర్షపు నీరు
-
Jun 27, 2026 10:02 IST
కర్నూలు: మార్కెట్‌లోకి వచ్చిన జొన్నగిరి గోల్డ్
100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్ల అమ్మకాలు
బంగారు బిస్కెట్లపై ఆంధ్రప్రదేశ్ మ్యాప్
మన ఇంటికి మన బంగారం పేరుతో విక్రయాలు
-
Jun 27, 2026 09:58 IST
సిద్దిపేట: అక్బర్ పేట భూంపల్లి మండలం చౌదర్‌పల్లిలో దారుణం
బండారి రాములు గొర్రెల మందపై వీధి కుక్కల దాడి
10 గొర్రెలు అక్కడికక్కడే మృతి, గాయపడిన 50 గొర్రెలు
-
Jun 27, 2026 09:57 IST
హిమాచల్‌ప్రదేశ్: సిమ్లా జిల్లాలో ఘోర ప్రమాదం
రాంపూర్‌లో లోయలో పడ్డ వ్యాన్, ఆరుగురి మృతి
-
Jun 27, 2026 09:57 IST
సీషెల్స్.. భారత్‌కు కీలక సముద్రతీర భాగస్వామి: ప్రధాని మోదీ
సీషెల్స్ పర్యటనతో ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం
సముద్ర సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నా: ప్రధాని మోదీ
-
Jun 27, 2026 09:44 IST
ఇరాన్‌కు ఇంకా దాడులు చేసే సామర్థ్యం ఉంది: ట్రంప్
US అడ్డుకోకపోతే.. ఘర్షణలు మళ్లీ సుదీర్ఘంగా కొనసాగుతాయి: ట్రంప్
హింసకు ప్రతిస్పందన హింసే: జేడీవాన్స్
-
Jun 27, 2026 09:42 IST
పాకిస్థాన్‌లో భూకంపం
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.4గా నమోదు
ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా రాని స్పష్టత
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూకంప కేంద్రం
-
Jun 27, 2026 09:42 IST
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
11శాతం పీఆర్సీ జులై జీతాల నుంచే అమలు: మంత్రి పొన్నం
త్వరలో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తాం: పొన్నం
గుర్తింపు సంఘాల ఎన్నికల తర్వాత విలీన కమిటీ ఏర్పాటు
విలీన కమిటీలో కార్మిక ప్రతినిధులకు చోటు: మంత్రి పొన్నం
కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రచారాలను నమ్మొద్దు: పొన్నం
-
Jun 27, 2026 09:15 IST
కామారెడ్డి: మాచారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు
అనిల్ అనే యువకుడి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 27, 2026 08:49 IST
విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు
లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజల ఇబ్బందులు
నేడు, రేపు వర్షాలు పడతాయని హెచ్చరించిన వాతావరణ శాఖ
-
Jun 27, 2026 08:29 IST
అమెరికా దాడులపై మండిపడ్డ ఇరాన్
చర్చల మధ్యలో దాడులు చేయడం శాంతి ఒప్పందాన్ని అమెరికా కాలరాయడమే: ఇరాన్
ఒప్పంద ఉల్లంఘన అమెరికాకే నష్టం: ఇరాన్
అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: ఇరాన్
-
Jun 27, 2026 08:20 IST
నేడు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ భేటీ
మంగళగిరిలో ఉదయం 10గంటలకు సమావేశం
పరిశీలకులు, కమిటీ సభ్యులతో భేటీకానున్న పవన్ కల్యాణ్
కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jun 27, 2026 08:19 IST
భద్రాద్రి: నేడు కొత్తగూడెంలో మంత్రి తుమ్మల పర్యటన
గోదావరి వరదల సన్నద్ధతపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
-
Jun 27, 2026 08:19 IST
భద్రాచలం రామాలయ విస్తరణ పనులకు నేడు శ్రీకారం
ఆలయ అభివృద్ధి పనులకు రూ.586 కోట్లతో మాస్టర్ ప్లాన్
తొలి విడతలో రూ.200 కోట్ల నిధులతో ఆలయ విస్తరణ
వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం
-
Jun 27, 2026 08:18 IST
కడప జిల్లా చెన్నూరులో రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. ముగ్గురి మృతి
పలువురికి స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 27, 2026 07:23 IST
నేడు నెల్లూరు బారాషహీద్ దర్గాలో గంధమహోత్సవం
బారాషహీద్ దర్గా వద్ద అట్టహాసంగా కొనసాగుతున్న రొట్టెల పండుగ
ఈ రోజు రాత్రికి గంధమహోత్సవం
దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులు
జనసంద్రంగా మారిన బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతం
నగరంలోని రోడ్లన్నీ భక్తులు, వాహనాలతో కిటకిట
ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న రొట్టెల పండుగ
రొట్టెల పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి
-
Jun 27, 2026 07:12 IST
వెనెజువెలాలో మరో భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 4.9గా తీవ్రత నమోదు
రెండురోజుల క్రితమే 2 వరుస భూకంపాలతో వెనెజువెలాలో మారణహోమం
ఇప్పటివరకు 920 మంది మృతి, 3 వేల మందికి గాయాలు
భవన శిథిలాల కింది చిక్కుకున్న వేలాది మంది కోసం రెస్క్యూ ఆపరేషన్
-
Jun 27, 2026 07:10 IST
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఉదయం 10:45కు గంటావానిపల్లి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
గంటావానిపల్లిలో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనుల పరిశీలన
వెలిగొండ లబ్ధిదారులు, నిర్వాసితులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
నిర్వాసితులకు రూ.300 కోట్లు పరిహారం పంపిణీ చేయనున్న సీఎం
మధ్యాహ్నం గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
కిష్టంశెట్టిపల్లి హాస్పిటల్‌లో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌కు ప్రారంభోత్సవం
లబ్ధిదారులతో ముఖాముఖిలో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు
ప్రజావేదిక సభలో పాల్గొని, ఆ తర్వాత కార్యకర్తల భేటీలో పాల్గొననున్న సీఎం
-
Jun 27, 2026 07:05 IST
ఢిల్లీ: జులై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్‌లో జపాన్ ప్రధాని పర్యటన
ఇండియా-జపాన్ 16వ సమ్మిట్‌లో పాల్గొననున్న జపాన్ ప్రధాని
టకాయిచీ, ఇరుదేశాల మధ్య సహకారం మరింత పెంచుకునే అవకాశం
-
Jun 26, 2026 07:08 IST
నేటి నుంచి సీషెల్స్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన
సీషెల్స్ దేశ స్వర్ణోత్సవాలకు హాజరుకానున్న మోదీ