Share News

పాకిస్థాన్‌లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన పాక్ ప్రజలు..

ABN , Publish Date - Jun 27 , 2026 | 10:08 AM

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెనుజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు సంభవించి పెను విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది.

పాకిస్థాన్‌లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన పాక్ ప్రజలు..
Pakistan Earthquake

ఇస్లామాబాద్: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెనుజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు సంభవించి పెను విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా పాకిస్థాన్‌లోనూ భూకంపం వచ్చింది.


ఈరోజు (శనివారం) ఉదయం 8:36 గంటలకు పాక్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. దీని కేంద్రం 30.271° ఉత్తర అక్షాంశం, 69.733° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఈ భూకంపంతో పాక్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు.


కాగా, వెనుజువెలాలో గత బుధవారం సంభవించిన రెండు భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలో సుమారు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోగా.. 3 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 50 వేల మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వేల మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇవాళ (శనివారం) ఉదయం కూడా వెనుజువెలాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి

వెనుజువెలాలో మరోసారి భూ ప్రకంపనలు..

అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం..

Updated Date - Jun 27 , 2026 | 10:23 AM