Share News

ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:59 AM

అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రారంభించారు.

ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి
International Travelers

ఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రయాణికులకు (International Travelers) భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రారంభించారు. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులందరికీ 'హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్' ఫారమ్ తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. భారతదేశానికి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కడానికి 24 గంటల ముందే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.


గత 21 రోజుల ప్రయాణ చరిత్ర, ఆరోగ్య లక్షణాలను పోర్టల్‌లో ఖచ్చితంగా పొందుపరచాల్సిందేనని అధికారులు తెలిపారు. ఎబోలా, బుండిబుగ్యో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, విమానయాన శాఖలు అప్రమత్తమయ్యాయని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారు https://airsuvidha.civilaviation.gov.in/ ఈ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.


విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వేగంగా పూర్తి కావడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరని అధికారులు తేల్చిచెప్పారు. ప్రయాణికులకు బోర్డింగ్ సమయంలో, విమానంలోనూ ముందస్తు అలర్ట్ జారీ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించారు. డౌన్‌లోడ్ చేసిన హెల్త్ డిక్లరేషన్ ఫారమ్‌ను ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద చూపించడం తప్పనిసరని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 01:01 PM