-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Breaking Live Updates of 19th May 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 19 , 2026 | 06:27 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 19, 2026 21:21 IST
హైదరాబాద్: జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ అరెస్ట్..
హైదరాబాద్ మల్లాపూర్‌లోని లక్ష్మీకుమార్ నివాసంలో ముగిసిన ఏసీబీ రైడ్స్
అనంత లక్ష్మి కుమార్‌ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
మెడికల్ టెస్టులు చేసిన అనంతరం కుమార్‌ను ఏసీబీ కార్యాలయానికి తరలింపు
భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ
రేపు ఉదయం రిమాండ్‌కు తరలించే అవకాశం
-
May 19, 2026 21:06 IST
సిద్దిపేట : తొగుటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
ఈదురు గాలులకు రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లు
తీవ్రంగా దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు
-
May 19, 2026 20:16 IST
మెదక్ జిల్లాలో అకాల వర్షం.. ఈదురుగాలుల బీభత్సం
అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇంటి పైకప్పు
వర్షానికి తడిచిపోయిన వరి ధాన్యం
అల్లాదుర్గంలో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం
గోడౌన్ కప్పు ఎగిరిపోవడంతో తడిచిన ధాన్యం బస్తాలు
-
May 19, 2026 19:56 IST
హైదరాబాద్: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైకో హల్‌చల్
ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సైకో
తనకు వైద్యం చేయాలని కత్తితో బెదిరింపులకు పాల్పడిన సైకో
ఆసుపత్రి నుంచి పరారైన హాస్పిటల్ సిబ్బంది
సర్జికల్ కత్తితో దాడికి పాల్పడిన సైకో
ఇద్దరికి గాయాలు, సైకోను పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
-
May 19, 2026 19:35 IST
230 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలోని ఓ రైస్ మిల్‌పై సీసీఎస్ టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు
రైస్ మిల్లులో 230 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
-
May 19, 2026 18:46 IST
భారీగా నకిలీ వరి విత్తనాల సీజ్
మంచిర్యాల: రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద కోటపల్లి పోలీసుల తనిఖీలు
రూ.21లక్షల విలువైన నకిలీ వరి విత్తనాలను సీజ్ చేసిన పోలీసులు
మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్టు ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడి
-
May 19, 2026 18:12 IST
తెలంగాణ కేబినెట్ సమావేశం 21 నుంచి 23కు మార్పు
21న సరస్వతి అంత్య పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో 23కు మార్పు
23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం
యాదగిరిగుట్టలో వేద పాఠశాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
May 19, 2026 17:51 IST
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
పండుగ వాతావరణంలో సాంస్కృతిక ప్రదర్శనలు
ఆవిర్భావ వేడుకలకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు
ఈనెల 25 నుంచి పరేడ్ గ్రౌండ్‌లో రిహార్సల్స్
-
May 19, 2026 17:50 IST
HCU దగ్గర చెరువులో దూకి ఎంఏ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య
మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన మయాంక్ కుందు
గతంలో HCUలో రెండు ల్యాప్‌టాప్‌లను చోరీ చేశాడని ఆరోపణలు
ఇవాళ మరో ల్యాప్‌టాప్ పోవడంతో మయాంక్‌పై మళ్లీ ఆరోపణలు
మనస్తాపంతో చెరువులో దూకి మాయాంక్ కుందు ఆత్మహత్య
-
May 19, 2026 17:19 IST
ఏపీ మోడల్ స్కూల్స్ కాంట్రాక్ట్ సిబ్బంది సేవల పొడిగింపు
123 ఫిజికల్ డైరెక్టర్లు, 120 కంప్యూటర్ టీచర్ల సేవల పునరుద్ధరణ
2026 జూన్ నుంచి 2027 ఏప్రిల్ వరకు సేవల పొడిగింపు
-
May 19, 2026 17:19 IST
తమిళనాడు: ఫేక్ న్యూస్, Ai ప్రచారాలపై తీవ్రంగా స్పందించిన స్టాలిన్
సోషల్ మీడియాలో TVK ఐటీ వింగ్ దుష్ప్రచారం: మాజీ సీఎం స్టాలిన్
కొంతమందిని కొంతకాలం మాత్రమే మోసం చేయగలరు..
అందరినీ అన్నివేళలా మోసం చేయలేరు: మాజీ సీఎం స్టాలిన్
-
May 19, 2026 17:18 IST
TG PGECET-2026: మే 28న జరగాల్సిన పరీక్ష జూన్ 1కి వాయిదా
మే 29-31 పరీక్షలు యథావిధిగా నిర్వహణ
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన
-
May 19, 2026 17:00 IST
బైకును ఢీకొన్న లారీ.. మహిళ మృతి
యాదాద్రి : చౌటుప్పల్ పట్టణంలో ప్రమాదం..
బైకును ఢీకొన్న లారీ.. తల్లి మృతి, కుమారుడికి గాయాలు..
మృతురాలు దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన ఏనుగు అనసూయగా గుర్తింపు
-
May 19, 2026 16:32 IST
అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు భారత వన్డే, టెస్టు జట్ల ఎంపిక
బుమ్రాకు రెస్ట్
వన్డేల్లో పంత్‌కు దక్కని అవకాశం
టెస్టు సిరీస్ కెప్టెన్‌గా గిల్, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2026లో ఆడుతున్న పలువురు యువ ప్లేయర్లకు అవకాశం
-
May 19, 2026 16:21 IST
నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన
గస్తీ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ పెట్రోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం
తమిళనాడు, పుదుచ్చేరి మరబోట్ల కదలికలపై శాటిలైట్ చిత్రాల సాయం తీసుకోవాలని దిశానిర్దేశం
GPS ట్రాకింగ్‌ను విస్తృతంగా వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచన
-
May 19, 2026 16:14 IST
తెలంగాణ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్
Employee Health Care Trust ఏర్పాటు
ఉద్యోగులు, పెన్షనర్ల డేటా సేకరణకు ఆదేశాలు
కుటుంబ సభ్యుల వివరాలు కూడా తప్పనిసరి
మే 31లోపు IFMIS-HRలో అప్‌లోడ్ చేయాలి
అన్ని శాఖలకూ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అత్యవసర సూచనలు
-
May 19, 2026 15:50 IST
ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు..
114 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
31 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.52గా ఉంది
-
May 19, 2026 15:36 IST
తెలంగాణ: రేపటి నుంచి పెరగనున్న ఎండ తీవ్రత..
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఈరోజు రెడ్ అలెర్ట్
మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
అత్యవసరమైతే తప్ప.. ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్న అధికారులు
-
May 19, 2026 15:11 IST
వైఎస్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారు: షర్మిల
వైఎస్ పేరు చెప్పుకొని జగన్ సీఎం అయ్యారు: షర్మిల
స్విచ్‌లు నొక్కితేనే మళ్లీ సీఎం అవ్వలేరని తెలుసుకోవాలి..
సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు..
వైసీపీ పాలనలో ప్రజలపై ఎంతభారం మోపారో మరిచారా..
బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారు: షర్మిల
-
May 19, 2026 14:57 IST
కృష్ణా: జగన్ పాలనలోనే దళితులపై దాడులు: మంత్రి కొల్లు
దళితులపై దాడులను ఎవరూ మరిచిపోలేరు: మంత్రి కొల్లు
ఇప్పుడు మళ్లీ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు..
అధికారులకు కులాలు అంటగట్టి దూషిస్తున్నారు..
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ: మంత్రి కొల్లు
-
May 19, 2026 14:47 IST
పశ్చిమ బెంగాల్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
ఫల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ నుంచి తప్పుకొన్న టీఎంసీ అభ్యర్థి
నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారనున్న పోటీ
-
May 19, 2026 14:35 IST
పాలమూరుపై కేసీఆర్‌ది సవతి ప్రేమ: మంత్రి జూపల్లి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: మంత్రి జూపల్లి
కాళేశ్వరం పూర్తి చేసినట్టు.. పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తిచేయలేదు?
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తుంటే BRS ప్రభుత్వం ఏం చేసింది?
కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందే BRS ప్రభుత్వం: మంత్రి జూపల్లి
-
May 19, 2026 14:34 IST
టీడీపీలో 200 కుటుంబాల చేరిక
విజయనగరం: MLA అదితి గజపతి సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 200 కుటుంబాలు
-
May 19, 2026 13:55 IST
మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో చెలరేగిన మంటలు
రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
-
May 19, 2026 13:29 IST
యూపీ: రాయ్‌బరేలిలో రాహుల్‌గాంధీ పర్యటన
దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది: రాహుల్
సామాన్యుల కష్టాలు మరింత పెరగబోతున్నాయి: రాహుల్
మోదీ ఆర్థిక విధానాలే దీనికి కారణం: రాహుల్
-
May 19, 2026 13:27 IST
ఉమ్మడి మహబూబ్‌నగర్ మంత్రులు, MLAలతో సీఎం రేవంత్ సమీక్ష
పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై కీలక సూచనలు చేసిన రేవంత్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: సీఎం
ఇతర ప్రాజెక్టులకూ వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలి: సీఎం
-
May 19, 2026 13:26 IST
జగిత్యాల: ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జి సీజ్
కరీంనగర్ PMJ జ్యువెలరీలో దోపిడీకి ముందు విజయలక్ష్మి లాడ్జిలోనే 2 రోజులు నిందితుల మకాం
దొంగల ఫొటోలు చూసి కూడా సమాచారం ఇవ్వని లాడ్జి ఓనర్
సమాచారం ఇచ్చి ఉంటే దర్యాప్తు వేగవంతం అయ్యేదని భావన
అనుమతి లేదని లాడ్జిని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు
-
May 19, 2026 13:25 IST
ఆకివీడు రామాలయం అంశంలో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారు: రఘురామ
ఆలయ స్థలంపై కోర్టు తీర్పు వచ్చే వరకూ ఏ పని జరగదు: డిప్యూటీ స్పీకర్ రఘురామ
రామాలయం నిర్మాణం ఆలస్యం అవ్వదు: రఘురామకృష్ణరాజు
అయోధ్య ఆలయానికి అడ్డొచ్చిన వాళ్లెవరూ సుఖంగా లేరు: రఘురామ
నన్ను కొంతమంది చంపేస్తామని బెదిరిస్తున్నారు: రఘరామ
దేనికీ భయపడేది లేదు.. నాకు రక్షణగా పోలీసులు ఉన్నారు: రఘురామ
-
May 19, 2026 13:19 IST
కడప: పోలీస్ కస్టడీకి వైసీపీ నేత నిత్యానందరెడ్డి
కోర్టు అనుమతితో నిత్యానందరెడ్డికి 2 రోజుల కస్టడీ
పెద్ద దస్తగిరి కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి
-
May 19, 2026 13:15 IST
ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసు
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌కు కోర్టు ధిక్కార నోటీసులు
కేసు విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసిన ధర్మాసనం
-
May 19, 2026 13:10 IST
జిమ్‌కు వెళ్లే మహిళలే లక్ష్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో మతమార్పిళ్లు
ముఠా గుట్టు రట్టు చేసిన యూపీ ప్రభుత్వం
మీర్జాపూర్‌లో జిమ్ ఓనర్ అక్కడకు వచ్చే యువతులపై ఒత్తిడి
యువతి ఫిర్యాదుతో కేసు నమోదు.. విచారణ చేపట్టిన పోలీసులు
ఇప్పటివరకు మతమార్పిళ్ల కేసులో 10 మంది అనుమానితుల అరెస్ట్
-
May 19, 2026 12:37 IST
టీడీపీ DNAలో బీసీలు ఉన్నారు.. మనది తిరుగులేని అనుబంధం: చంద్రబాబు
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలు: సీఎం చంద్రబాబు
పరిశ్రమలు, అభివృద్ధిని గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది: సీఎం చంద్రబాబు
సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం: సీఎం చంద్రబాబు
సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌లో స్థానికులకే ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
-
May 19, 2026 12:23 IST
హైదరాబాద్: జలమండలి GM కుమార్ నివాసంలో ACB తనిఖీలు
8 గంటలుగా 8 ప్రాంతాల్లో కొనసాగుతున్న ACB సోదాలు
మల్లాపూర్‌తో పాటు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు
రూ.1.10 కోట్ల నగదు, కిలో బంగారం, రెండు కార్ల సీజ్
బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ గుర్తించిన ACB అధికారులు
పలు డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్న ACB అధికారులు
-
May 19, 2026 12:09 IST
సంగారెడ్డి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఆందోళన
బీదర్ నుంచి సేకరించిన చెత్తను తెలంగాణ సరిహద్దులో డంపింగ్
డంపింగ్ యార్డుపై న్యాల్కల్‌లోని పలు గ్రామాల అభ్యంతరం
కర్ణాటక నుంచి వచ్చిన చెత్త వాహనాలను అడ్డుకున్న మల్గి గ్రామస్థులు
బీదర్ పోలీసులు తమను బెదిరిస్తున్నారని మల్గి గ్రామస్థుల ఆవేదన
డంపింగ్ యార్డ్ తొలగించాలని స్థానికుల డిమాండ్
-
May 19, 2026 11:58 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి లూలు మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు
పలు ఆహార పదార్థాల్లో పురుగులు, నాసిరకం నిల్వల గుర్తింపు
కిచెన్‌లో అపరిశుభ్రత, పాడైపోయిన కూరగాయలు
FSSAI లైసెన్స్‌తో గడువు ముగిసిన ఫ్యాకేజ్డ్ ఫుడ్ విక్రయం
150 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
May 19, 2026 11:53 IST
కడప: రైల్వేకోడూరు మం. బాలుపల్లి వద్ద ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు
ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలు
ప్రమాదం జరిగిన రెండు వాహనాలకు దగ్గరగా వచ్చి ఆగిన మరో కారు
మంటలు చెలరేగడంతో మూడు వాహనాల దగ్ధం
-
May 19, 2026 11:46 IST
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలవచ్చు: స్టాలిన్
ముందస్తు ఎన్నికలకు పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలి: స్టాలిన్
ఓటమి తాత్కాలికమే: మాజీ సీఎం స్టాలిన్
-
May 19, 2026 11:41 IST
బోటు మనదే.. వేట మనదే: సీఎం చంద్రబాబు
మన జలాల్లోకి వేటకి వస్తే వెంటాడతాం: సీఎం చంద్రబాబు
మన రాష్ట్ర తీరంపై మనకే పూర్తి హక్కులు: సీఎం చంద్రబాబు
ఇతర రాష్ట్రాల బోట్లు వస్తే శాటిలైట్‌తో గుర్తిస్తాం: చంద్రబాబు
ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులకు ఇబ్బందులు ఉండవు: చంద్రబాబు
జువ్వలదిన్నె హార్బర్‌పై త్వరలో పూర్తి: సీఎం చంద్రబాబు
-
May 19, 2026 11:34 IST
విజయవాడ: కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ
భారీగా తరలివచ్చి బోట్ల ప్రదర్శన నిర్వహించిన మత్స్యకారులు
‘మత్స్యకారుల సేవలో’ నిధుల విడుదలపై మత్య్సకార కుటుంబాల హర్షం
-
May 19, 2026 11:20 IST
హైదరాబాద్: గాంధీనగర్‌లోని కవాడిగూడలో మహిళ దారుణహత్య
శ్వేత అనే మహిళను కత్తితో పొడిచి హతమార్చిన దుండగుడు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 19, 2026 11:19 IST
హైదరాబాద్: గాంధీభవన్‌లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం
పార్లమెంట్ ఇన్‌చార్జ్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం
GHMC ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చ
SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ సూచన
జూన్ 25 నుంచి తెలంగాణలో SIR ప్రక్రియ
-
May 19, 2026 11:14 IST
నెల్లూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు
తుమ్మలపెంట చేరుకున్న సీఎం చంద్రబాబు
'మత్స్యకారుల సేవలో' సభలో ప్రసంగించనున్న చంద్రబాబు
తుమ్మలపెంటలో రూ.262 కోట్లు విడుదల చేయనున్న సీఎం
'మత్స్యకారుల సేవలో' నిధులతో 1.30 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున భృతి
-
May 19, 2026 11:03 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో షూటింగ్ ఆశచూపి యువతిపై లైంగిక దాడి
యువతికి మాయమాటలు చెప్పి సినిమా షూటింగ్ ఉందంటూ నమ్మించిన యువకుడు
సికింద్రాబాద్‌లో స్నేహితుడితో కలిసి యువతిపై లైంగిక దాడి
బాధితురాలి ఒంటిపై గాయాలతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన స్నేహితురాలు
జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
-
May 19, 2026 11:01 IST
ఢిల్లీలో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ సమావేశం
కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన భేటీ
హాజరైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, ఉన్నతాధికారులు
-
May 19, 2026 10:55 IST
వీధి కుక్కల తరలింపు ఆదేశాల ఉపసంహరణకు సుప్రీం కోర్టు నిరాకరణ
బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలని గత నవంబర్‌లో ఆదేశం
సదరు ఉత్తర్వును సవరించాలని దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఆదేశాలు అమలుచేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు: సుప్రీం కోర్టు
-
May 19, 2026 10:41 IST
కారులో ముంబై హైకోర్టు మహిళా లాయర్‌పై అత్యాచారం
పుణెలో ఘటన, ముగ్గురు నిందితుల అరెస్ట్
-
May 19, 2026 10:24 IST
యూపీలో రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు
నేరగాళ్లపై యోగి సర్కార్ ఉక్కుపాదం
2017 నుంచి ఇప్పటివరకు 17వేల ఎన్‌కౌంటర్లు
ఎన్‌కౌంటర్లలో 289 మంది క్రిమినల్స్ మృతి
-
May 19, 2026 10:23 IST
అమెరికా: శాంటియాగోలో ఇస్లామిక్ సెంటర్ దగ్గర కాల్పులు
ఇద్దరు దుండగుల కాల్పుల్లో ముగ్గురి మృతి
దాడిలో మసీదు సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురి మృతి
దాడి తర్వాత తుపాకీతో కాల్చుకుని నిందితుల ఆత్మహత్య
-
May 19, 2026 10:23 IST
వీధికుక్కల సమస్యలపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
సుమోటోగా స్వీకరించిన కేసుపై ధర్మాసనం తీర్పు
వీధికుక్కలను తొలగించాలని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం
బహిరంగ ప్రదేశాలు, క్రీడా సముదాయాల్లో కుక్కలు ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశం
వీధికుక్కలను ఆశ్రయ కేంద్రాలకే తరలించాలని ఆదేశం
-
May 19, 2026 10:16 IST
హైదరాబాద్: జలమండలి జీఎం కుమార్ నివాసంలో ACB సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సహా 8 ప్రాంతాల్లో ACB అధికారుల తనిఖీలు
మల్లాపూర్‌లోని కుమార్ నివాసంలో ACB డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సోదాలు
-
May 19, 2026 10:11 IST
బండి భగీరథ్ పోక్సో కేసు అంశంలో మరో సిట్ ఏర్పాటు
హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై దర్యాప్తునకు జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో సిట్
ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు దామోదర్
అనుచిత పోస్టుల అంశంలో మరికొందరిపై కేసులు
-
May 19, 2026 10:07 IST
హైదరాబాద్: శంషాబాద్ ఘాన్సీమియాగూడాలో దొంగల బీభత్సం
తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు
పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసిన దుండగులు
బంగారం, వెండి ఆభరణాలు సహా రూ.15 వేల నగదు అపహరించిన దొంగలు
-
May 19, 2026 10:02 IST
విశాఖ: GVMC వార్డుల పునర్విభజనపై ముసాయిదా విడుదల
GVMCలో 98 నుంచి 120కి వార్డుల పెంపు
ఉత్తర జోన్‌లో కొత్తగా అత్యధిక వార్డులు
భీమిలి, అగనంపూడిలో జోన్లలో అత్యల్పం
ఈ నెల 25వరకు అభ్యంతరాల స్వీకరణ
-
May 19, 2026 09:26 IST
చెన్నైలో భారీ బ్యాంక్ మోసం కేసులో ఈడీ దాడులు
తంగం స్టీల్-SBI బ్యాంక్ కేసులో ఈడీ అధికారుల సోదాలు
రూ.300 కోట్ల తంగం స్టీల్ లిమిటెడ్ ఫ్రాడ్ కేసులో చెన్నైలో 8 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు
-
May 19, 2026 09:14 IST
బెంగళూరు: కారులో నిదురిస్తున్న డ్రైవర్ మృతి
పీణ్య పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
రోడ్డు పక్కన కారు ఆపి అందులో నిద్రించిన డ్రైవర్ పునీత్
కారులో నిదురిస్తున్న డ్రైవర్ ను లేపడానికి ప్రయత్నించిన స్థానికులు
ఎంతకీ లేవకపోవడంతో గ్లాస్ పగలగొట్టిన స్థానికులు.
స్వందన లేకపోవడంతో ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు చేసిన పోలీసులు
-
May 19, 2026 09:07 IST
తమిళనాడు: తంజావూరులో కేఎఫ్‌సీ రెస్టారెంట్‌లో పేలిన ఏసీ యంత్రం
ఆరుగురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు
చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు సమాచారం
ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు
-
May 19, 2026 09:05 IST
విజయవాడం: నకిలీ లిక్కర్ కేసులో సిట్, ఎక్సైజ్ అధికారుల ఛార్జ్‌షీట్
25 మందిపై అభియోగాలతో పాటు మొత్తం 89 మందిని సాక్షులుగా చేర్చిన సిట్
1,300 పేజీలతో తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్, ఎక్సైజ్ అధికారులు
జోగి రమేశ్ అండతో A1 జనార్ధన్‌రావు నకిలీ లిక్కర్ తయారు చేసినట్లు ఛార్జ్‌షీట్
-
May 19, 2026 08:43 IST
బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
MCHRDలో హామ్ రోడ్లపై సీఎం సమీక్ష
-
May 19, 2026 08:39 IST
కాంగ్రెస్ ఎంపీ రణదీప్‌సింగ్ సూర్జేవాలాకు సమన్లు
అస్సాం క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయన్‌శర్మ పాస్‌పోర్ట్ వివాదంలో విచారణ
పాస్‌పోర్ట్ వ్యవహారంలో సూర్జేవాలా ఆరోపణలు
-
May 19, 2026 08:32 IST
తమిళనాడులో మరోసారి హాట్ టాపిక్‌గా క్యాష్ ఫర్ జాబ్స్ కేసు
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై కేసు కొనసాగించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ
గత ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను జాప్యం చేసిందని ఈడీ ఆరోపణ
ఇప్పటికే క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ
-
May 19, 2026 08:21 IST
కర్నూలు: ఆటో బోల్తా.. వృద్ధురాలి మృతి
గోనెగొండ్ల మండలం చిన్నమర్రివీడులో అదుపుతప్పి ఆటో బోల్తా
వరలక్ష్మి (60) అనే వృద్ధురాలి మృతి
-
May 19, 2026 08:18 IST
గద్వాల ప్రభుత్వాస్పత్రిలో పోలీసులు Vs డాక్టర్లు
ఫ్రీజర్ పనిచేయకపోవడంతో అనాథ శవాన్ని పట్టించుకోని డాక్టర్లు
అనాథ శవాన్ని మార్చురీ బయటే ఉంచిన డాక్టర్లు
డెడ్‌బాడీని తీసుకోవడానికి నిరాకరించడంపై పోలీసులు, డాక్టర్ల మధ్య వాగ్వాదం
-
May 19, 2026 08:05 IST
ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటన
UAE, సౌదీ, ఖతార్ పాలకుల విజ్ఞప్తి మేరకేనని ట్రంప్ వెల్లడి
ప్రస్తుతం ఇరాన్‌తో సీరియస్‌గా చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నట్లు ట్రూత్‌లో ట్రంప్ పోస్టు
-
May 19, 2026 07:39 IST
హైదరాబాద్: జలమండలి జీఎం నివాసంలో ACB సోదాలు
మల్లాపూర్‌లోని నివాసంలో ACB అధికారుల తనిఖీలు
జీఎం కుమార్‌తో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు
-
May 19, 2026 07:27 IST
కర్నూలు: పెద్దకడబూరు మండలం ముచ్చుగిరిలో దారుణం
అక్కపై తమ్ముళ్ల హత్యాయత్నం
వివాహేతర సంబంధం వీడియోలు వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన సోదరులు
మహిళ పరిస్థితి విషమం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
-
May 19, 2026 07:23 IST
కర్నూలు: పాముకాటుతో బాలుడి మృతి
కోడుమూరు మండలం బైనదొడ్డి గ్రామంలో పాము కాటుకు ధర్మ(8)అనే బాలుడు మృతి
-
May 19, 2026 07:17 IST
నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190
కిలో వెండి ధర రూ.3,00,100
-
May 19, 2026 07:09 IST
ఉత్తరాఖండ్: రుషికేశ్ దగ్గర పట్టాలు తప్పిన రైలు
రుషికేశ్ రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్
ప్రమాద సమయంలో బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో తప్పినముప్పు
షంటింగ్ చేస్తుండగా అదుపుతప్పిన రైలు.. మూడు బోగీల ధ్వంసం
-
May 19, 2026 07:03 IST
తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ పర్సంటేజీ విధానం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'పెద్ది' ప్రదర్శనపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఫిల్మ్ ఛాంబర్‌లో రెండోసారి భేటీకానున్న కమిటీ
అద్దె, పర్సంటేజీ విధానంపై కమిటీలో చర్చ
'పెద్ది' సినిమాను అద్దె రూపంలో ప్రదర్శించలేమంటున్న పలువురు ఎగ్జిబిటర్లు
-
May 19, 2026 06:49 IST
రంగారెడ్డి: మద్యం తాగించి బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం, తోటి విద్యార్థి అరెస్ట్
ఇబ్రహీంపట్నంలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
నిందితుడు ఉడుతల ఉదయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
-
May 19, 2026 06:45 IST
నేడు ఆఫ్గానిస్థాన్‌తో టెస్ట్, వన్డేలకు టీమిండియా ఎంపిక
జూన్ 6 నుంచి జరగనున్న ఏకైక టెస్టు
జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు
-
May 19, 2026 06:44 IST
హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసు
నేడు కస్టడీ పిటిషన్ వేయనున్న పోలీసులు
బండి భగీరథ్‌ను వారం రోజులపాటు కస్టడీ కోరే అవకాశం
-
May 19, 2026 06:43 IST
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
లీటర్ పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్ 83 పైసల పెంపు
నాలుగు రోజుల్లో రెండోసారి పెరిగిన ధరలు
-
May 19, 2026 06:42 IST
అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసా స్కామ్
10వేల మంది విద్యార్థుల వీసా స్కామ్ బట్టబయలు
నకిలీ ఓపీటీ కంపెనీల గుట్టురట్టు చేసిన అధికారులు
ఫేక్ లెటర్లు, నకిలీ అడ్రస్‌లతో వీసాలు
వీసా ఫ్రాడ్ చేస్తే సహించేది లేదని అధికారుల వార్నింగ్
-
May 19, 2026 06:41 IST
పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో పాక్ కీలక నిర్ణయం
సౌదీ అరేబియాకు 8వేల మంది సైనికులను పంపిన పాక్
పాక్ సైనికులను సరిహద్దుల్లో మోహరించిన సౌదీ
-
May 19, 2026 06:40 IST
నార్వేలో ప్రధాని మోదీ పర్యటన
నేడు భారత్-నోర్డిక్ సదస్సులో పాల్గొననున్న మోదీ
-
May 19, 2026 06:40 IST
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
కుప్పం ప్రసన్నతిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొననున్న చంద్రబాబు
రేపు గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు
-
May 19, 2026 06:39 IST
అమెరికా కోర్టులో అదానీకి భారీ ఊరట
అదానీపై నమోదైన కేసుల కొట్టివేత
అమెరికాలో సోలార్ పవర్ ప్రాజెక్టుపై ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు
ఆరోపణలపై విచారించి కేసులను కొట్టివేసిన న్యాయస్థానం
-
May 19, 2026 06:37 IST
IPL: నేడు రాజస్థాన్ Vs లఖ్‌నవూ
జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
-
May 19, 2026 06:35 IST
అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు
మే 21 వరకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ తరగతులు
చట్టాల రూపకల్పన, ప్రైవేట్ సభ్యుల బిల్లులు, తీర్మానాలు, జీరో అవర్ నిర్వహణపై అవగాహన
బడ్జెట్, ఆర్థిక కమిటీలు, స్టాండింగ్ కమిటీల పనితీరుపై శిక్షణ
మీడియా రిలేషన్స్, ఫైల్ నోటింగ్‌లు, డ్రాఫ్టింగ్, మెమోరాండమ్‌ల తయారీపై సిబ్బందికి దిశానిర్దేశం
-
May 19, 2026 06:33 IST
నేడు తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశం
హాజరుకానున్న ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి
ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించడంపై చర్చ
పథకం విధివిధానాలు ఖరారుచేసే అవకాశం
-
May 19, 2026 06:32 IST
నెల్లూరు: తుమ్మలపెంటలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
'మత్స్యకారుల సేవ' కింద నేడు నిధుల విడుదల
ప్రతి కుటుంబానికి రూ.20 వేల చొప్పున నిధులు
1.30 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి