రూపాయి రికార్డు పతనం.. ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్..
ABN , Publish Date - May 19 , 2026 | 03:54 PM
ఉదయం లాభాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగివచ్చాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.52) రికార్డు స్థాయిలో పడిపోయింది. అలాగే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా సూచీలకు ప్రతికూలంగా మారింది.
ఉదయం లాభాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగివచ్చాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.52) రికార్డు స్థాయిలో పడిపోయింది. అలాగే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా సూచీలకు ప్రతికూలంగా మారింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలను వెనక్కి లాగాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (75,315)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు నష్టాల బాటపట్టాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ 600 పాయింట్లు కిందకు వచ్చింది. చివరకు సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంతో 75,200 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 31 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఏంజెల్ వన్, వొడాఫోన్ ఐడియా, కేపీఐటీ టెక్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఆస్ట్రాల్ లిమిటెడ్, గెయిల్, కోటక్ మహీంద్రా, రైల్ వికాస్, భారత్ ఫోర్జ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 548 పాయింట్లు లాభపడింది.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..