-
-
Home » Mukhyaamshalu » ABN Andhrajyothy ap telangana national and international telugu live updates of 7th february 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 07 , 2026 | 06:04 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Feb 07, 2026 19:10 IST
నిజామాబాద్: భీంగల్ మున్సిపాలిటీలో ఉత్తమ్ ప్రచారం
ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు: మంత్రి ఉత్తమ్
అన్నిస్థానాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుంది: మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్
దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇస్తున్నాం: మంత్రి ఉత్తమ్
ఖరీఫ్‌లో రైతులకు రూ.19వేల కోట్లు చెల్లించాం: మంత్రి ఉత్తమ్
పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: మంత్రి ఉత్తమ్
-
Feb 07, 2026 19:09 IST
హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్
తొర్రూర్ భూములకు మళ్లీ రికార్డు ధర
చదరపు గజం రూ.45 వేల వరకు దక్కిన ప్లాట్లు
తొలిరోజే 70 ప్లాట్ల విక్రయం, రూ.56 కోట్ల ఆదాయం
కార్నర్ ప్లాట్ కోసం 20 సార్లకు పైగా బిడ్డింగ్ పోటీ
సగటు ధర చదరపు గజం రూ.31వేలకు అమ్మకాలు
బండ్లగూడ–పోచారంలో 71 ప్లాట్లు రూ.11 కోట్ల ఆదాయం
-
Feb 07, 2026 17:53 IST
వికారాబాద్ జిల్లా పరిగిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
BRS, BJP మన సమస్యలను ఏనాడు పట్టించుకోలేదు: రేవంత్‌రెడ్డి
BRS, BJP చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి: సీఎం రేవంత్
KCR, KTR ఏనాడు స్థానిక సమస్యలపై దృష్టిపెట్టలేదు: రేవంత్
-
Feb 07, 2026 16:45 IST
టీ20 ప్రపంచ కప్ 2026: హెట్మెయర్ హాఫ్ సెంచరీ.. స్కాట్లాండ్ టార్గెట్ 183
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో తలపడుతోన్న వెస్టిండీస్-స్కాట్లాండ్ జట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన వెస్టిండీస్
హాఫ్ సెంచరీ చేసిన హెట్మెయర్(64; 36 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్లు)
క్యూరీ 2, మైఖేల్ లీస్క్, డేవిడ్‌సన్, షరీఫ్‌లకు తలొక వికెట్
స్కాట్లాండ్ విజయ లక్ష్యం 183
-
Feb 07, 2026 16:41 IST
అరేబియా సముద్రంలో చమురు అక్రమ రవాణా
అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా
నిందితులను సమర్థవంతంగా పట్టుకున్న భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది
మూడు నౌకలను అదుపులోకి తీసుకున్న తీరప్రాంత భద్రతా అధికారులు
-
Feb 07, 2026 16:01 IST
కరీంనగర్‌లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం
ముస్లిం మహిళలకు బీజేపీ భరోసా కల్పించింది: కేంద్రమంత్రి బండి సంజయ్
ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశాం: బండి సంజయ్
ముస్లిం మహిళల సమస్యలపై ఒవైసీ ఎప్పుడైనా మాట్లాడారా?: బండి సంజయ్
కాంగ్రెస్‌ను గెలిపిస్తే పన్నుల మోత తప్పదు: బండి సంజయ్
BJPని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధుల వరద తీసుకొస్తా: బండి సంజయ్
-
Feb 07, 2026 15:59 IST
విశాఖ: 26 చోరీ కేసుల్లో నిందితుడు అచ్చి మహేష్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, విశాఖలో రాత్రులు చోరీలు
రూ.40,500లు, బీఎండబ్ల్యూ కారు, స్కూటీ స్వాధీనం
నిందితుడి నుంచి బంగారం, వెండి స్వాధీనం
-
Feb 07, 2026 15:51 IST
క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
అమరావతికి దేశంలోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్
క్వాంటమ్ వ్యాలీలో కీలకంగా మారనున్న ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ
క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ రంగాల్లో పరిశోధన
క్వాంటమ్ సెన్సార్స్, ఏఐ రంగాల్లో పరిశోధన
సెబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాల్లో పరిశోధన
-
Feb 07, 2026 15:51 IST
దేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించేలా ఏపీ అడుగులు
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణం
ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనం సిద్ధం అయ్యేలా ప్రణాళికలు
డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు
-
Feb 07, 2026 15:50 IST
అమరావతి: క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం
ఏపీలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపకల్పన
-
Feb 07, 2026 15:43 IST
మంచి మనసు చాటుకున్న పవన్
అమరావతి: సోషల్ మీడియా పోస్టుకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్
తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
గ్రామానికి రోడ్డు కావాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విద్యార్థులు
-
Feb 07, 2026 15:42 IST
అది రాజకీయాలకు సంబంధం లేని అంశం: పవన్
లడ్డూ కల్తీ అంశం రాజకీయాలకు.. మతానికి సంబంధించినది కాదు: డిప్యూటీ సీఎం పవన్
ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించిన అంశం: పవన్
కల్తీ విషయంలో ప్రమేయం ఉన్నవారికి చట్ట ప్రకారం శిక్షలు: పవన్
-
Feb 07, 2026 15:08 IST
సిద్దిపేట: దూల్మిట్ట మండలం భైరాన్‌పల్లిలో పులి కలకలం
అమ్మాపూర్‌లో లేగ దూడలపై దాడి చేసిన పులి
పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు
సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
-
Feb 07, 2026 14:40 IST
టీ20 ప్రపంచ కప్-2026: టాస్ గెలిచిన స్కాట్లాండ్
కోల్‌కత్తా వేదికగా వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్..
మొదటి బ్యాటింగ్ చేయనున్న వెస్టిండీస్
-
Feb 07, 2026 14:31 IST
టీ20 ప్రపంచ కప్-2026: పాకిస్థాన్ ఘన విజయం
నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ విజయం
3 వికెట్ల తేడాతో పాక్ గెలుపు
నెదర్లాండ్స్ 147/10, పాకిస్థాన్ 148/7
-
Feb 07, 2026 13:52 IST
ఏపీలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణం..
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో నిర్మాణం..
భవన నిర్మాణ పనులకు సాయంత్రం శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు..
క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపకల్పన..
-
Feb 07, 2026 13:28 IST
నాయకత్వ మార్పుపై మరోసారి స్పందించిన డీకే శివకుమార్
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై మరోసారి స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది..
హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: డిప్యూటీ సీఎం డీకే
-
Feb 07, 2026 13:25 IST
ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్ పర్యటన
ఏలూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల పరిశీలన..
రూ.25 కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టిన అధికారులు..
పనుల్లో ఆలస్యంపై అధికారులపై ఎంపీ ఆగ్రహం..
-
Feb 07, 2026 13:11 IST
గజ్వేల్‌లో హరీష్‌రావుకు నిరసన సెగ
సిద్దిపేట: గజ్వేల్‌లోని R&R కాలనీలో హరీష్‌రావుకు నిరసన సెగ..
హరీష్‌రావు రావడానికి ముందే ముంపు గ్రామాల ప్రజల ఆందోళన..
హరీష్‌రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు..
ముంపు గ్రామాల ప్రజలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..
పరస్పరం దాడి, ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు..
-
Feb 07, 2026 13:09 IST
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..
కడప: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..
రూ.50 లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగల స్వాధీనం..
వివరాలు వెల్లడించిన కడప ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్, రాజంపేట అడిషనల్ ఎస్పీ మంజునాథ్ హెగ్డే..
ఇద్దరు స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్న ఎస్పీ..
-
Feb 07, 2026 12:55 IST
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
బీజేపీ, బీఆర్ఎస్‌ది రహస్య ఒప్పందం.. బండి సంజయ్ మాటల్లో నిజం లేదు..
కరీంనగర్‌లో మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీదే..
ఎంఐఎం పేరు చెప్పి కాంగ్రెస్‌ను విమర్శిస్తావా.. మేం 40 స్థానాలు గెలుస్తాం: ఏబీఎన్‌తో మంత్రి శ్రీధర్ బాబు
-
Feb 07, 2026 12:44 IST
విజయశాంతి రెడ్డి ఆత్మహత్యపై స్పందించిన సోదరుడు
విజయశాంతి రెడ్డి ఆత్మహత్యపై స్పందించిన అన్న చిరంజీవిరెడ్డి..
యూట్యూబ్ ఛానల్స్‌లో ఇష్టానుసారం థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు..
దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌పై చర్యలకు సిద్ధం: విజయశాంతి రెడ్డి సోదరుడు
-
Feb 07, 2026 12:36 IST
అండర్-19 జట్టుకు భారీ నజరానా..
ప్రపంచకప్ గెలిచిన అండర్-19 జట్టుకు భారీ నజరానా..
జట్టుకు రూ.7.50 కోట్లు నజరానా ప్రకటించిన BCCI..
-
Feb 07, 2026 12:14 IST
శ్రీశైలంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
నంద్యాల: శ్రీశైలంలో రేపటి నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
గత ఏడాది కంటే ఈసారి 30 నుంచి 40 శాతం ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా..
13వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ప్రతి ఒక్కరికీ లడ్డూ ప్రసాదం ఉచితంగా అందిస్తాం..
భక్తుల రద్దీ కారణంగా రేపటి నుంచి 20 వరకు స్పర్శ దర్శనం రద్దు..
-
Feb 07, 2026 11:42 IST
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం..
మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు, దట్టంగా అలుముకున్న పొగ..
సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం.. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
-
Feb 07, 2026 11:24 IST
మల్కాపూర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం..
యాదాద్రి: మల్కాపూర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం..
గతంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని కేసీఆర్ బయటకు రావడం లేదు..
గ్యారెంటీల గురించి నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు..
బీజేపీకి ఓటేస్తే.. ఢిల్లీ నుంచి మరిన్ని నిధులొస్తాయి: బండి సంజయ్
-
Feb 07, 2026 11:09 IST
టీ20 వరల్డ్ కప్-2026 టోర్నమెంట్ ప్రారంభం
పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా తొలి మ్యాచ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
-
Feb 07, 2026 11:06 IST
ఇస్లామాబాద్ బాంబు దాడిని ఖండించిన భారత్
బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన భారత్..
బాంబు దాడి వెనుక భారత్ ఉందని పాక్ ఆరోపణలు..
పాక్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్..
పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందన్న భారత్..
-
Feb 07, 2026 10:13 IST
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్
మమ్మల్ని విమర్శించే ముందు రేవంత్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: ABNతో కిషన్‌రెడ్డి
ఏ రకంగా.. నేను కల్వకుంట్ల కిషన్‌రావును అవుతా?..
కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం నాకేంటి?: కిషన్‌రెడ్డి
పనికిరాని ఆరోపణలు చేయడం రేవంత్‌కు అలవాటు: కిషన్‌రెడ్డి
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్‌కళ్యాణ్ వచ్చే అంశంపై.. కొంత స్పష్టత రావాల్సి ఉంది: ABNతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
Feb 07, 2026 10:06 IST
విశాఖ జూపార్క్‌కు చేరిన పెద్ద పులి
బోనులో పెట్టి తీసుకొచ్చిన అటవీ సిబ్బంది..
పులిని పర్యవేక్షిస్తున్న జూ క్యూరేటర్ మంగమ్మ..
-
Feb 07, 2026 09:40 IST
వికారాబాద్ జిల్లాలో నేడు సీఎం పర్యటన..
వికారాబాద్ జిల్లా పరిగిలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం..
-
Feb 07, 2026 09:37 IST
భారత్, అమెరికాకు.. ఇది గుడ్‌న్యూస్: ప్రధాని మోదీ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పందించిన ప్రధాని మోదీ..
భారత్, అమెరికాకు ఇది గుడ్‌న్యూస్..
వ్యక్తిగత నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్‌నకు కృతజ్ఞతలు..
మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది: ప్రధాని మోదీ
-
Feb 07, 2026 09:35 IST
జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు
ఎన్టీఆర్: మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు..
ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు..
జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జనసమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు..
జన సమీకరణ చేయొద్దని గురువారం రాత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు..
పోలీసుల సూచనలు బేఖాతరు చేసేలా జోగి రమేష్ వ్యవహరించారని ఎస్ఐ ఫిర్యాదు..
-
Feb 07, 2026 09:14 IST
ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం..
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు..
బస్సులో 39 మంది ప్రయాణికులు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం..
-
Feb 07, 2026 08:13 IST
కేకే కుమారుడికి బెదిరింపులు..
హైదరాబాద్: కె. కేశవరావు కుమారుడికి బెదిరింపులు..
ఇంటి క్రమబద్ధీకరణ అంశంలో పిటిషన్ వేసి బ్లాక్‌మెయిల్..
రూ.3కోట్లు ఇస్తే కేసు విత్‌డ్రా చేసుకుంటామని ప్రతిపాదన..
అంగీకరించకపోతే మరిన్ని కేసులు వేస్తామని బెదిరింపులు..
బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కేకే కుమారుడు వెంకట్..
సిద్దిపేట వాసులు రఘువీరారెడ్డి, అన్వేష్‌రెడ్డిపై కేసు నమోదు..
-
Feb 07, 2026 08:12 IST
వందేభారత్ రైళ్లు పేల్చేస్తామని ఆగంతకుడి లేఖ..
హైదరాబాద్‌లోని నలుగురు జిహాదీల బృందం ప్లాన్ చేసినట్టు లేఖ..
వందేభారత్ రైళ్లలో బాంబులు పెట్టేందుకు ప్లాన్ చేశారన్న ఆగంతకుడు..
ఈనెల 3న రైల్వే జీఎంకు పోస్టులో వచ్చిన లేఖ..
లేఖతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. వందేభారత్ రైళ్లలో తనిఖీలు..
-
Feb 07, 2026 08:00 IST
నేడు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన..
ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన కార్యక్రమం
హాజరుకానున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, సీఎం చంద్రబాబు నాయుడు..
క్వాంటమ్ వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం..
-
Feb 07, 2026 07:34 IST
శ్రీశైలం పాదయాత్రికులకు శుభవార్త
కర్నూలు: శ్రీశైలం పాదయాత్రికులకు శుభవార్త..
ఈనెల 6 నుంచి 15 వరకూ వెంకటాపురం నుంచి అటవీ మార్గంలో..
నడిచి వెళ్లేందుకు అటవీశాఖ అనుమతి.. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు..
-
Feb 07, 2026 07:02 IST
నేడు తెలంగాణలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పర్యటన
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఫడ్నవీస్..
మధ్యాహ్నం ఒంటిగంటకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సభ..
మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఫడ్నవీస్..
-
Feb 07, 2026 06:54 IST
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు..
భారత్ అంగీకరించిందని అమెరికా ప్రకటన..
అమెరికా ఇంధనం, గ్యాస్‌ను దిగుమతి చేసుకోనున్న భారత్..
భారత్ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గింపు..
రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందన్న అమెరికా..
500 బిలియన్ డాలర్ల దిగుమతులకు భారత్ అంగీకారం..
ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు భారత్ అంగీకారం..
అమెరికా దిగుమతులపై సుంకాలను భారత్ సున్నా శాతానికి తగ్గిస్తుందని ప్రకటన..
పండ్లు, కూరగాయలపై సుంకాలు సున్నా శాతానికి తగ్గించనున్న భారత్..
వైన్, కొన్ని రకాల గింజలపై సుంకాలు సున్నా శాతానికి తగ్గించనున్న భారత్..
-
Feb 07, 2026 06:07 IST
నేడు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె..
దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాల పిలుపు..
కనీస ఛార్జీల కోసం డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె..
నేడు క్యాబ్, ఆటో, బైక్ సేవలకు అంతరాయం..
-
Feb 07, 2026 06:04 IST
నేటి నుంచి టీ20 వరల్డ్ కప్
నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం..
ముంబైలో రాత్రి 7 గంటలకు భారత్ Vs అమెరికా మ్యాచ్..
కొలంబోలో పాకిస్థాన్ Vs నెదర్లాండ్స్ మ్యాచ్..
కోల్‌కతాలో వెస్టిండీస్ Vs స్కాట్లాండ్ మ్యాచ్ ..