కల్తీ నెయ్యి అంశంపై వీడియో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:32 PM
తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు.
అమరావతి, ఫిబ్రవరి 7: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నకిలీ నెయ్యి వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' ఖాతాలో సదరు వీడియో పోస్ట్ చేశారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశంపై సీబీఐ–సిట్(Special Investigation Team) దర్యాప్తు నివేదికల గురించి పవన్ ఈ వీడియోలో వివరించారు.
ఈ అంశం రాజకీయాలకు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదన్న పవన్.. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని అన్నారు. ఈ విషయంలో ప్రమేయం ఉన్నవారిని చట్ట ప్రకారం జవాబుదారీగా చేస్తారని.. న్యాయం జరిగే వరకూ ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని కొనసాగిస్తుందని పవన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి:
బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే
ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే.. బీజేజీ ఆరోపణ