-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 2nd July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 02 , 2026 | 06:55 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 02, 2026 21:24 IST
హైదరాబాాద్: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
మూసీ రివర్ ఫ్రంట్ తొలిదశ పనులకు ఆమోదం
తొలిదశ ప్రాజెక్టు పనులకు రూ.7,345 కోట్ల కేటాయింపు
21 కి.మీ. మేర మూసీ సుందరీకరణకు కేబినెట్ ఆమోదం
నవోదయ విద్యాలయాలకు రెండుచోట్ల ప్రభుత్వ స్థలం కేటాయింపు
-
Jul 02, 2026 20:50 IST
హైదరాబాద్: DSP భీమ్‌రెడ్డి అరెస్టు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్‌రెడ్డిని అరెస్టు చేసిన ACB
-
Jul 02, 2026 20:48 IST
మమతా బెనర్జీ, రితబ్రత వర్గాలకు ఈసీ నోటీసులు
తామే అసలు టీఎంసీ అని ఇరు వర్గాల ప్రకటన
ఈ విషయంలో వివరణ కోరుతూ ఈసీ నోటీసులు
జులై 6లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు
-
Jul 02, 2026 20:31 IST
విజయవాడ: కృష్ణలంక CI నాగరాజుకు పోలీస్ కస్టడీ
8 రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో రేపటి నుంచి విచారణ
విచారణ రికార్డు చేసి సమర్పించాలని న్యాయాధికారి ఆదేశం
-
Jul 02, 2026 20:29 IST
పెట్రోల్ ధరలు ఇప్పట్లో తగ్గవు: కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్
చమురు సంస్థలకు రూ.74,781 కోట్ల నష్టం: హర్దీప్‌సింగ్
-
Jul 02, 2026 19:58 IST
హైదరాబాద్: DSP భీమ్‌రెడ్డి నివాసంలో ACB సోదాలు
భీమ్‌రెడ్డి డైరీలో 15 మంది బినామీల పేర్లు గుర్తింపు
ఇప్పటివరకు రూ.200 కోట్ల ఆస్తులను గుర్తించిన ACB
భీమ్‌రెడ్డికి 16 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు
భీమ్‌రెడ్డి నివాసంలో కిలో బంగారం, రూ.40 లక్షలు సీజ్
-
Jul 02, 2026 19:15 IST
తమిళనాడు: శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
ధ్వంసమైన బాణసంచా పరిశ్రమ
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయకచర్యలు
-
Jul 02, 2026 19:00 IST
హైదరాబాద్: కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా
సురేఖ గైర్హాజరుపై సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం
నిన్న విదేశీ పర్యటన నుంచి వచ్చిన మంత్రి కొండా సురేఖ
-
Jul 02, 2026 18:54 IST
జగన్‌కు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు: ఎక్స్‌లో మంత్రి భరత్
రాష్ట్ర విభజన అంశం ముగిసినట్లే రాజధాని అంశమూ ముగిసింది
రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు
-
Jul 02, 2026 18:27 IST
కాకినాడ కోర్టుకు యూట్యూబర్ జోసెఫ్ రావణ్
జోసెఫ్ రావణ్ క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్
కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని జోసెఫ్ రావణ్‌పై కేసు
-
Jul 02, 2026 18:00 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనం
-
Jul 02, 2026 17:57 IST
తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jul 02, 2026 17:53 IST
మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ
50 శాతం వెయిటేజీ ఇవ్వాలన్న ప్రతిపాదనపై కేంద్రం పరిశీలన
విద్యార్థులకు కోచింగ్ సెంటర్ల అవసరం తగ్గించేలా కసరత్తు
సిలబస్‌లో మార్పుల ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్న కేంద్ర విద్యాశాఖ!
-
Jul 02, 2026 17:34 IST
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో దారుణం
పని ఇప్పిస్తానని నమ్మించి మహిళను తీసుకెళ్లిన దుండగుడు
అరతులం బంగారం లాక్కొని, మహిళను బావిలో తోసేసిన వ్యక్తి
24 గంటలపాటు బావిలో ప్రాణాలతో పోరాడిన మహిళ
బావిలో మహిళను గుర్తించి బయటకు తీసిన స్థానికులు
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
-
Jul 02, 2026 17:07 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌ను కలిసిన ఆదివాసీ, గిరిజన MLAలు
మంత్రి సీతక్క నేతృత్వంలో సీఎం రేవంత్‌ను కలిసిన MLAలు
పలు అంశాలపై సీఎం రేవంత్‌కు MLAల వినతిపత్రం
-
Jul 02, 2026 17:06 IST
ఏలూరు: జంగారెడ్డిగూడెం RDO ఆఫీస్‌లో ACB సోదాలు
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు
-
Jul 02, 2026 17:05 IST
తిరుపతి: జగన్‌పై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆగ్రహం
జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మాధవ్
అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగామే మావిగన్ అంశం: మాధవ్
అభివృద్ధి చూసి తట్టుకోలేక జగన్ కుట్రలు: మాధవ్
-
Jul 02, 2026 16:08 IST
ఇస్రోకు బాంబు బెదిరింపు
ఇస్రో చైర్మన్ వి.నారాయణ్‌కు బెదిరింపు మెయిల్
-
Jul 02, 2026 16:08 IST
స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా ముఠా అరెస్ట్: సీపీ సజ్జనార్
స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి డోర్ డెలివరీ చేస్తున్నారు: సీపీ సజ్జనార్
21 రాష్ట్రాలకు కొరియర్ ద్వారా గంజాయి సరఫరా: సీపీ సజ్జనార్
-
Jul 02, 2026 16:05 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
579 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
170 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 02, 2026 15:56 IST
రేవంత్ ఉన్నన్ని రోజులూ కేసీఆర్ బయటకి రారు: అద్దంకి దయాకర్
రేవంత్‌ను తట్టుకోవడం కేసీఆర్ వల్ల సాధ్యం కాదు: అద్దంకి దయాకర్
కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు కేటీఆర్, హరీశ్: అద్దంకి దయాకర్
కేటీఆర్, హరీశ్ మాకు టార్గెట్ కాదు: అద్దంకి దయాకర్
-
Jul 02, 2026 15:55 IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
PSUలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంచుతూ జీఓ
2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్ అమలు
60 ఏళ్లకు పదవీ విరమణ పొందిన అర్హులను విధుల్లోకి తీసుకునే చాన్స్
-
Jul 02, 2026 15:35 IST
భారత్, జపాన్ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
ఒప్పందాలపై ప్రధానులు మోదీ, తకాయిచి సంతకాలు
ఫార్మా, డిఫెన్స్, తీరప్రాంత భద్రత, Ai రంగాల్లో ఒప్పందాలు
రానున్న పదేళ్లలో భారత్‌లో జపాన్ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులు: ప్రధాని మోదీ
-
Jul 02, 2026 15:31 IST
తెలంగాణ సచివాలయ ప్రవేశానికి కొత్త నిబంధన
సచివాలయం లోపలికి వెళ్లే ప్రతి వాహనానికీ QR కోడ్ ఏర్పాటు
-
Jul 02, 2026 15:10 IST
హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీభాయి బదిలీ
తెలంగాణ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ MDగా లక్ష్మీభాయి నియామకం
BRS నేత RS ప్రవీణ్‌కుమార్ సతీమణి జి.లక్ష్మీభాయి
-
Jul 02, 2026 15:10 IST
కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ అంకిత్ తనిఖీలు
వార్డుల పరిశీలన సహా సిబ్బంది పనితీరు, వైద్య సేవలపై ఆరా
సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిక
-
Jul 02, 2026 14:49 IST
హైదరాబాద్: యుసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం
పోలీస్ వాహనం ఢీకొని ఫుడ్ డెలివరీ బాయ్ మృతి
-
Jul 02, 2026 14:38 IST
తెలంగాణలో మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల
3-4 ఎకరాలున్న రైతులకు రైతుభరోసా నిధులు విడుదల
మూడో విడతలో 6.39 లక్షల మంది ఖాతాల్లో రూ.1,330 కోట్లు జమ
ఇప్పటివరకు 61.35 లక్షల మందికి రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయం: మంత్రి తుమ్మల
-
Jul 02, 2026 14:33 IST
గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించిన H-NEW పోలీసులు
దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా
మెడిసిన్ పేరుతో జార్ఖండ్ నుంచి గంజాయి సరఫరా
జార్ఖండ్‌కు చెందిన రాహుల్‌ను అరెస్టు చేసిన H-NEW పోలీసులు
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో గంజాయి విక్రయాలు
-
Jul 02, 2026 14:30 IST
అయోధ్య రామ మందిరం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా
చంపత్ రాయ్ సహా ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా
విరాళాల దుర్వినియోగం వివాదంపై ఇద్దరు రాజీనామా సమర్పణ
ఇప్పటికే 8 మంది ఉద్యోగులను అరెస్టు చేసిన పోలీసులు
చంపత్ రాయ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన దర్యాప్తు అధికారులు
ఈనెల 6న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశం
-
Jul 02, 2026 14:01 IST
కాంగ్రెస్, BRSపై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు
వారెవ్వా.. మీ డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయి: ట్విట్టర్‌లో బండి సంజయ్
కాంగ్రెస్, BRS నేతల నటన అద్భుతం: కేంద్ర మంత్రి బండి సంజయ్
వారం ముందే రిహార్సల్ చేసి పోటాపోటీగా జీవిస్తున్నారు: బండి సంజయ్
అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే: బండి సంజయ్
మిమ్మల్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
Jul 02, 2026 13:31 IST
అమరావతి: నా వెంట నడిచిన వారిని మరిచిపోను: మంత్రి లోకేశ్
తిరుపతిలో యువగళం బృందాన్ని ఆప్యాయంగా పలకరించిన లోకేశ్
యువగళం పాదయాత్ర జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నారా లోకేశ్
15 నిమిషాల పాటు కార్యకర్తలతో ముచ్చటించిన లోకేశ్
'కార్యకర్తే అధినేత' లక్ష్యంతో కేడర్ సాధికారతకు కృషి: లోకేశ్
-
Jul 02, 2026 13:07 IST
తిరుపతి: VB-G RAM G పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు: సీఎం చంద్రబాబు
ఈ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు
ఇది గ్రామాల ముఖచిత్రం మార్చే పథకం: సీఎం చంద్రబాబు
పేదవాళ్లకు ఏడాదికి 185 రోజులు పని కల్పించే కార్యక్రమం: సీఎం చంద్రబాబు
దొంగ లెక్కలు రాసుకోలేని విధంగా డిజిటల్ విధానం తెచ్చారు: సీఎం చంద్రబాబు
-
Jul 02, 2026 12:55 IST
విజయనగరం: యూట్యూబర్ వెంకటరెడ్డికి రిమాండ్
వెంకటరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన బొబ్బిలి కోర్టు
కూటమి నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల కేసులో రిమాండ్
-
Jul 02, 2026 12:51 IST
హైదరాబాద్: కాసేపట్లో కంచన్‌బాగ్ పీఎస్‌కు కేటీఆర్
హరీశ్ రావు , BRS నేతలను అరెస్ట్ చేసి, కంచన్‌బాగ్ పీఎస్‌కు తరలించిన పోలీసులు
కంచన్‌బాగ్ పీఎస్ ఎదుట BRS ఆందోళన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS శ్రేణుల నినాదాలు
-
Jul 02, 2026 12:29 IST
తిరుపతి: 'వీబీ-జీ రామ్ జీ' పథకం హర్షణీయం: BJP AP చీఫ్ మాధవ్
నేటి నుంచి గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం: మాధవ్
ఈ పథకం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతుంది: మాధవ్
పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే లక్ష్యం: మాధవ్
గ్రామీణ ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: మాధవ్
-
Jul 02, 2026 12:28 IST
ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం
నలుగురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు
ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టి ఆదేశాలతో కుట్ర
నిందితుల్లో ముగ్గురు పంజాబ్, ఒకరు ఢిల్లీ వాసి
రెండు విదేశీ పిస్టల్స్, 9 తూటాలు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Jul 02, 2026 12:26 IST
హైదరాబాద్: ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం రేవంత్‌కు లేదు: కేటీఆర్
అప్పులపై రేవంత్ సవాల్ చేసి ముఖం చాటేశారు: కేటీఆర్
మధ్యలో మంత్రి జూపల్లి దూరి తెలంగాణ భవన్‌కు వస్తామన్నారు
తెలంగాణ భవన్‌లో జూపల్లి కోసం ఎదురుచూశాం: కేటీఆర్
ఇప్పుడు ఎక్కడో కూర్చుని చర్చకు రమ్మంటున్నారు: కేటీఆర్
-
Jul 02, 2026 12:25 IST
తిరుపతి: ముక్కావారిపల్లెలో VB G RAM-G పథకం ప్రారంభం
పేదరిక నిర్మూలనలో భాగమే VB G RAM-G పథకం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించారు: పవన్
వ్యవసాయ సీజన్‌లో 60రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుంది: పవన్
ఏపీలో పథకం అమలుకు రూ.12,845 కోట్లు ఖర్చు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jul 02, 2026 12:03 IST
కర్ణాటక: బెంగళూరులో ఘోర ప్రమాదం
క్వారీలో భారీ బండరాయి పడి ఏడుగురు కార్మికుల మృతి
బిహార్‌కు చెందిన కార్మికులు మరణించినట్లు పోలీసుల వెల్లడి
-
Jul 02, 2026 11:59 IST
హైదరాబాద్: బోడుప్పల్‌లో TRS చీఫ్ కవిత అరెస్ట్
బోడుప్పల్‌లో భూపోరాటానికి సిద్ధమైన TRS
పోలీసులతో TRS కార్యకర్తల వాగ్వాదం, తోపులాట
కవితతో పాటు TRS శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jul 02, 2026 11:29 IST
హైదరాబాద్: ఆధారాలతో రండి మేం చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
మేం అవినీతి చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి.. రాజీనామా చేస్తాం: పొన్నం
RS ప్రవీణ్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలి: మంత్రి పొన్నం
ఎవరితోపడితే వారితో మేం చర్చించం: మంత్రి పొన్నం
-
Jul 02, 2026 11:28 IST
హైదరాబాద్: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత
గన్‌పార్క్ వెళ్తున్న హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో BRS కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట
కారు దిగి పాదయాత్రగా వెళ్లేందుకు హరీశ్ రావు యత్నం
తోపులాటలో కిందపడిపోయిన హరీశ్ రావు
హరీశ్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jul 02, 2026 11:01 IST
హైదరాబాద్: ప్రెస్‌క్లబ్‌కు రమ్మంటే.. గన్‌పార్క్ దగ్గరకు రమ్మన్నారు: హరీశ్ రావు
మీరు రమ్మన్న చోటుకే వస్తున్నాం.. మాకెలాంటి భేషజాలు లేవు: హరీశ్ రావు
మేం వచ్చే వరకు మంత్రులు అక్కడే ఉండాలి: హరీశ్ రావు
ఎలాంటి గొడవలు వద్దు.. కూర్చుని మాట్లాడుకుందాం: హరీశ్ రావు
-
Jul 02, 2026 10:46 IST
హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్
మంత్రులు పారదర్శకంగా ఉన్నారు: ABNతో దానం
తప్పు చేయలేదు కాబట్టే.. మంత్రులు చర్చకు వచ్చారు: దానం నాగేందర్
-
Jul 02, 2026 10:45 IST
ఢిల్లీ: భారత్‌లో రెండో రోజు జపాన్ ప్రధాని తకాయిచి పర్యటన
రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీని కలిసిన తకాయిచి
త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించిన తకాయిచి
భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం
మధ్యాహ్నం ఒంటి గంటకు మోదీ, తకైచి మీడియా సమావేశం
3గంటలకు భారత్-జపాన్ బిజినెస్ ఫోరం సదస్సు
-
Jul 02, 2026 10:31 IST
అమరావతి: జగన్ తీరు అందరికీ తెలుసు: సోమిరెడ్డి
అమరావతి, మావిగన్‌కు పోటీ అని జగన్ అంటున్నారు: సోమిరెడ్డి
ఏపీ భవిష్యత్ నాశనం కావాలని జగన్ మావిగన్ అంటున్నారు: సోమిరెడ్డి
ఇది విజనరీ, మెంటల్ కేసుకు పోటీ: సోమిరెడ్డి
-
Jul 02, 2026 10:30 IST
హైదరాబాద్: కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు BRS నేతలు
ప్రెస్‌క్లబ్‌కు రానున్న RS ప్రవీణ్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్
గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటున్న BRS
మంత్రులు అడ్లూరి, అజరుద్దీన్, పొన్నం చర్చకు రావాలని సవాల్
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ దగ్గర పోలీసుల మోహరింపు
-
Jul 02, 2026 10:19 IST
అమెరికా ఆటగాడికి రెడ్‌కార్డ్ చూపిన రిఫరీ
మిలియన్ డాలర్ల పిజ్జాలు పంచనున్న డొమినోస్
మాట నిలబెట్టుకునేందుకు సన్నాహాలు పూర్తి
మేలో ప్రకటించిన ఆఫర్ అమల్లోకి
బోస్నియాతో మ్యాచ్‌లో ఫోలారిన్ బలోగన్‌కు రెడ్‌కార్డ్
అభిమానులకు ఉచిత పిజ్జాల పంపిణీ సిద్ధం
-
Jul 02, 2026 10:11 IST
పెరిగిన బంగారం ధరలు
రూ.3,770 పెరిగి రూ.1,44,550కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.3,450 పెరిగి రూ.1,32,500కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
కిలో వెండి ధర రూ.2,45,000
-
Jul 02, 2026 10:00 IST
హైదరాబాద్: మంత్రులు వర్సెస్ మాజీ మంత్రులు
గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలపై సవాళ్లు
గన్‌పార్క్‌కు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజరుద్దీన్
కేటీఆర్, హరీశ్ రావు చర్చకు రావాలన్న మంత్రులు
గన్‌పార్క్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
-
Jul 02, 2026 09:58 IST
యూపీ: అయోధ్య విరాళాల కేసులో దర్యాప్తు
రామమందిర ట్రస్ట్ ఐదేళ్ల ఆడిట్‌పై సిట్ ఫోకస్
ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు
ట్రస్ట్ అధికారుల పాత్రపై సిట్ అనుమానం
నిర్మాణ పనులపైనా సిట్ అధికారుల విచారణ
ఈనెల 15న యూపీ ప్రభుత్వానికి సిట్ నివేదిక
-
Jul 02, 2026 09:30 IST
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళల అరెస్ట్
నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నం
ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో నకిలీ వీసాల గుర్తింపు
20 మందిని పోలీసులకు అప్పగించిన అధికారులు
మహిళలను ప్రశ్నిస్తున్న ఎయిర్‌పోర్టు పోలీసులు
-
Jul 02, 2026 09:15 IST
తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన సీఎం విజయ్
మా ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు: సీఎం విజయ్
మా ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుంది: సీఎం విజయ్
అవినీతిరహిత పాలన, లౌకికవాదం మా సిద్ధాంతం: విజయ్
ఈ రెండు అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదు: సీఎం విజయ్
-
Jul 02, 2026 09:00 IST
హైదరాబాద్: DSP ఎస్.భీమ్ రెడ్డి నివాసంలో ఏసీబీ తనిఖీలు
ఏసీబీ DSP మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు
హైదరాబాద్‌లోని నివాసంతో పాటు 20 చోట్ల తనిఖీలు
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సోదాలు
రూ.8 కోట్ల విలువైన విల్లాలో ఉంటున్న భీమ్ రెడ్డి
భారీగా అక్రమాస్తులను గుర్తించిన అధికారులు
-
Jul 02, 2026 08:45 IST
అమరావతి: విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
కాంట్రాక్టర్లతో సమీక్షించి, పనులు వేగవంతం చేయాలని సూచన
కలెక్టర్లతో కలిసి క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
ట్రాన్స్‌కో ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి గొట్టిపాటి
-
Jul 02, 2026 08:30 IST
యూజర్ నేమ్ వివాదంపై స్పందించిన వాట్సాప్
కేంద్రం వివరణ కోరిన నేపథ్యంలో స్పందించిన వాట్సాప్
ఫీచర్ ఇంకా లాంచ్ కాలేదు
ఐడీని ముందస్తుగా ఎంచుకునే ఆప్షన్ మాత్రమే కల్పించామని వివరణ
-
Jul 02, 2026 08:20 IST
విశాఖ: కూర్మన్నపాలెం వద్ద అదుపుతప్పి కారు బోల్తా
మహిళ మృతి, నలుగురికి గాయాలు
అనకాపల్లి నుంచి గాజువాక వైపు వస్తుండగా ప్రమాదం
ఘటన స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు
-
Jul 02, 2026 07:57 IST
నేడు ఢిల్లీలో భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం
మూడు రోజుల పాటు భారత్‌లో జపాన్ ప్రధాని తకైచీ పర్యటన
-
Jul 02, 2026 07:48 IST
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ
ట్యాబ్‌లతోనే తొలి ఈ-కేబినెట్ సమావేశం
కాగితాలకు గుడ్‌బై.. డిజిటల్ పాలనకు శ్రీకారం
మెట్రో విస్తరణపై కేంద్రం వైఖరి, SBI ఫాక్స్ బాధ్యతలపై కీలక చర్చ
వీబీజీరామ్‌జీ అమలుపై ఈ సమావేశంలో తుది నిర్ణయం
-
Jul 02, 2026 07:38 IST
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ నేతలు
అర్చన సేవలో పాల్గొన్న బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ ప్రకాష్ జీ, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
-
Jul 02, 2026 07:32 IST
నేడు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
రైల్వేకోడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లిలో వీబీజీరామ్‌జీ పథకం ప్రారంభం
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి చౌహాన్
-
Jul 02, 2026 07:24 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,770గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,29,040గా ఉంది.
హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.
-
Jul 02, 2026 07:08 IST
ముంబైని ముంచెత్తిన వర్షం
ఉత్తరాదిలో పలుచోట్ల స్తంభించిన జనజీవనం
మూడు రాష్ట్రాల్లో 9 మంది మృతి
-
Jul 02, 2026 06:58 IST
తిరుమలలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న లోకేశ్
-
Jul 02, 2026 06:57 IST
చెస్టర్‌లీ స్ట్రీట్: భారత్ Vs ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్ రద్దు
వర్షం కారణంగా భారత్ Vs ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు