సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్ కస్టడీ
ABN , Publish Date - Jul 02 , 2026 | 09:01 PM
సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై న్యాయస్థానం గురువారం తుది తీర్పును వెలువరించింది. సిట్ అధికారులు 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై న్యాయస్థానం గురువారం తుది తీర్పును వెలువరించింది. సిట్ అధికారులు 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
విచారణను వీడియో, ఆడియో రికార్డు చేసి సమర్పించాలని న్యాయాధికారి ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే విచారించాలని సూచించారు. సీఐ నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో రేపటి నుంచి సీఐ నాగరాజు విచారణ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి
హనీట్రాప్ కలకలం: మాజీ సర్పంచ్‌ను నిలువునా ముంచేసిన కిలాడి లేడి
టీఎంసీలో చీలిక.. ఇరు పక్షాలకు ఈసీ నోటీసులు