టీఎంసీలో చీలిక.. ఇరు పక్షాలకు ఈసీ నోటీసులు
ABN , Publish Date - Jul 02 , 2026 | 08:39 PM
మాజీ సీఎం మమతా బెనర్జీపై రితబ్రత బెనర్జీ తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో ఈసీ ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. తామే అసలైన టీఎంసీ అని ఇరు వర్గాలు చెబుతున్న నేపథ్యంలో వారి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ నేత రితబ్రత బెనర్జీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఎన్నికల గుర్తుతో పాటు టీఎంసీ నాయకత్వం తమదే అంటూ ఇరు వర్గాలు ప్రకటించుకున్న నేపథ్యంలో ఈసీ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తు, బ్యాంక్ అకౌంట్లు, పార్టీ కార్యవర్గం, ఇతర వ్యవస్థల విషయంలో జులై 6 లోపు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని కోరింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తరువాత రితబ్రత సారథ్యంలో ఒక వర్గం తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయత్వాన్ని అంగీకరించేది లేదని రితబ్రత తేల్చి చెప్పారు. అంతేకాకుండా, పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 65 మంది తనకు మద్దతుగా ఉన్నారని అన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు రితబ్రతను తమ లీడర్‌గా ఎన్నుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నందున తమ వర్గాన్ని అసలైన టీఎంసీగా గుర్తించాలని రితబ్రత కోరుతున్నారు. అయితే, మమత మద్దతుదారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. పార్టీ వ్యవస్థాగత బలమే నాయకత్వాన్ని నిర్ణయిస్తుందని అన్నారు. ఇప్పటికీ టీఎంసీ నేత మమతయేనని అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..