Share News

శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

ABN , Publish Date - Jul 02 , 2026 | 06:52 PM

తమిళనాడులోని శివకాశి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం కోపై నాయకన్‌పట్టి సమీపంలోని గురులక్ష్మి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.

శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
Sivakasi explosion

ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడులోని శివకాశి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం కోపై నాయకన్‌పట్టి సమీపంలోని గురులక్ష్మి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక మహిళా కార్మికురాలికి 90 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. 20 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.


సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరినీ హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీ లోపల ఉన్న బాణసంచా నిరంతరాయంగా పేలుతూ, చుట్టుపక్కల అంతా దట్టమైన పొగ కమ్మేయడంతో సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టంగా మారింది. పేలుడు ధాటికి బాణసంచా కేంద్రానికి చెందిన నాలుగు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.


ఇవి కూడా చదవండి

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

పోలీస్ భద్రతపై సంచలన సమీక్ష.. వీఐపీ వాహనాల తొలగింపు!

Updated Date - Jul 02 , 2026 | 07:29 PM