మహిళను నమ్మించి తీసుకెళ్లి.. బంగారం లాక్కొని ఎంతపని చేశాడంటే!
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:42 PM
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను తీసుకెళ్లిన దుండగుడు.. ఆమె వద్దనున్న అర తులం బంగారాన్ని లాక్కొని బావిలోకి తోసేశాడు.
కరీంనగర్, జులై 2: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో అమానుషమైన ఘటన వెలుగుచూసింది. పని ఇప్పిస్తానని నమ్మబలికిన ఒక దుండగుడు ఓ మహిళను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమె మెడలోని అర తులం బంగారాన్ని లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా తన గుట్టు బయటపడుతుందని భావించి.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే క్రూర ఉద్దేశంతో ఆమెను పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి తోసేసి అక్కడ నుంచి పరారయ్యాడు.
బావిలో పడిపోయిన సదరు మహిళ సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. ఉదయం బావి వద్దకు వెళ్లిన యజమాని లోపల నుంచి శబ్దాలు రావడంతో గమనించగా, మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో ఆయన వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని తాళ్లు, మంచం సహాయంతో ఆమెను బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
చిన్నారిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు..