మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల
ABN , Publish Date - Jul 02 , 2026 | 02:31 PM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పటివరకు మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు మంత్రి తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని మంత్రి తుమ్మల అన్నారు.
Also Read:
‘మీ అవినీతిని మాకు అంటించాలని చూస్తున్నారా’.. బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ఫైర్
వారెవ్వా... మీ డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ సెటైర్లు