తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ఇకపై టీచర్లకూ మధ్యాహ్న భోజనం..
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:54 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలతో పాటు ఉపాధ్యాయ సిబ్బందికీ అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిశ్చయించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలతో పాటు ఉపాధ్యాయ సిబ్బందికీ అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిశ్చయించింది. ఈ మేరకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి వచ్చింది.