-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 19th June 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 19 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jun 19, 2026 21:48 IST
భద్రాద్రి కొత్తగూడెం: టేకులపల్లి మం. గంగారం సమీపంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ఇసుక లోడు కోసం వెళ్తుండగా పొలంలోకి దూసుకెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా కుంజ రాజబాబు(35) అనే వ్యక్తి మృతి
మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
-
Jun 19, 2026 21:12 IST
రేపు బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
హుగ్లీలో పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పాల్గొననున్న మోదీ
-
Jun 19, 2026 21:03 IST
పల్నాడు: లింగంగుంట్లలో రేపు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
-
Jun 19, 2026 20:28 IST
యోగా కార్యక్రమం కోసం రేపు విజయవాడకు బాబా రాందేవ్
రేపు ఉండవల్లి దగ్గర యోగా కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
-
Jun 19, 2026 20:24 IST
అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు
వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి
స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దని సీఎం స్పష్టీకరణ
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రపై సమీక్షలో సీఎం చంద్రబాబు
-
Jun 19, 2026 19:42 IST
హైదరాబాద్: ఫాల్కన్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
వరల్డ్ లైన్ ఈ-పేమెంట్ గేట్వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 792 కోట్ల మోసం
గతంలోనే ఫాల్కన్ గ్రూప్ ఎండీ అమర్‌దీప్ కుమార్‌తో పాటు పలువురు కీలక నిందితుల అరెస్ట్
-
Jun 19, 2026 19:21 IST
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, ఎంపీలు
పార్టీ మారినట్టు ప్రకటించిన 20 మంది టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు
20 మంది ఎంపీలపై ఇప్పటి వేర్వేరు అనర్హత పిటిషన్లు దాఖలు చేసినట్టు వెల్లడి
పార్టీ మారిన ఎంపీలకు నిజాయతీ ఉంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్
-
Jun 19, 2026 19:01 IST
హైదరాబాద్: KPHB పరిధిలో పురుగులమందు తాగి మమత(23) ఆత్మహత్య
అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు
-
Jun 19, 2026 18:35 IST
ఆదాయ వనరుల పెంపుపై డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష
ఖజానాకు ఆదాయమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణకు ఆదేశాలు
PPP మోడల్‌లో టూరిజం ఆస్తుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంపై దూకుడు పెంచాలని సూచన
-
Jun 19, 2026 18:32 IST
నంద్యాల జిల్లా: వెలుగోడు సమీపంలో చిరుత పులి కలకలం
వెలుగోడు ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ ఫారెస్ట్ నర్సరీ వద్ద చిరుత సంచారం
నంద్యాల వెళ్లే ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారుల కంటపడిన చిరుత
-
Jun 19, 2026 18:13 IST
నీట్ రీఎగ్జామ్ పేపర్ లీక్ వార్తలను కొట్టిపారేసిన ఎన్టీఏ
ఇన్‌స్టాగ్రామ్‌లో పేపర్ లీక్ అయినట్టు ఓ నెటిజన్ ఆరోపణలపై స్పందించిన ఎన్టీఐ
అవన్నీ అసత్య ప్రచారాలని స్పష్టీకరణ
-
Jun 19, 2026 17:53 IST
దేశానికే రోల్ మోడల్‌గా 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం: సీఎం రేవంత్
140 కోట్ల మంది ఉన్న దేశానికి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ రాలేదు: రేవంత్
పాలకులకు చిత్తశుద్ధి లేకే ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ రావట్లేదు: రేవంత్
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభిస్తున్నాం: రేవంత్
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది: రేవంత్
కార్పొరేట్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: రేవంత్
-
Jun 19, 2026 17:41 IST
ఆంధ్రప్రదేశ్ పేలుడు పదార్థాల కేసులో రెండో నిందితుడిపై NIA ఛార్జ్‌షీట్ దాఖలు
షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్ విజయకుమార్‌పై UAPA, BNS సెక్షన్ల కింద కేసు
విజయవాడ NIA ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ సమర్పించిన అధికారులు
ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు
ప్రధాన నిందితుడు షేక్ అమనుల్లాపై ఫిబ్రవరి 2026లోనే NIA ఛార్జ్‌షీట్
అమనుల్లా ఇంట్లో పేలుడు పదార్థాలు, ఇతర కీలక ఆధారాల స్వాధీనం
-
Jun 19, 2026 17:39 IST
కర్నూలు: పాతబస్తీకి చెందిన టీడీపీ కార్యకర్త తజీంపై దాడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
వన్ టౌన్ పీఎస్ నుంచి కొండారెడ్డి బురుజు మీదుగా కోర్టు వరకు నడిపించి తీసుకెళ్లిన పోలీసులు
నిందితులు రిమాండ్‌కు తరలింపు
-
Jun 19, 2026 17:37 IST
యువతను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తోంది: సీఎం రేవంత్
60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చింది: రేవంత్
లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమబాట పట్టారు: సీఎం రేవంత్
వందలాదిమంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది: సీఎం రేవంత్
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం త్యాగాలు చేశారు: సీఎం రేవంత్
విద్యాశాఖకు బడ్జెట్‌లో రూ.26,600 కోట్లు కేటాయించాం: రేవంత్
రాష్ట్ర బడ్జెట్‌లో 8.5 శాతం విద్యకే కేటాయిస్తున్నాం: సీఎం రేవంత్
-
Jun 19, 2026 17:32 IST
ముక్కోణపు సిరీస్: అఫ్గాన్-ఎ చిత్తు.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ
అఫ్గానిస్థాన్-ఎ జట్టుపై 103 పరుగుల తేడాతో శ్రీలంక-ఎ ఘన విజయం
ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరిన శ్రీలంక-ఎ
ఫైనల్‌లో భారత్-ఎతో తలపడనున్న శ్రీలంక-ఎ
-
Jun 19, 2026 17:29 IST
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం
రూ.50.73 కోట్లతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి
రూ.36.65 కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన
-
Jun 19, 2026 17:23 IST
విశాఖ: రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి
ఏసీబీ అధికారులకు చిక్కిన జీవీఎంసీ NAD జోనల్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్
మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన శ్రీనివాస్
ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
-
Jun 19, 2026 17:21 IST
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం
రాహుల్ జన్మదినం నాడు సీఎం రేవంత్ రెడ్డి రైతులపై విషం కక్కారు: హరీశ్ రావు
వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రైతు డిక్లరేషన్ ప్రకటించారు: హరీశ్ రావు
రాహుల్ జన్మదినం నాడు ఆ డిక్లరేషన్‌ను సీఎం రేవంత్ బొందపెట్టారు: హరీశ్ రావు
ధాన్యం ఏదైనా ఎంఎస్‌పీ, బోనస్ ఇస్తామని రాహుల్ చెప్పారు: హరీశ్ రావు
-
Jun 19, 2026 17:14 IST
'ఉషది ఏ తెగ?' అని అమ్మ అడిగింది: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
భారతీయుల గురించి తన తల్లికి పెద్దగా తెలియదన్న వాన్స్
తన భార్య ఉషది ఏ తెగ అని తల్లి అడిగారని వాన్స్ వెల్లడి
ఉష, తన తల్లి భిన్న ప్రపంచాల నుంచి వచ్చారని సమాధానమిచ్చినట్టు వ్యాఖ్య
-
Jun 19, 2026 17:05 IST
ఐపీఎల్‌లోకి యువరాజ్ సింగ్ రీఎంట్రీ!
ఐపీఎల్ 2027: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో భారీ మార్పులు
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్ చేరనున్నట్లు సమాచారం
-
Jun 19, 2026 16:56 IST
అమరావతి: సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబసభ్యులు
న్యాయం చేయాలని సీఎంను కోరిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు: సాయికృష్ణ తల్లి
అన్నివిధాలా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు: సాయికృష్ణ తల్లి
సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.. మాకు అదే చాలు: సాయికృష్ణ తల్లి
ఏ సాయం కావాలన్నా తనను కలవాలని సీఎం సూచించారు: సాయికృష్ణ తల్లి
బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారు: సాయికృష్ణ తల్లి
-
Jun 19, 2026 16:39 IST
తెలంగాణ CIDకి లోకాయుక్త ఆదేశాలు
HCAపై వచ్చిన ఫిర్యాదులపై 4 వారాల్లో విచారణ పూర్తిచేయాలి: లోకాయుక్త
ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదిక సమర్పించాలి: లోకాయుక్త
15 ఏళ్లుగా HCAలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందని CIDకి ఫిర్యాదులు
ఫిర్యాదులపై లోకాయుక్తను ఆశ్రయించిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
TG 20 గవర్నింగ్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని లోకాయుక్తను కోరిన TCA
-
Jun 19, 2026 16:32 IST
HCA నిర్వహిస్తున్న TG 20 లీగ్‌పై హైకోర్టులో పిటిషన్
TG 20 లీగ్‌కు చట్టబద్ధత లేదని తెలంగాణ క్రికెటర్లు పిటిషన్
TG 20 లీగ్‌ను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
క్రికెటర్ అంబటి రాయుడు, TG20 గవర్నింగ్ కౌన్సిల్ తమకు అన్యాయం చేశారని పిటిషన్
-
Jun 19, 2026 16:27 IST
దురంధర్ మూవీ సన్నివేశాలతో ప్రొఫెసర్ పాఠాలు
ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో అద్భుత దృశ్యం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
సంక్లిష్ట అంశాలను సులభంగా వివరించిన ప్రొఫెసర్
-
Jun 19, 2026 16:19 IST
ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
జూన్ 20న చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
అన్నదాత సుఖీభవ నిధుల ద్వారా 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి
పీఎం కిసాన్ యోజన నిధులనూ రేపే విడుదల చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
Jun 19, 2026 16:18 IST
వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్
రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు
ఆటగాళ్ల ఎంపికపై జరుగుతున్న చర్చలు పూర్తిగా అంతర్గతం: బీసీసీఐ
వారు ఆడతారా? లేదా? అనే విషయం ఇప్పుడే చెప్పలేం: బీసీసీఐ
-
Jun 19, 2026 16:15 IST
నిజామాబాద్‌లో దారుణం
రెండు నెలల పసికందును హత్యచేసిన తండ్రి యువరాజ్
పసికందు మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసిన తండ్రి
ఈనెల 17న పసికందును ఇంటి నుంచి తీసుకెళ్లిన తండ్రి
పోలీసుల అదుపులో నిందితుడు యువరాజ్
-
Jun 19, 2026 16:11 IST
హైదరాబాద్: LB స్టేడియానికి సీఎం రేవంత్
యంగ్ ఇండియా వెల్‌కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి హాజరుకానున్న రేవంత్
-
Jun 19, 2026 16:05 IST
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన షెడ్యూల్
ఈనెల 28 నుంచి 3 రోజులపాటు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నితిన్ నబీన్
10 జిల్లాల బీజేపీ కార్యాలయాలను ప్రారంభించనున్న నితిన్ నబీన్
-
Jun 19, 2026 16:01 IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ
వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, కౌలు రైతులకు ఇచ్చిన రుణాలపై సమీక్ష
-
Jun 19, 2026 15:59 IST
తెలంగాణ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం అనుమతి
మూసీ ప్రాజెక్ట్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్
రూ.533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగానికి కేంద్రం అనుమతి
ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని భూమిలో అభివృద్ధి పనులకు లైన్‌క్లియర్
MRDCకి రాష్ట్రపతి ఆమోదంతో అనుమతులు
-
Jun 19, 2026 15:53 IST
హైదరాబాద్: ప్రజా ప్రతినిధుల కోర్టుకు కుంభం శివకుమార్‌రెడ్డి బాధితురాలు
మీనాక్షి నటరాజన్‌పై ప్రైవేట్ కంప్లయింట్ ఫైల్ చేసిన బాధితురాలు
ప్రజా ప్రతినిధుల కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు
మీనాక్షి నటరాజన్‌తో పాటు ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చిన బాధితురాలు
-
Jun 19, 2026 15:46 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
607 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
155 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Jun 19, 2026 15:40 IST
హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
మణికొండలో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన పవన్ కల్యాణ్
తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన ఆఫీస్‌తో శ్రీకారం
పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై ఫోకస్
-
Jun 19, 2026 15:17 IST
టీమిండియాకు కోచ్ అవసరం లేదు: టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్
భారత ప్రధాన కోచ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ విమర్శలు
గంభీర్ హయాంలోనే టెస్ట్ క్రికెట్‌లో వైఫల్యాలు: శ్రీశాంత్
టీమిండియాకు కోచ్ కాదు.. ధోని లాంటి మెంటార్ అవసరం: శ్రీశాంత్
-
Jun 19, 2026 15:15 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో చికోటి ప్రవీణ్‌ను విచారించిన సిట్
సిట్ విచారణ అనంతరం చికోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా: ప్రవీణ్
మా ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు విన్నారు: ప్రవీణ్
-
Jun 19, 2026 14:57 IST
దేశ క్వాంటం టెక్నాలజీ ప్రస్థానంలో ఏపీ సరికొత్త చరిత్ర
క్వాంటం టెక్నాలజీ రంగంలో అమరావతి క్వాంటం వ్యాలీ రికార్డు
అత్యంత శీతల ఉష్ణోగ్రతలు 4 కెల్విన్‌ను సాధించిన క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్
భారత్‌కే తలమానికంగా అమరావతి ఫెసిలిటీ సెంటర్
-
Jun 19, 2026 14:55 IST
భారతీయ భాషల్లో ఏఐ అభివృద్ధిపై జియో ప్రత్యేక దృష్టి
భారత్ కోసం, భారతీయుల చేత ఏఐను నిర్మిస్తున్నాం: ఆకాశ్ అంబానీ
దేశవ్యాప్తంగా ఏఐ సేవలను అందుబాటులోకి తేవడమే రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యం: ఆకాశ్
ఆ లక్ష్యంతోనే రిలయన్స్ ఇంటెలిజెన్స్ ముందుకు సాగుతోంది: ఆకాశ్
-
Jun 19, 2026 14:52 IST
జియో నెట్‌వర్క్‌లో ఇక ఏఐ ఏజెంట్
రిలయన్స్ ఏజీఎంలో కీలక ప్రకటన చేసిన ఆకాశ్ అంబానీ
జియో నెట్‌వర్క్‌లో ఏఐ ఏజెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడి
కాల్‌లను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌స్క్రైబ్ చేసే సదుపాయం
ఈ ఏడాది చివరి నాటికి సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటన
-
Jun 19, 2026 14:45 IST
మరికాసేపట్లో సీఎం చంద్రబాబును కలవనున్న సాయి కృష్ణ కుటుంబ సభ్యులు
ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి వెళ్లనున్న సాయి కుటుంబ సభ్యులు
-
Jun 19, 2026 14:38 IST
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్
బ్రహ్మనాయుడిపై గండిపేట భూకబ్జా యత్నం కేసు
ఈ కేసులో బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
-
Jun 19, 2026 14:34 IST
రిలయన్స్ జియో లాభం రూ.30 వేల కోట్లు
2025-26 ఆర్థిక ఏడాదిలో రూ.1.46 కోట్లు ఆర్జించిన జియో
జియోకు 268 మిలియన్ 5జీ వినియోగదారులున్నట్టు ఆకాశ్ అంబానీ వెల్లడి
-
Jun 19, 2026 14:20 IST
ఇరాన్-అమెరికా శాంతి చర్చలకు బ్రేక్
చర్చలు వాయిదా పడినట్లు ప్రకటించిన స్విట్జర్లాండ్
చివరి నిమిషంలో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న జేడీ వాన్స్
-
Jun 19, 2026 14:19 IST
నేడే సెబీకి రిలయన్స్ జియో ఐపీఓ డ్రాఫ్ట్ డాక్యుమెంట్స్
బోర్డు ఆమోదించినట్టు ముకేశ్ అంబానీ వెల్లడి
-
Jun 19, 2026 14:04 IST
'నక్సల్ రహిత భారత్' లక్ష్య సాధనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన
అంతర్గత భద్రతలో కేంద్ర హోంశాఖ కీలక మైలురాయి
దేశంలో నక్సలిజం అణచివేతపై కీలక నివేదిక విడుదల
-
Jun 19, 2026 13:52 IST
వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
కాసేపట్లో బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టు తీర్పు
ఇప్పటికే ముగిసిన మూడు రోజుల కస్టడీ విచారణ
ఫేక్ జీవో కేసులో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడి అరెస్ట్
-
Jun 19, 2026 13:51 IST
హైదరాబాద్ ప్రజలు.. కాంగ్రెస్, బీజేపీని నమ్మలేదు: కేటీఆర్
కాంగ్రెస్ సినిమా సగం అయిపోయింది: కేటీఆర్
కాంగ్రెస్ పాలన ఫస్ట్‌ఆఫ్ అట్టర్‌ఫ్లాప్: కేటీఆర్
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పాలనను తిట్టుకోనివారులేరు: కేటీఆర్
హామీల గురించి అడిగితే.. రేవంత్ నోటికొచ్చినట్టు తిడుతున్నారు: కేటీఆర్
-
Jun 19, 2026 13:26 IST
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట
విజయ్ బలపరీక్షపై CBI విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌ను విచారించలేమని సుప్రీం స్పష్టం
రికార్డుల్లో బలమైన ఆధారాలు లేవన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం
-
Jun 19, 2026 13:24 IST
రాజమండ్రి: రైలు వంతెన పైనుంచి గోదావరిలో దూకి ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
మృతుడు రాజానగరం మండలం శ్రీ రాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ(32)గా గుర్తింపు
మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
-
Jun 19, 2026 13:07 IST
హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు సమన్లు
సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్‌కు సమన్లు
ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు
A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం
-
Jun 19, 2026 12:59 IST
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్
చికోటి ప్రవీణ్ స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న సిట్
గతంలో తన ఫోన్ ట్యాప్ అయిందని ప్రవీణ్ ఫిర్యాదు
-
Jun 19, 2026 12:25 IST
సుప్రీం తాజా నిర్ణయంతో నీట్ రీఎగ్జామ్‌కు లైన్ క్లియర్
నీట్ అభ్యర్థులకు సుప్రీం కోర్టులో దక్కని ఊరట
రీఎగ్జామ్‌కు సంబంధించి అత్యవసర పిటిషన్లపై విచారణకు నిరాకరణ
-
Jun 19, 2026 12:24 IST
సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: అద్దంకి దయాకర్
సింగరేణిపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
సింగరేణిపై బీజేపీ, BRS కలిసి కుట్రలు చేస్తున్నాయి: అద్దంకి
సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నది, బోనస్ ఇచ్చిందే కాంగ్రెస్: అద్దంకి దయాకర్
-
Jun 19, 2026 12:22 IST
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
ఈడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు
ఈడీ జప్తు చేసిన వాన్‌పిక్ ఆస్తులను విడుదల చేయాలని గతంలో ట్రైబ్యునల్ ఆదేశం
ట్రైబ్యునల్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ
-
Jun 19, 2026 12:21 IST
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SLBC సమావేశం
హాజరైన పలువురు మంత్రులు, వివిధ బ్యాంక్ అధికారులు
-
Jun 19, 2026 12:21 IST
అమరాతి: RRRపై థర్డ్ డిగ్రీ కేసు విచారణ
IPS అధికారి సునీల్‌నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
బెయిల్ పిటిషన్‌పై విచారణను జులై 3కి వాయిదా వేసిన హైకోర్టు
-
Jun 19, 2026 12:19 IST
నెల్లూరు జిల్లా: సీతారాంపురం మండలంలో రోడ్డు ప్రమాదం
ట్రాలీ వాహనం ఢీకొని పాదచారుడి మృతి
బోడ సిద్దాయిపల్లి హైవే సర్కిల్ సమీపంలో ఘటన
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 19, 2026 11:55 IST
కోహ్లీపై ఆర్సీబీ ఈవో రాజేష్ మేనన్ కీలక వ్యాఖ్యలు
విరాట్ రిటైర్మెంట్ ప్రచారాన్ని కొట్టిపారేసిన రాజేష్
మరో నాలుగేళ్లు కోహ్లీ కచ్చితంగా ఆడతాడు: రాజేష్
విరాట్ ఫిట్‌నెస్ అద్భుతమని వ్యాఖ్య
-
Jun 19, 2026 11:51 IST
అమరావతి: యోగా వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా బాబా రాందేవ్
శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడకు బాబా రాందేవ్
మంతెన ఆశ్రమంలో రాత్రి బస చేయనున్న రాందేవ్
-
Jun 19, 2026 11:42 IST
తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
మేకెదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తీర్మానం
కర్ణాటకకు కేంద్రం అనుమతి ఇవ్వకూడదన్న అసెంబ్లీ
మేకెదాటు డ్యాంతో రైతులకు తీవ్ర నష్టమని తీర్మానం
-
Jun 19, 2026 11:36 IST
ఢిల్లీ: నీట్ అడ్మిట్ కార్డులపై NTA కీలక ప్రకటన
వాట్సాప్ ద్వారా అధికారిక అప్‌డేట్స్ అందించనున్న NTA
78279 80287 నుంచి మాత్రమే అధికారిక సమాచారం: NTA
బ్లూ టిక్ లేని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దు: NTA
మే 3 నాటి పాత అడ్మిట్ కార్డులు ఇకపై చెల్లవు: NTA
-
Jun 19, 2026 11:19 IST
హైదరాబాద్: కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్
హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఆకస్మిక తనిఖీలు
45 ఫుడ్ లేఅవుట్లు, 8 పన్నీర్ తయారీ కేంద్రాల్లో సోదాలు
జూబ్లీహిల్స్, మాదాపూర్‌లోని రెస్టారెంట్లలో కుళ్లిన చికెన్, పన్నీర్ గుర్తింపు
-
Jun 19, 2026 11:03 IST
హోర్ముజ్ జలసంధిని దాటేందుకు సిద్ధంగా 8 కోట్ల బ్యారెళ్ల చమురు
ఇప్పటికే 60 లక్షల బ్యారెళ్ల చమురుతో హోర్ముజ్‌ను దాటిన మూడు సూపర్ ట్యాంకర్లు
గల్ఫ్ ప్రాంత చమురు రవాణాపై ప్రపంచ మార్కెట్ల దృష్టి
-
Jun 19, 2026 11:01 IST
‘నీట్ పేపర్ లీక్’ ఆత్మహత్యలపై రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి: కాక్రోచ్ జనతా పార్టీ
ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన కాక్రోచ్ జనతా పార్టీ
వారం రోజుల్లో 11 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్న అభిజీత్ దీప్కే
పరీక్ష వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెంచాలని డిమాండ్
-
Jun 19, 2026 11:01 IST
కోల్‌కతా: ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ
ఏపీ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరిన మంత్రి లోకేశ్
-
Jun 19, 2026 10:55 IST
టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
నీట్ యూజీ పరీక్షపై తప్పుడు సమాచార వ్యాప్తి నిరోధానికి బ్యాన్ అవసరమని అభిప్రాయం
టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం
తాత్కాలిక బ్యాన్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఢిల్లీ హైకోర్టు మద్దతు
-
Jun 19, 2026 10:25 IST
మలేషియాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
నగరాల్లో అత్యుత్తమ విధానాలపై అధ్యయనం
నేడు బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ సందర్శన
అతి పెద్ద శానిటరీ ల్యాండ్‌ఫిల్ పరిశీలన
హౌసింగ్ ప్రాజెక్ట్‌లను పరిశీలించనున్న బృందం
-
Jun 19, 2026 10:24 IST
రాహుల్‌గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
రాహుల్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్ష
-
Jun 19, 2026 10:23 IST
పెద్దపల్లి: సింగరేణి కార్మికులకు క్వాలిటీ యంత్రాలు లేవు: కవిత
మంత్రి శ్రీధర్‌బాబు మా పర్యటనలను అడ్డుకుంటున్నారు: కవిత
సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావే కాపాడుతున్నారు: కవిత
సింగరేణి సమస్యలపై హరీశ్‌రావు ఏనాడూ మాట్లాడలేదు: కవిత
మేము కార్మికుల సమస్యలు తప్ప.. రాజకీయాల గురించి మాట్లాడడం లేదు: కవిత
-
Jun 19, 2026 10:21 IST
భారీ నష్టాల్లో ట్రేడవుతోన్న స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 750, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టం
-
Jun 19, 2026 10:21 IST
కాకినాడ: ఇంకా లభించని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ
అనుమానితులు, నిందితుల ఫోన్ డేటాపై పోలీసుల విశ్లేషణ
-
Jun 19, 2026 09:16 IST
ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్‌కు అర్హత సాధించిన మెక్సికో
దక్షిణ కొరియాపై 1-0 తేడా మెక్సికో విజయం
-
Jun 19, 2026 09:01 IST
నిర్మల్: భైంసా పట్టణంలోని శాస్త్రి నగర్, రామ్‌లీలా మైదాన్‌లో కార్డెన్ సెర్చ్
సరైన పత్రాలు లేని 112 బైక్‌లు, 5 కార్లు, 4 ఆటోల సీజ్
-
Jun 19, 2026 08:57 IST
మంచిర్యాల: జన్నారం మండలం మహ్మదాబాద్ సమీపంలో ప్రమాదం
ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో.. ఒకరి మృతి, మరికరికి తీవ్ర గాయాలు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 19, 2026 08:54 IST
శ్రీకాకుళం: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో విషాద ఘటన
ఇద్దరు పిల్లలతో కలిసి.. రైలు కింద పడి తల్లి ఆత్మహత్య
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 19, 2026 08:37 IST
విశాఖ చేరుకున్న మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతదేహం
ఒమన్ తీరంలో క్షిపణి దాడిలో మృతి చెందిన పట్నాల సురేష్
-
Jun 19, 2026 08:36 IST
నేడు తెలంగాణ స్కూల్ విద్యార్థులకు యూనిఫాం, బుక్స్ పంపిణీ
సాయంత్రం 4గంటలకు LB స్టేడియంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
కార్యక్రమానికి హాజరుకానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
-
Jun 19, 2026 08:35 IST
ఫిఫా ప్రపంచ కప్‌లో గొడవ
ఖతార్, కెనడా క్రీడాకారుల మధ్య ఘర్షణ
కెనడా మిడ్ ఫీల్డర్ ఇస్మాయిల్‌కు విరిగిన కాలు
-
Jun 19, 2026 08:33 IST
విజయవాడ: కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు
సాయికృష్ణ అదృశ్యంపై నేడు విజయవాడకు దర్యాప్తు అధికారి
డీజీపీ, సీపీని కలవనున్న దర్యాప్తు అధికారి నరసింహ కిశోర్
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్న నరసింహ కిశోర్
-
Jun 19, 2026 08:32 IST
నల్లగొండ: రామన్నగూడెం స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీకొని.. ముగ్గురి మృతి
మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jun 19, 2026 08:30 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్
మధ్యాహ్నం 12గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీతో సమావేశం
మధ్యాహ్నం 2:30కు CRDA అథారిటీ సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు
-
Jun 19, 2026 08:29 IST
ప్రకాశం: చీమకుర్తి మండలం అగ్రహారంలో విషాదం
ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపి, తండ్రి సుధాకర్ ఆత్మహత్య
భార్య వదిలేసి వెళ్లిందని ఘాతుకానికి పాల్పడ్డ సుధాకర్
-
Jun 19, 2026 08:26 IST
నేటి నుంచి టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్
ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
ఈ నెల 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఈ నెల 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
జులై 10న తొలి విడత సీట్ల కేటాయింపు
జులై 10 నుంచి 14 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ
-
Jun 19, 2026 08:25 IST
కోల్‌కతాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
నేడు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్లీనరీ
ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ప్లీనరీలో పాల్గొననున్న లోకేశ్
‘ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై ప్రసంగించనున్న మంత్రి లోకేశ్
-
Jun 19, 2026 08:22 IST
నేడు అనంతపురంలో కూటమి విజయోత్సవ సభ
సభకు హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
-
Jun 19, 2026 08:22 IST
ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని భారత్‌కు మోదీ
ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటించిన ప్రధాని మోదీ
ఫ్రాన్స్‌లో జరిగిన G7 సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
Jun 19, 2026 07:53 IST
యాదాద్రి: చౌటుప్పల్ మండలం కైతాపురం దగ్గర ప్రమాదం
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఇద్దరు ప్రయాణికులకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 19, 2026 07:14 IST
నేడు మణికొండలో జనసేన తెలంగాణ కార్యాలయం ప్రారంభం
కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన ఆఫీస్‌తో శ్రీకారం
తెలంగాణలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై ఫోకస్
-
Jun 19, 2026 07:13 IST
నేడు విజయవాడలో డ్రగ్స్ కంట్రోల్ భవన్ ప్రారంభం
హనుమాన్‌పేటలో భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
-
Jun 19, 2026 07:12 IST
ఏపీలో నేడు తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం
గన్నవరంలోని మేథా టవర్స్‌లో ఇంక్యుబేటర్ ఏర్పాటు
ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసిన చండీగఢ్ యూనివర్సిటీ
-
Jun 19, 2026 07:11 IST
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
శాంతి ప్రణాళిక అమెరికాకు మంచి ఫలితాలను ఇస్తోంది: జేడీ వాన్స్
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గాయి: జేడీ వాన్స్
నిన్న హోర్ముజ్‌లో 1.25 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా: జేడీ వాన్స్
అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 4 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది: జేడీ వాన్స్
-
Jun 19, 2026 07:10 IST
ఇరాన్ పోర్టులకు వెళ్లే మార్గంలో ఆంక్షల ఎత్తివేత
సముద్ర రవాణాపై ఆంక్షలను ఎత్తేసిన అమెరికా
ఇరాన్‌కు వెళ్లే నౌకలను ఇకపై అడ్డుకోబోమని స్పష్టం
-
Jun 19, 2026 07:09 IST
ఢిల్లీలో పోలీసుల ఆపరేషన్ సైహ్యాక్ 5.0 విజయవంతం
సైబర్ నేరస్థులపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు
2 రోజుల్లో 800 మందికి పైగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్
-
Jun 19, 2026 07:08 IST
నేడు సింగరేణి ఫీల్డ్ విజిట్‌కు బీజేపీ బృందం
మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాలకు బీజేపీ బృందం
సింగరేణిలో బొగ్గుమాయం, అవకతవకలపై పరిశీలన
మూడు ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ నేతలు
-
Jun 19, 2026 07:05 IST
ఏపీలో నేడు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి లోకేష్
-
Jun 19, 2026 06:15 IST
ఫిఫా వరల్డ్ కప్‌లో నేటి మ్యాచ్‌లు ఇవే
ఉదయం 6:30కు మెక్సికో Vs దక్షిణ కొరియా
అర్ధరాత్రి 12:30కు అమెరికా Vs ఆస్ట్రేలియా
శనివారం తెల్లవారుజామున 3:30కు స్కాట్లాండ్ Vs మొరాకో
-
Jun 19, 2026 06:13 IST
తెలంగాణలో 3 రోజులు రిజిస్ట్రేషన్ సేవలు బంద్
ఈ నెల 26 నుంచి 28 వరకూ నిలిచిపోనున్న రిజిస్ట్రేషన్, అనుబంధ శాఖల ఆన్‌లైన్ సేవలు
సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా సేవల నిలిపివేత
రిజిస్ట్రేషన్ పనులు ముందుగానే చేసుకోవాలని అధికారుల సూచన
-
Jun 19, 2026 06:00 IST
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వడగాలులు
ఎండలు, వానలతో ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం
ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్
ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Jun 19, 2026 06:00 IST
నేడు దోహా డైమండ్ లీగ్
దోహా డైమండ్ లీగ్‌లో బరిలో దిగనున్న నీరజ్ చోప్రా
శ్రీలంక ఆటగాడు రుమేశ్ తరంగ పతిరగె నుంచి పోటీ