సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు..
ABN , Publish Date - Jun 19 , 2026 | 01:15 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్‌ను ఆదేశించింది.
హైదరాబాద్, జూన్ 19: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్‌ను ఆదేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు A11 నిందితుడిగా చేర్చారు. థియేటర్ యజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా చేర్చారు. 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు చార్జ్‌షీట్ వేశారు. అల్లు అర్జున్‌తో పాటు మిగిలిన వారికి కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
కేసు వివరాలు..
2024 డిసెంబర్ 5వ తేదీన పుష్ప-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. డిసెంబర్ 4వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షో చూడ్డానికి రేవతి అనే మహిళ తన కుమారుడు శ్రీతేజ్‌తో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చర్లపల్లికి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మొదట నాలుగు వారాల మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి..
ఆకాశంలో విమానం వదిలే తెల్లటి చారల రహస్యం
వైభవ్ రాణిస్తే టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం