Share News

ఈ తెల్లటి చారల రహస్యం మీకు తెలుసా?

ABN , Publish Date - Jun 19 , 2026 | 01:30 PM

ఆకాశంలో విమానం ఎగురుతుంటే దాని వెనుక తెల్లటి గీతలు కనిపించడం మనం తరచూ చూస్తుంటాం. చాలా మంది వాటిని పొగగా భావిస్తారు. వాస్తవానికి అవి మంచు కణాలతో ఏర్పడే కాంట్రెయిల్స్.

ఈ తెల్లటి చారల రహస్యం మీకు తెలుసా?
Airplane White Trails

ఇంటర్నెట్ డెస్క్: ఆకాశంలో విమానం ఎగురుతుంటే దాని వెనుక తెల్లటి గీతలు కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామంది వాటిని పొగగా భావిస్తారు. కానీ నిజానికి అవి పొగ కాదు. విమానం వెనుక కనిపించే ఆ తెల్లటి గీతలను కాంట్రెయిల్స్ (Contrails) అని పిలుస్తారు.


విమానాలు సాధారణంగా 8 వేల మీటర్లకు పైగా ఎత్తులో ప్రయాణిస్తాయి. ఆ ఎత్తులో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మైనస్ 50 నుంచి మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. మరోవైపు విమాన ఇంజిన్లు అత్యంత వేడిగా పనిచేస్తూ నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. ఇంజిన్ నుంచి బయటకు వచ్చే వేడి ఆవిరి చల్లటి గాలిని తాకినప్పుడు వెంటనే ఘనీభవించి చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా మారుతుంది. ఈ మంచు కణాలు కలిసి ఆకాశంలో తెల్లటి గీతల రూపంలో కనిపిస్తాయి. అందుకే విమానం వెనుక పొడవుగా తెల్లటి చారలు కనిపిస్తాయి.


కొన్ని సందర్భాల్లో ఈ గీతలు కొద్ది నిమిషాల్లోనే మాయమవుతాయి. మరికొన్ని సార్లు గంటల తరబడి కనిపిస్తుంటాయి. దీనికి కారణం వాతావరణంలో ఉండే తేమ. గాలి పొడిగా ఉంటే మంచు కణాలు త్వరగా ఆవిరైపోతాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే అవి ఎక్కువసేపు నిలిచి ఉంటాయి. అలాగే ఎక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాల్లో ఈ తెల్లటి గీతలు ఎక్కువగా కనిపిస్తాయి. తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాల వద్ద మాత్రం ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడి గాలి కొంత వెచ్చగా ఉండటంతో నీటి ఆవిరి సులభంగా కలిసిపోతుంది. అందువల్ల విమానం వెనుక కనిపించే తెల్లటి గీతలు పొగ వల్ల కాదు. చల్లటి వాతావరణంలో నీటి ఆవిరి మంచు కణాలుగా మారడం వల్ల ఏర్పడే సహజ ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు

Updated Date - Jun 19 , 2026 | 02:33 PM