కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు
ABN , Publish Date - Jun 19 , 2026 | 09:25 AM
సాయికృష్ణ అదృశ్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు నమోదైంది.
విజయవాడ: అదృశ్యమైన సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయడానికి నియమితులైన దర్యాప్తు అధికారి నరసింహ కిశోర్ నేడు విజయవాడకు చేరుకోనున్నారు.
సాయికృష్ణ అదృశ్య ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించనున్న దర్యాప్తు అధికారి, ముందుగా రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలవనున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించనున్నారు.
Also Read: