ఆస్పత్రులపై నిఘా పెంచాం
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:42 AM
ప్రజారోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
28 శాతం పెరిగిన ఓపీ సేవలు.. సీఎంకు మంత్రి సత్య నివేదిక
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆస్పత్రులపై నిఘా పెంచామని వెల్లడించారు. రెండేళ్ల కూటమి పాలనలో ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఆరోగ్యశాఖ చేసిన ప్రయత్నాలు, సాఽధించిన ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సత్యకుమార్ గురువారం సీఎం చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించారు. రెండేళ్లలో ఓపీ సేవలు 28 శాతం పెరిగాయని తెలిపారు. చంద్రబాబు దార్శనికతతో రూపొందిన ఆరోగ్యాంధ్రప్రదేశ్ విజన్‌కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందని స్పష్టం చేశారు. వివిధ ఆరోగ్య పథకాలను సంజీవని పథకంతో అనుసంధానం చేసి పూర్తిస్థాయిలో డిజిటల్ వైద్య సేవల్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసి... వైద్య సేవలు పొందడంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.