పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 19 , 2026 | 07:23 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి నుంచి మధ్యాహ్నం చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు ఆయన హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు.
అమరావతి, జూన్19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (జూన్ 20వ తేదీ) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.00 గంటలకు ఉండవల్లి గుహల వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు ఆయన చేరుకుంటారు.
ఆ గ్రామంలో స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏపీ సీఎం సందర్శిస్తారు. ఆ కేంద్రం పనితీరును పరిశీలిస్తారు. ఆ తర్వాత రైతులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, వ్యవసాయ పరిస్థితులపై వారితో చర్చిస్తారు. ఆ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నగదును సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు టీడీపీ కేడర్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజా వేదిక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ప్రజావేదికలో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఆయన మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పల్నాడు జిల్లా పర్యటనలో రైతులు, ప్రజలతో సీఎం చంద్రబాబు నేరుగా ముచ్చటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం..
Read Latest AP News And Telugu News