Share News

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం..

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:06 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 235వ బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం..
SLBC Meeting

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 235వ బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు. వ్యవసాయ రంగం, ఎంఎస్‌ఎంఈలు, స్వయం సహాయ సంఘాలు, కౌలు రైతులకు అందించిన రుణాలపై సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.3,86,249కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాంకర్లు వివరించారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.1,17,357కోట్లు, ప్రాధాన్య రంగానికి రూ.5,19,693కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రుణాల పంపిణీ 137 శాతం మేర ఉన్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించేలా సహకారం అందించాలని కోరారు.


కాగా, ఎస్ఎల్‌బీసీ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఆశిష్ పాండే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ డైరెక్టర్ నీలమ్ అగర్వాల్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఏవో బషీర్, నాబార్డ్ జీఎం కేవీఎస్ ప్రసాద్, తదితరులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అండగా ఉంటాం.. సాయికృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు భరోసా

Updated Date - Jun 19 , 2026 | 04:27 PM