Share News

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:19 PM

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలు విజయవంతంగా అమలు చేశామన్నారు.

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Central Minister K Rammohan Naidu

శ్రీకాకుళం, జూన్ 19: కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలు విజయవంతంగా అమలు చేశామన్నారు. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు దశలవారీగా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ‘కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి’ కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాకు మణి హారమైన మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని అన్నారు. నేరడి బ్యారేజ్ అంతర్రాష్ట్ర వివాద పరిష్కారానికి కేంద్రంతో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ సాధించామని వివరించారు.


జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. అందువల్ల దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Jun 19 , 2026 | 04:47 PM