నీట్ అడ్మిట్ కార్డులపై కీలక ప్రకటన.. ఆ పాత అడ్మిట్ కార్డులు చెల్లవు..
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:16 PM
నీట్ 2026 అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 21 (ఆదివారం) జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్ సమాచారం ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు అందనుంది.
న్యూఢిల్లీ, జూన్ 19: నీట్ అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని విద్యార్థుల కోసం ఎన్‌టీఏ నుంచి ఎస్‌ఎమ్‌ఎస్, ఈ-మెయిల్, వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మే 3 నాటి పాత అడ్మిట్ కార్డులు ఇకపై చెల్లవని స్పష్టం చేసింది. కొత్త అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పలువురు విద్యార్థుల కోరిక మేరకు వారు కోరిన నగరాల్లో కొత్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
అందుబాటులోకి వాట్సాప్ సేవలు..
నీట్ 2026 అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 21 (ఆదివారం) జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్ సమాచారం ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు అందనుంది. +91 78279 80287 నంబర్ నుంచి మాత్రమే అధికారిక సమాచారం వస్తుందని ఎన్‌టీఏ వెల్లడించింది. ‘National Testing Agency’ పేరుతో పాటు బ్లూ టిక్ (Verified Tick) ఉంటేనే అది నిజమైన ఖాతా అని పేర్కొంది. బ్లూ టిక్ లేని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని విద్యార్థులను హెచ్చరించింది.
ఆ వాట్సాప్ అకౌంట్ కేవలం బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ మాత్రమేనని.. ఎలాంటి ఓటీపీలు, పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్లు అడగబోమని స్పష్టం చేసింది. అభ్యర్థులు సొంతంగా neet.nta.nic.in వెబ్‌సైట్ టైప్ చేసి అడ్మిట్ కార్ట్‌లను పొందాలని సూచించింది. ఫార్వర్డ్ లింకులను నమ్మొద్దని హెచ్చరించింది. క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ కీలు, లీక్డ్ మెటీరియల్స్‌ను ఎన్‌టీఏ ఎప్పుడూ వాట్సాప్‌లో పంపదని తెలిపింది. ఎన్‌టీఏ డబ్బులు అసలే అడగదని స్పష్టం చేసింది. మోసపూరిత మెసేజ్‌లు వస్తే వెంటనే cybercrime.gov.in లేదా 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎన్‌టీఏ కోరింది.
ఇవి కూడా చదవండి
మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..