Share News

ఇక యమస్పీడ్‌గా రాజధానికి..!

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:54 AM

అనంతపురం జిల్లా నుంచి ప్రస్తుతం రాజధాని అమరావతి, విజయవాడకు వెళ్లాలంటే రోడ్డు ప్రయాణం భారంగా మారింది.

ఇక యమస్పీడ్‌గా రాజధానికి..!
Anantapur Amaravati highway

  • 5 గంటల్లో చేరేలా..

  • రూ.707 కోట్లతో నేషనల్‌ హైవే పనులు

  • ముదిగుబ్బ నుంచి కదిరికి ఫోర్‌లైన్‌

  • జంక్షన్‌గా మారనున్న మలకవేముల క్రాస్‌

అనంతపురం: ప్రస్తుతం జిల్లా నుంచి రాజధాని అమరావతి, విజయవాడకు వెళ్లాలంటే రోడ్డు ప్రయాణం భారంగా మారింది. రైళ్ల సౌకర్యమూ అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు అమరావతి రాజధాని అయినప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యాసంస్థలు వెలిశాయి. గతంలో హైద్రాబాద్‌లో చదవాలనే అలోచన ఉన్నవారంతా.. ప్రస్తుతం విజయవాడ, నూజివీడు పరిసరప్రాంతాల్లోని విద్యాలయాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ అమాంతంగా పెరిపోయింది.


అందుకు తగిన విధంగా సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యకు చెక్‌ పేట్టేలా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. బీకేవీ (బెంగళూరు, కదిరి, విజయవాడ) ప్రాజెక్టు ద్వారా మల్లికవేముల క్రాస్‌ వద్ద జంక్షన్‌ ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల నుంచి రాజధాని అమరావతికి కేవలం 5 గంటల్లో చేరేలా రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా రూ. 707 కోట్లతో ముదిగుబ్బ నుంచి కదిరి వరకు 4 లైన్‌ హైవే నిర్మించనున్నారు.


ఇటు అనంతపురం, అటు బెంగళూరు మార్గాలను మల్లికవేముల క్రాస్‌ వద్ద కలిపి.. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లడానికి మార్గం సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు అనంతపురం నుంచి కళ్యాణదుర్గానికీ ఫోర్‌లైన్‌ రోడ్డు ప్రతిపాదన దశలో ఉంది. అలాగే అనంతపురం నుంచి ఉరవకొండకు సంబంధించి కన్సల్టేషన్‌ స్థాయిలో ఉంది. గుత్తి - కర్ణాటకలోని బీదర్‌ హైవే విస్తరణ చేస్తున్నారు. దీంతో పాటు గుంతకల్లు - బళ్లారి రోడ్డు విస్తరణకు రూ.230 కోట్లతో నూతన టెండర్‌ పిలిచారు.


nh-ro.jpgరాయదుర్గం పట్టణ ప్రారంభంలో రూ.54 కోట్లతో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, పట్టణం ప్రారంభం వరకు రోడ్డు విస్తరణ పనులను కూడా చేపట్టనున్నారు. అలాగే ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి రోడ్డు విస్తరణకు రూ.25 కోట్లతో టెండర్‌ పిలిచారు. ఇక రూ.30 కోట్లతో కదిరి పట్టణంలో రోడ్లు, డ్రైన్లకు సంబంధించి పనులు చేపట్టనున్నారు. అయితే కదిరి మార్గంలోని కుటాగుల వద్ద రోడ్డు విస్తరణ పనులపై కోర్టు స్టే ఉంది. దీంతో ఆ ప్రాంతంలో విస్తరణ పనులు చేపట్టలేదు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేషనల్‌ హైవే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.


ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి

జాతీయ రహదారులను విస్తరిస్తే.. ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి. ఆ రోడ్డు పనులు పూర్తి అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మలకవేముల జంక్షన్‌ ద్వారా చాలా ప్రయోజకరంగా ఉంటుంది. విజయవాడకు ఐదు గంటల్లో వేళ్లేలా రోడ్లను నిర్మిస్తున్నారు. ఇవన్ని వినియోగంలోకి వస్తే ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఇక రాజధానికి సులభంగా వెళ్లవచ్చు.

  • సంజీవరాయుడు, ఎన్‌హెచ్‌ ఎస్‌ఈ


ఈ వార్తలు కూడా చదవండి:

శుభగడియలొచ్చాయ్‌

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 01:17 PM