Share News

రూ.80లక్షల కారులో 11 ఏళ్ల బాలుడి షికారు

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:44 AM

రూ.80లక్షలకుపైగా విలువజేసే కారును పదకొండేళ్ల బాలుడు రయ్‌మంటూ డ్రైవింగ్‌ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.80లక్షల కారులో 11 ఏళ్ల బాలుడి షికారు
11 year boy car driving

  • ఔటర్‌లో రయ్‌మంటూ దూసుకెళ్లిన మైనర్‌

  • పక్కన కూర్చుని మరీ ప్రోత్సహించిన తండ్రి

  • సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..

  • బాలుడి తండ్రిపై కేసులు నమోదు

హైదరాబాద్: రూ.80లక్షలకుపైగా విలువజేసే కారును పదకొండేళ్ల బాలుడు రయ్‌మంటూ డ్రైవింగ్‌ చేస్తే.. అతని తండ్రే పక్కనుండి అతన్ని ప్రోత్సహిస్తే.. వామ్మో.. చెబితేనే ఒళ్లు జలధరిస్తుంది కదూ.. సరిగ్గా ఇటువంటి ఘటనే ఓఆర్‌ఆర్‌పై జరిగింది. దీనిపై స్పందించిన పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు కారును సీజ్‌ చేశారు. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజు వివరాలను వెల్లడించారు.


టోలీచౌకీకి చెందిన వ్యాపారి అబ్దుల్‌ హాది తన కుమారుడు(11ఏళ్లు)తో కలసి అత్యంత ఖరీదైన ఎంజీ సైబర్‌స్టర్‌ కారు (టీజీ07 ఏఆర్‌ 6111)తో గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వైపు ఔటర్‌పై ఈ నెల 11న ప్రయాణం చేశాడు. అయితే, ఎగ్జిట్‌ 17, 18 మధ్యలో తన కుమారుడిని డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చోబెట్టి కారును రయ్‌ మంటూ దూసుకెళ్లేలా నడిపించాడు. అది గమనించిన నెటిజన్లు కొందరు దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.


city6.2.jpgఅప్రమత్తమైన రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు కారు యజమాని అబ్దుల్‌ హాదిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ డ్రైవింగ్‌, డేంజరస్‌ డ్రైవింగ్‌, పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించడం లాంటి పలు సెక్షన్‌ల కింద అబ్దుల్‌ హాదిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించి కారును సీజ్‌ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం రాజేంద్రనగర్‌ పోలీసులకు కేసును అప్పగిస్తామని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పిండి, కొవ్వులతో కల్తీ పనీర్‌ తయారీ

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 10:44 AM