Share News

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:37 AM

హైదరాబాద్‌లోని పలు జిమ్‌లపై ఏసీపీ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల జిమ్‌లలో వరుసగా యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు
Hyderabad Gym News

హైదరాబాద్, జూన్ 19: నగరంలోని పలు జిమ్‌లపై ఏసీపీ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల జిమ్‌లలో వరుసగా యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. శరీరాకృతి కోసం స్టెరాయిడ్లను విచక్షణారహితంగా వాడటం వల్ల తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్‌లోని పలు జిమ్‌లలో వరుసగా తనిఖీలు చేస్తున్నారు.


ఈరోజు(శుక్రవారం) కుల్సుంపురా, టప్పాచబుత్ర, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లోని జిమ్‌లలో పోలీసుల ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో శరీరాకృతి కోసం యువత యధేచ్ఛగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, మాత్రలు వాడుతున్నట్లు గుర్తించారు. జిమ్‌లలో యువకులను కలిసిన ఏసీపీ.. స్టెరాయిడ్ల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. షార్ట్‌కట్ పద్ధతులను వదిలి, సహజ పద్ధతుల్లోనే ఫిట్‌నెస్ సాధించాలని యువతకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 10:41 AM