‘తారా’జువ్వల వెలుగులు
ABN , Publish Date - Nov 08 , 2026 | 07:55 AM
దీపాల వెలుగులు... కొత్త దుస్తుల కళ... ఆకాశంలో టపాసుల సందడి... సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా దీపావళి అంటేనే కలర్‌ఫుల్ ఫెస్టివల్. నేడు దివ్వెల పండగ సందర్భంగా సినీ తారాజువ్వల జ్ఞాపకాల ముచ్చట్లివి...
దీపాల వెలుగులు... కొత్త దుస్తుల కళ... ఆకాశంలో టపాసుల సందడి... సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా దీపావళి అంటేనే కలర్‌ఫుల్ ఫెస్టివల్. నేడు దివ్వెల పండగ సందర్భంగా సినీ తారాజువ్వల జ్ఞాపకాల ముచ్చట్లివి...
200 మట్టి దీపాలతో...
దీపావళి రోజు టపాసుల శబ్దానికి భయపడి ఒక కుక్క పిల్ల నా కారు కింద దాక్కుంది. అది చూసిన తర్వాత నా ఆలోచన మారింది. అప్పటి నుంచి టపాసుల కన్నా దీపాలు వెలిగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నా. నేను మొదటి ఇంటిని కొనుగోలు చేసినప్పుడు దీపావళి పండగ వచ్చింది. ఆ రోజు విశాలమైన మా ఇంటిని నేనొక్కడినే సుమారు 200 మట్టి దీపాలతో అలంకరించా. అదొక బ్యూటీఫుల్ మెమొరీ.
అడవి శేష్
మట్టి దీపాలకు రంగులు
ప్రతీ దీపావళికి అమ్మతో కలిసి ఇంట్లో దీపాలు వెలిగించడం నాకు ఇష్టమైన పని. నాకు పదకొండేళ్ల వయసులో అమ్మ బెంగళూరులోని మల్లేశ్వరానికి తీసుకెళ్లింది. అక్కడ 150 మట్టి దీపాలు కొని, వాటన్నింటికీ నేనే స్వయంగా రంగులు వేశా. దీపావళికి మేము స్నేహితుల ఇళ్లకు వెళ్లినా, మా ఇంటికి అతిథులు వచ్చినా ఆ దీపాలనే కానుకగా ఇచ్చేవాళ్లం. సినిమాల్లోకి వచ్చాక సమయం ఉండట్లేదు కానీ, ఆ పని చేయాలని ఇప్పటికీ కోరికగా ఉంటుంది.
రుక్మిణీ వసంత్
ఒకే చోట విందు
దీపావళి పండగ వచ్చిందంటే... కూర్గ్ ప్రాంతంలో మా సంప్రదాయాల ప్రకారం కుటుంబమంతా కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇంటిని దీపాలతో అలంకరించడం, ఇంటి ముందు రంగవల్లులు వేయడమంటే నాకు భలే సరదా. చిన్నప్పుడు పూజ తర్వాత ప్రసాదంగా ఇచ్చే స్వీట్ల కోసం ఆశగా ఎదురుచూసేదాన్ని. ఇప్పటికీ పండగ రోజున ఒకవేళ షూటింగ్లో బిజీగా ఉంటే... సెట్లో ఒక్క దీపమైనా వెలిగిస్తుంటా.
రష్మిక మందన్న
ఒకప్పుడు సరదా కానీ...
క్రాకర్స్ కాల్చడమంటే ఇష్టం. రాకెట్లు, భూ చక్రాలను చూస్తే ఒక వండర్లా అనిపించేది. అయితే రానురాను క్రాకర్స్ కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుందని తెలుసుకొని మానేశా. నేనైతే... ఇప్పుడు కేవలం దీపాలను వెలిగించి దీపావళి పండగను దేదీప్యమానంగా జరుపుకొంటున్నా.
నిఖిల్ సిద్ధార్థ్
నోములున్నాయి...
దీపావళి వచ్చిందంటే చాలు... తెల్లవారుజామున 4 గంటలకల్లా నిద్ర లేచి పాటలు, డ్యాన్సులు, క్రాకర్స్‌తో సందడి చేసేవాళ్లం. అమ్మతో బయటకు వెళ్లి దీపాలు, పూలు, డెకరేషన్ సామాను తెచ్చేదాన్ని. మాకు దీపావళి నోములున్నాయి. దాంతో సందడి రెట్టింపవుతుంది. చిన్నప్పుడు నా దుస్తుల్ని అమ్మే డిజైన్ చేసి కుట్టేది. ప్రతీ దీపావళికి అమ్మ ఛాయిస్ డ్రెస్ కానీ, చీర కానీ కట్టుకోవడం చేస్తుంటా.
వైష్ణవి చైతన్య
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News