Share News

దీపావళి వేళ.. ఏ రాశుల వారు ఏ దేవుళ్లను పూజించాలి..

ABN , Publish Date - Nov 07 , 2026 | 02:02 PM

దీపావళి వేళ అంతా లక్ష్మీదేవిని పూజిస్తారు. వివిధ రాశుల వారు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలను పూజించడం వల్ల గ్రహాల అనుకూలత బాగా పెరుగుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.

దీపావళి వేళ.. ఏ రాశుల వారు ఏ దేవుళ్లను పూజించాలి..

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి వేళ అంతా లక్ష్మీదేవిని పూజిస్తారు. వివిధ రాశుల వారు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలను పూజించడం వల్ల గ్రహాల అనుకూలత బాగా పెరుగుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.

మేషం, వృశ్చికం..

ఈ రాశుల వారికి కుజుడు అధిపతి. పండుగ రోజు లక్ష్మీదేవితోపాటు శ్రీసుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శ్రేయస్కరం. స్కంద స్తోత్రం పారాయణం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. అలాగే ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులోని కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంలో హోదాతోపాటు జీతభత్యాలు పెరుగుతాయి.

వృషభం, తుల..

ఈ రాశులకు శుక్రుడు అధిపతి. దుర్గమ్మవారిని పూజించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. అలాగే సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.


మిథునం, కన్య..

ఈ రాశులకు బుధుడు అధిపతి. ఈ రోజు లక్ష్మీదేవితోపాటు గణపతిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయిలో పరిచయాలు కలుగుతాయి. వివాహం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని విజయాలు అందుకుంటారు.

కర్కాటకం, సింహం..

ఈ రాశులకు చంద్రుడు, రవి అధిపతులు. లక్ష్మిదేవితోపాటు సూర్యభగవానుడిని ఆరాధించడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ఆదాయ వృద్ధితోపాటు వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అనారోగ్యం బారి నుంచి బయటపడతారు.


ధనుస్సు, మీనం..

ఈ రాశులకు గురువు అధిపతి. లక్ష్మిదేవితోపాటు నరసింహస్వామి, దత్త్రాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మనస్సులోని కోరికలు నెరవేరతాయి. జీవితం సుఖ సంతోషాలతో సాగుతోంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

మకరం, కుంభం..

ఈ రాశులకు శనీశ్వరుడు అధిపతి. ఈ రాశుల వారు ఈ రోజు శివార్చన లేదా శివుడికి అభిషేకం చేయించడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు కలిగి రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంలో లక్ష పత్రి పూజ రద్దు

ఏలూరులో స్వస్తిక్ ముద్రకు బదులుగా వేలిముద్రతో ఓటు

For More Devotional News and Telugu News

Updated Date - Nov 07 , 2026 | 02:15 PM