Share News

ఏలూరులో స్వస్తిక్ ముద్రకు బదులుగా వేలిముద్రతో ఓటు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:51 PM

ఏలూరు జిల్లాలో బ్యాలెట్ పేపర్‌పై వేలిముద్రతో ఓటువేయడం చర్చనీయాంశమైంది. ఓటు చెల్లుతుందని ఓ వర్గం వాదిస్తుండగా.. చెల్లదని ఎలక్షన్ సిబ్బంది వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాగ్వాదం తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఏలూరులో స్వస్తిక్ ముద్రకు బదులుగా వేలిముద్రతో ఓటు
fingerprint vote dispute

ఏలూరు, నవంబర్ 7: జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఓ సంఘటన వివాదానికి కారణమైంది. ఓ ఓటరు బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తుకు బదులుగా వేలిముద్రతో ఓటు వేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఓటు చెల్లుతుందా.. చెల్లదా అనే వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తుతో ఓటు వేయకుండా.. వేలిముద్రతో ఓటు వేశాడు. ఈ సంఘటన ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం.. చెక్కపల్లి చోటుచేసుకుంది. నూజివీడు కౌంటింగ్ కేంద్రంలోని ఓట్ల లెక్కింపులో.. స్వస్తిక్ ముద్రకు బదులుగా వేలిముద్రతో.. అభ్యర్థి గుర్తు అయిన ఫ్యాన్ గుర్తుపై ఓటువేసినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వేలిముద్ర స్లిప్ చెల్లదని.. ఆ ఓటును పరిగణించలేమని ఆర్వో వెల్లడించారు. ఈ మేరకు ఫ్యాన్ గుర్తు గల వైసీపీ అభ్యర్థి, కార్యకర్తలు ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మించిపోకమందే..పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 01:52 PM