Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

ABN , Publish Date - Sep 20 , 2026 | 07:02 AM

వారఫలాలు.. 20 -26 సెప్టెంబర్‌ 2026 పి.ప్రసూనా రామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope

వారఫలాలు.. 20 -26 సెప్టెంబర్‌ 2026 పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgసర్వత్రా అనుకూలమే. సంతో షకరమైన వార్తలు వింటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. తరచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహిం చండి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టు కుంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. సమర్థతను చాటుకుంటారు. మీ నిజాయితీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. లావా దేవీలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణ యం ఉభయులకూ ఆమోదయోగ్యమవు తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgకార్యసిద్థి, వ్యవహారజయం ఉన్నాయి. రావలసిన ధనం అందుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. కొత్త పనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పరిచ యస్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహోపకర ణాలు కొనుగోలు చేస్తారు. పత్రాలు అందు కుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgకుటుంబసౌఖ్యం, ధనలాభం పొందుతారు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. కొత్త యత్నాలు చేపడతారు. బంధుత్వాలు బలపడ తాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాల్లో మార్పులు అనివార్యం. గృహమరమ్మతులు చేపడతారు. పొరుగువారినుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgపరిస్థితులు చక్కబడతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. కొన్ని విష యాలు అనుకున్నట్టే జరుగుతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు.అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం. పొగిడే వ్యక్తుల ఆంత ర్యం గ్రహించండి. కుటుంబసౌఖ్యం పొందుతారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. కొత్త యత్నాలు చేపడతారు. మీ శ్రమ తక్షణం ఫలిస్తుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgకార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం త్వరలో ఫలిస్తుంది. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. కొత్త పనులు చేపడతారు. పత్రాల్లో మార్పులు అనుకూలిం చవు. ఓర్పుతో మరోసారి ప్రయత్నించండి. రావలసిన ధనం అందుతుంది.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgఆదాయం అంతంతమాత్రమే. రుణాలు, చేబదుళ్లు తప్పవు. సాయం చేసేం దుకు అయిన వారే వెనుకాడుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా అడుగు ముందు కేస్తారు. యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం ఉంటుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. నోటీసులు అందుకుంటారు. మీ అభిప్రాయాలకుస్పందన లభిస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgమీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. యత్నాలు విరమించుకోవద్దు. మీ సంకల్ప బలమే శ్రీరామ రక్ష, ఆచితూచి అడుగేయండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్‌ సందేశాలకు స్పందించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆపన్నులకు సాయం అందిస్తారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgఅనుకున్న లక్ష్యం నెరవేరు తుంది. ప్రతీ విషయంలోను ధైర్యంగా ఉంటారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలి స్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మ వద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవు తాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బల పడుతుంది. వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు. కీలక చర్చల్లో పాల్గొంటారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgప్రతికూలతలను అధిగమి స్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగు తాయి. పెద్దల ఆశీస్సులందుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్య మైన పత్రాలు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిపుణులను సంప్రదిస్తారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgసంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. రుణఒత్తిడితో మనశ్శాంతి ఉండదు. చీటికిమాటికి చికాకుపడుతుంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. ఆరోగ్యం మందగిస్తుంది.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. నిపుణులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. మీ ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరించాలి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యంతగదు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. సామరస్యంగా మెలగండి. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అదనపు కట్నం వేధింపులకు నవవధువు బలి

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 07:02 AM