3 కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబడ్డ జెమినై
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:21 AM
కంపెనీల కంప్యూటర్లలో ఉండే బలహీనతలను కనిపెట్టే శిక్షణలో భాగంగా ‘ఇర్రెగ్యులర్’ అనే సైబర్‌సెక్యూరిటీ...
టెస్టింగ్ కోసం డమ్మీ పేర్లు ఇస్తే నిజమైన కంపెనీలు హ్యాక్
వాషింగ్టన్, సెప్టెంబరు 19: కంపెనీల కంప్యూటర్లలో ఉండే బలహీనతలను కనిపెట్టే శిక్షణలో భాగంగా ‘ఇర్రెగ్యులర్’ అనే సైబర్‌సెక్యూరిటీ మూల్యాంకన సంస్థ.. ఈ ఏడాది మే నెలలో గూగుల్ జెమినైకి ఒక పరీక్ష పెడితే, అది నిజంగానే 3 కంపెనీల కంప్యూటర్లను హ్యాక్ చేసింది. వాటిలో ఒక కంపెనీ పాస్‌వర్డ్‌ను జెమినై తానే సొంతంగా అంచనా వేసి లాగిన్ అయ్యింది. మరో రెండు కంపెనీలకు చెందిన సిస్టమ్ పాస్‌వర్డ్స్ అప్పటికే నెట్‌లో లీక్ అవడంతో వాటిని ఉపయోగించి ఆ కంప్యూటర్లలోకి లాగిన్ అయ్యింది. అయితే.. జెమినైకి ఈ పరీక్ష పెట్టిన పరిశోధకులు అది నిజమైన సంస్థల సర్వర్లలోకి చొరబడ్డ విషయాన్ని గుర్తించి టెస్టింగ్‌ను నిలిపివేశారు. ఈ విషయాన్ని గూగుల్ సంస్థకు తెలిపారు. వెంటనే గూగుల్ ప్రతినిధులు ఆయా కంపెనీలను సంప్రదించి వాటి డేటాకు ఎలాంటి హానీ జరగలేదని ధ్రువీకరించుకున్నారు. తమ టెస్టింగ్ ప్రొటోకాల్స్‌ను, భద్రతాపరిమితులను మరింత కఠినతరం చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News