Share News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:00 PM

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్లను డిస్పోజల్ చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
Hyderabad News

హైదరాబాద్, సెప్టెంబర్ 19: హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్లను డిస్పోజల్ చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ గ్యాంగ్ పట్టుబడింది. ఈ ముఠా.. చోరీ చేసిన మొబైల్‌ ఫోన్లను రిసీవ్ చేసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మొబైల్ ఫోన్ రిసీవర్లతో పాటు పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న మరో గ్యాంగ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు.


నిందితుల నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చోరీ మొబైల్ ఫోన్లను ఇతర ప్రాంతాలకు తరలించి, అంతర్జాతీయ స్థాయిలో అక్రమంగా డిస్పోజల్ చేస్తున్న వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సీపీ వీసీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించనున్నారు.


ఇవి కూడా చదవండి...

రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్

బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానంపై అనర్హత వేటు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 01:13 PM