హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Sep 19 , 2026 | 09:55 AM
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: నగరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు భాను వర్ధన్ (27)గా గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన భాను వర్ధన్ నిన్న(శుక్రవారం) రాత్రి స్నేహితుల ఇంటికి వెళ్లాడు. వారంతా కలిసి రాత్రంతా మందు పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్నేహితులంతా కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో భాను వర్ధన్ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయినట్లు సమాచారం. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో అతడు పడిపోయినట్లు తెలుస్తోంది.
విషయం తెలిసిన వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. భాను వర్ధన్ మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
Read Latest Telangana News And Telugu News