Share News

రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్

ABN , Publish Date - Sep 19 , 2026 | 09:36 AM

మహిళను రహస్య వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఆపై ముఖం చాటేసిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. దీంతో తనకు న్యాయం కావాలంటూ బాధితురాలు అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది.

రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
Machilipatnam News

కృష్ణాజిల్లా, సెప్టెంబర్ 19: మహిళను రహస్య వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఆపై ముఖం చాటేసిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. దీంతో తనకు న్యాయం కావాలంటూ బాధితురాలు అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. ఆగస్టు 30న పెంకు ఫనికుమార్ అనే వ్యక్తి జయలక్ష్మిని విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. ఆపై మూడు స్తంభాల సెంటర్ సమీపంలోని అత్తాగారి ఇంట్లో దంపతులు బస చేశారు. అయితే రహస్య వివాహం నిమిత్తం గొడవలు జరుగుతున్నాయనే కారణంతో శక్తి గుడి వద్ద ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో ఉన్నాడు.


చివరకు భార్య జయలక్ష్మిని ఇంట్లో ఒంటరిగా వదిలి ఫణికుమార్ పరారయ్యాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన భార్య.. న్యాయం కోసం అత్తారాంటికి వెళ్లింది. అక్కడ తనను అవమానకర రీతిలో తిట్టి దాడులు జరిపారంటూ జయలక్ష్మి ఆరోపించింది. తన భర్తను తనకు అప్పగించాలంటూ అత్తారింటి ఎదుట బాధితురాలు నిరసనకు దిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

బిల్లుపై సంతకం పెట్టిన ట్రంప్.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు మార్గం సుగమం..

జగన్‌ యూరప్‌ పర్యటనకు షరతులు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 09:45 AM