Share News

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:39 PM

ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. త్వరలో మల్లూరు క్షేత్రంలో మంత్రి పర్యటించనున్నారు.

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Minister Seethakka

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. త్వరలో మల్లూరు క్షేత్రంలో మంత్రి పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అభివృద్ధి పనుల డిజైన్‌ను ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులతో మంత్రి చర్చలు జరిపారు. కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని సూచించారు.


ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. నిర్మాణ పనులకు ముందుగా రాక్ టెస్ట్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. రాక్ టెస్ట్ నివేదిక ఆధారంగా తదుపరి సాంకేతిక అంశాలను ఖరారు చేసే అవకాశం ఉంది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. నాణ్యతా ప్రమాణాలతో, భక్తులకు అసౌకర్యం లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సీతక్క ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానంపై అనర్హత వేటు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 12:39 PM