అదనపు కట్నం వేధింపులకు నవవధువు బలి
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:43 AM
అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన 20 రోజులకే తాను చదువుకుంటున్న కళాశాల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పరిధిలో చోటుచేసుకుంది.
పెళ్లైన 20 రోజులకే కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
ఘట్‌కేసర్ రూరల్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన 20 రోజులకే తాను చదువుకుంటున్న కళాశాల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి- భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పల్లవి (20) ఘట్‌కేసర్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎ్‌సఈ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బద్దం శ్రీకాంత్‌రెడ్డితో ఈ ఏడాది ఆగస్టు 30న వివాహం జరిగింది.
కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి కోసం తనకు రూ. 16 లక్షలు ఖర్చయ్యిందని, వారికి ఊరిలో ఉన్న భూమిని అమ్మి ఆ మొత్తాన్ని చెల్లించాలని పల్లవిని శ్రీకాంత్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అవి భరించలేక మనోవేదనకు గురైన పల్లవి.. శుక్రవారం సాయంత్రం కళాశాల భవనం మూడో అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వికసిత్ భారత్‌లో తెలంగాణ కీలకం
ఫాంహౌజ్ పక్కనే కేసీఆర్ రిజర్వాయర్ కట్టారు
Read Latest AP News And Telangana News And International News And Telugu News