Share News

జపాన్‌లో భూప్రకంపనలు.. 22 మందికి గాయాలు!

ABN , Publish Date - Nov 08 , 2026 | 06:57 AM

జపాన్‌లో మరోసారి భూమి కంపించింది. మధ్య జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు.

జపాన్‌లో భూప్రకంపనలు.. 22 మందికి గాయాలు!
Japan Earthquake

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై 5.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలతో మధ్య జపాన్‌ ప్రాంతం వణికిపోయింది. పలు భవనాల్లో అద్దాలు పగిలిపోగా, దుకాణాల్లో వస్తువులు చెల్లాచెదురయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.


షిజువోకా ప్రిఫెక్చర్‌లో భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఉన్నట్లు జేఎంఏ వెల్లడించింది. కాగా.. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్‌) మాత్రం దీని తీవ్రత 5.5గా నమోదు చేసింది. ఈ ఘటనతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో‌ బుల్లెట్‌ రైళ్లను తక్కువ వేగంతో నడిపించారు.


ఇవీ చదవండి:

60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

రూ.లక్షతో సౌర వాహనం.. 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!

Updated Date - Nov 08 , 2026 | 07:11 AM