Share News

లవ్‌ అనేది ఓ ఛాయిస్‌!

ABN , Publish Date - Sep 06 , 2026 | 08:00 AM

అన్న చాటు తమ్ముడిగా కాకుండా... ఆనంద్‌ దేవరకొండ నెమ్మది నెమ్మదిగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ... యూత్‌స్టార్‌ అయ్యాడు.

లవ్‌ అనేది ఓ ఛాయిస్‌!
Anand Deverakonda

అన్న చాటు తమ్ముడిగా కాకుండా... ఆనంద్‌ దేవరకొండ నెమ్మది నెమ్మదిగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ... యూత్‌స్టార్‌ అయ్యాడు. కొత్త దర్శకులతో పనిచేస్తూ... కొత్తదనం కోరుకొనే ఈ యువనటుడు తాజాగా ‘ఎపిక్‌’తో వస్తున్నాడు. ఈ సందర్భంగా అతడిని సరదాగా పలకరిస్తే...

థియేటర్‌ నుంచి...

నేను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు అన్న (విజయ్‌ దేవర్‌కొండ)తో పాటు థియేటర్‌ ఆర్ట్స్‌లో చేరా. ఇతరులతో ఇంటరాక్ట్‌ అవ్వడానికి మాత్రమే అందులో చేరా. సినిమాల్లోకి రావాలని మాత్రం కాదు. ఎందుకంటే అప్పటికి మా కుటుంబ పరిస్థితి బాగాలేదు. ఆర్థికంగా ఇబ్బందులుండేవి. అందుకే పై చదువుల కోసం, ఉద్యోగం చేయాలని నిర్ణయించుకొని అమెరికా వెళ్లా. నాకు ఉద్యోగం రావడం... అన్న నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ విడుదలవ్వడం ఒకేసారి జరిగాయి.


వంట చేస్తా... కానీ...

‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీ’ సినిమాలో టిఫిన్‌ సెంటర్‌ ఓనర్‌గా చేశా. అమెరికాలో ఉన్నప్పుడు ఎక్కువగా బయట ఫుడ్‌ తినేవాడిని. చదువుకొనేప్పుడు మాత్రం అమ్మ ట్యూషన్‌లాగా చెబుతుంటే, నేను వంట చేసేవాడిని. ఎగ్‌ బుర్జీ, పప్పు, చికెన్‌ కర్రీ బాగా చేస్తా. నిజానికి కుకింగ్‌ అంటే నాకు పెద్దగా నచ్చదు. కుకింగ్‌ తర్వాత వంటగది క్లీన్‌ చేయాలంటే చిరాకు. అందుకే వంట జోలికి వెళ్లాలనిపించదు.


book2.2.jpgనన్ను నేను చూసుకున్నా...

‘ఎపిక్‌’ నా రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో లోన్స్‌ తీసుకొని విదేశాలకు వెళతాడు. నిజజీవితంలో కూడా నేను అలాగే వెళ్లా. కాబట్టి ఆ పాత్రలో నన్ను నేను చూసుకున్నా. నాలాగే విదేశాలకు వెళ్లి చదువుకున్నవారంతా... ఈ సినిమాకి కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. అలాగే విదేశాల్లో షూటింగ్‌ చేసిన నా మొదటి సినిమా ఇది. నేను విదేశాల్లోనే చదువుకున్నప్పటికీ, సినిమా కోసం విదేశాలకు వెళ్లడంతో ఎంజాయ్‌ చేశా.


అచ్చు అమ్మలాగే...

వదిన (రష్మిక) మా ఇంట్లోకి రావడం సడెన్‌ డెసిషన్‌ అయితే కాదు. ముందుగానే వాళ్ల ప్రేమ మా కుటుంబానికి అర్థమయ్యింది. వదిన రావడం వల్ల మా కుటుంబంలో సంతోషం మరింత పెరిగింది. అమ్మకి మంచి కంపెనీ దొరికింది. తనని చూస్తే అచ్చు అమ్మలాగే అనిపిస్తుంది. వదిన వండర్‌ఫుల్‌ పర్సన్‌. ఒకరకంగా తను మా ఇంట్లోకి ఒక ఎనర్జీ తీసుకొచ్చింది.


book2.3.jpgఅంతా కొత్తవాళ్లే...

రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ నుంచి చాలా సినిమాలు చేయొచ్చు. హిందీలో రాజ్‌కుమార్‌ రావు, ఆయుష్మాన్‌ ఖురానా సినిమాలు చూస్తే మనకర్థమవుతుంది. నేను కూడా అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతా. హాలీవుడ్‌ కామెడీ సినిమాలంటే కూడా ఇష్టం. ఇప్పటిదాకా నా దర్శకులంతా కొత్తవాళ్లే. వాళ్లు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సినిమా అనేది బేసిగ్గా డైరెక్టర్‌ మీడియం. అందులో నాదొక రోల్‌ అంతే.


ప్రేమంటే...

లవ్‌ అనేది నా దృష్టిలో... అదొక ఛాయిస్‌. ప్రేమనేది ఫీలింగ్‌ అని నేననుకోను. నా చుట్టూ పరిస్థితుల్ని, నా అనుభవాల్ని బట్టి చెబుతున్నా. కుటుంబం మీద మనకి ప్రేమ ఉంటుంది. దాన్ని మార్చలేం. కానీ పార్ట్‌నర్‌ విషయంలో ఒకరిని ఎంచుకొని, వారి పట్ల ఆకర్షితులవుతాం. అంటే.. అంతా లెక్కలేసుకొని ప్రేమిస్తున్నట్లే కదా!


పాంచ్‌ పటాకా

ఇష్టమైన ఫుడ్‌: బిర్యానీ, చాక్లెట్స్‌

హాలీడే స్పాట్‌: బాలీ

హీరోయిన్‌: మమితా బైజు (ప్రస్తుతం)

హీరోలు: చిరంజీవి, మహేష్‌బాబు

ప్లస్‌ - మైనస్‌: సెల్ఫ్‌ అవేర్‌నెస్‌

  • సౌమ్య నాగపురి


ఈ వార్తలు కూడా చదవండి:

రేవంత్‌కు రెండో చాన్స్‌ ఉందా...

ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్‌ లీవ్‌లకు సర్కారు ఓకే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 08:00 AM