Share News

చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:53 AM

మహిళల ఆసియా కప్ గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ యువ సంచలనం షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఒకే మ్యాచ్‌లో ఏకంగా మూడు రికార్డులు నెలకొల్పింది.

చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు
Shafali Verma

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్ గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ యువ సంచలనం షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఒకే మ్యాచ్‌లో ఏకంగా మూడు రికార్డులు నెలకొల్పింది. పాక్‌పై బ్యాట్‌తో 12 పరుగులతో పాటు బంతితో ఓ వికెట్ కూడా పడగొట్టింది. ఈ క్రమంలో షఫాలీ అంతర్జాతీయ టీ20ల్లో 3,000 పరుగుల మైలురాయిని చేరుకుంది. మహిళల టీ20ల్లో ఈ ఫీట్ అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది.


22 ఏళ్ల 220 రోజుల వయసులో షఫాలీ ఈ మైలురాయిని అందుకుంది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన గ్యాబీ లూయిస్(24 ఏళ్ల 347 రోజులు) పేరిట ఉండేది. ఈ క్రమంలో లూయిస్ రికార్డును షఫాలీ తాజాగా బద్దలు కొట్టింది. ఈ జాబితాలో భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన నాలుగో స్థానంలో ఉంది. ఆమె 27 ఏళ్ల 171 రోజుల వయసు ఉన్నప్పుడు ఈ ఫీట్ అందుకుంది. దాంతోపాటు, కేవలం 2,182 బంతుల్లోనే 3వేల పరుగులు చేసి షఫాలీ మరో రికార్డు కూడా నెలకొల్పింది. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలీసా హీలీ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమె 2,321 బంతుల్లో 3వేల పరుగుల ఫీట్ అందుకుంది. తాజాగా షఫాలీ ఈ రికార్డును కూడా బ్రేక్ చేసింది. 2019లో కేవలం 15 ఏళ్ల వయసులో భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేసిన షఫాలీ.. ఇప్పుడు 3,000 పరుగుల క్లబ్‌లో చేరిన భారత మూడో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. తొలి రెండు స్థానాల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

ఒకేరోజు రిటైర్‌మెంట్.. ఆ విషయం చెప్పగానే ధోని షాకయ్యాడు: సురేశ్ రైనా

యూఎస్ ఓపెన్: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపేసిన సబలెంకా

Updated Date - Sep 06 , 2026 | 07:05 AM