విలియమ్స్ సిస్టర్స్ పోరాడినా..
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:44 AM
డబుల్స్‌తో యూఎస్ ఓపెన్‌లో పునరాగమనం చేయాలన్న సెరెనా/వీనస్ విలియమ్స్ సోదరీమణుల ఆశ నెరవేరలేదు. పట్టువిడకుండా పోరాడి మ్యాచ్‌ను టై బ్రేక్‌కు మళ్లించారు...
డబుల్స్‌తో యూఎస్ ఓపెన్‌లో పునరాగమనం చేయాలన్న సెరెనా/వీనస్ విలియమ్స్ సోదరీమణుల ఆశ నెరవేరలేదు. పట్టువిడకుండా పోరాడి మ్యాచ్‌ను టై బ్రేక్‌కు మళ్లించారు. టైబ్రేక్‌లోనూ తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. దాంతో హవో చింగ్ చాన్ (తైవాన్)/మయా జోయింట్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన తొలి రౌండ్ పోరులో సెరెనా/వీనస్ జోడీ 3-6, 7-6 (6), 6-7 (10)తో పరాజయం పాలై నిరాశగా వెనుదిరిగింది. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, నిక్కీ పూనాచాలకు ఆదిలోనే చుక్కెదురైంది. తొలి రౌండ్లో యుకీ భాంబ్రీ /మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ 6-7 (7), 6-7 (7)తో అమెరికా ద్వయం ర్యాన్ సెగర్మన్/పాట్రిక్ చేతిలో.. నిక్కీ పూనాచా/గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) జోడీ 6-7(7), 7-6(4), 2-6తో నీల్ (ఆస్ట్రియా)/పీటర్ నోజా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి
మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్’ నోటీసులు
సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్