ఫైనల్‌కు సాత్విక్ జోడీ
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:46 AM
భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మూడోసారి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో...
చైనా మాస్టర్స్
షెన్‌ఝన్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మూడోసారి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట 21-16, 18-21, 21-11తో మలేసియాకు చెందిన నూర్ మహ్మద్-టాన్ వి కియాంగ్‌పై పోరాడి గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో చైనా ద్వయం హి జి టింగ్-రెన్ జియాంగ్ యుతో సాత్విక్ జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. సాత్విక్/చిరాగ్ జంట గతంలో రెండుసార్లు (2023, 2025లో) ఇక్కడ రన్నర్‌పగా నిలిచింది. ఇక, సెమీస్ పోరు తొలి గేమ్ ఆరంభంలో 0-5తో వెనుకబడినా.. దూకుడైన ఆటతో పుంజుకొన్న భారత జంట 7-5తో పైచేయి సాధించింది. ఆ తర్వాత 11-9తో బ్రేక్‌కు వెళ్లిన సాత్విక్ జోడీ 18-15తో ముందుకెళ్లింది. అదేఊపులో మొదటి గేమ్ నెగ్గింది. అయితే, రెండో గేమ్‌లో నెట్‌వద్ద సాత్విక్ తప్పిదాలు చేయడంతో మలేసియా జంట 11-10తో నిలిచింది. ఆ తర్వాత ఆధిక్యం చేతులు మారుతూ 18-18తో స్కోరు సమమైనా, చివరకు మలేసియా జోడీ రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో అద్భుతంగా పుంజుకొన్న సాత్విక్ జోడీ 7-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత జంట వెనుదిరిగి చూడకుండా ఆ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్’ నోటీసులు
సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్