సర్కారు కాదు.. సర్కస్ నడుస్తోంది
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:48 AM
‘ఉద్యోగ నోటిఫికేషన్లు, యూత్ డిక్లరేషన్లు మరిచి మంత్రు లు, ముఖ్యమంత్రి కమీషన్లు, వాటాల కోసం కొట్లాడుతున్నరు.. నోటిఫికేషన్‌లు మరిచి లూటిఫికేషన్‌లో తేడాలు వచ్చి వాళ్లకు వాళ్లే తిట్టుకుంటున్నరు. రాష్ట్రంలో సర్కారు కాదు.. సర్కస్ నడుస్తోంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సీఎం, మంత్రుల మధ్య కమీషన్ల కోసం కొట్లాట
ఉద్యోగ నోటిఫికేషన్‌లు మరిచి
లూటిఫికేషన్‌లో తేడాలపై గొడవ
కాంగ్రెస్ సర్కారే రిజైన్ చేయాలి
కరీంనగర్ యువ సమర భేరిలో కేటీఆర్
కరీంనగర్/కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగ నోటిఫికేషన్లు, యూత్ డిక్లరేషన్లు మరిచి మంత్రు లు, ముఖ్యమంత్రి కమీషన్లు, వాటాల కోసం కొట్లాడుతున్నరు.. నోటిఫికేషన్‌లు మరిచి లూటిఫికేషన్‌లో తేడాలు వచ్చి వాళ్లకు వాళ్లే తిట్టుకుంటున్నరు. రాష్ట్రంలో సర్కారు కాదు.. సర్కస్ నడుస్తోంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లో శనివారం నిర్వహించిన ‘యువ సమరభేరి’లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ యువతను మోసం చేసిందని, ఆ పార్టీ ప్రభుత్వానికి యువతనే పిండం పెడతారని అన్నారు. ‘‘మేము ఏడున్నరేళ్లలో 2.32 లక్షల ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టాం. 1,60,083 పోస్టులు భర్తీ చేశాం. మిగతావి చేసే టైంలోనే కాంగ్రెస్ వాళ్లే కోర్టులకు పోయి అడ్డుకున్నరు. మేము భర్తీ చేసింది అబద్ధమని నిరూపిస్తే నేను కరీంనగర్ గడ్డమీద నుంచే రాజీనామా చేసి రాజకీయాలను వదులుకుంటాను’’ అని కేటీఆర్ సవాలు చేశారు. ఇంజనీరింగ్ విద్యను సీఎం రేవంత్‌రెడ్డి క్రిమినల్ వేస్ట్ అనడంపైనా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘సీఎం రేవంతే ఒక క్రిమినల్ వేస్ట్. ఓటుకు నోటు దొంగ. తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల భూములను కొట్టేయడానికే సీఎం పాలిటెక్నిక్‌ను స్కిల్ యూనివర్సిటీలో కలుపుతున్నారు’’ అని మండిపడ్డారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు వెయ్యి రోజులైనా ఇస్తలేరని కేటీఆర్ అన్నారు. కాంగ్రె్‌సను కాల్చి బూడిద చేసేందుకు యువత, నిరుద్యోగులు నిప్పుకణికలవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రె్‌సను నిషేధిత జాబితాలో పెట్టే టైం వచ్చింది
యూత్ డిక్లరేషన్, 2లక్షల ఉద్యోగాల భర్తీ, యూత్ కమిషన్, ప్రయివేట్ కంపెనీల్లో 75శాతం రిజర్వేషన్, రూ.4వేల నిరుద్యోగ భృతి ఇలా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు. పైగా కేసీఆర్ రాజీనామా చేయాలంటున్నారని, కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ను కరీంనగర్‌లో 2006లో రాజీనామా చేయమంటే ఏమైంది. కాంగ్రెస్ మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ వచ్చింది. రెండేళ్ల తరువాత మళ్లీ కేసీఆరే సీఎం అవుతారు. పేద ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రె్‌సను నిషేధిత జాబితాలో పెట్టే సమ యం వచ్చింది. 420 హామీలు నెరవేర్చనందుకు ఈ ప్రభుత్వం 420 సార్లు రాజీనామా చేయాలి’’ అని పేర్కొన్నారు. ‘‘కమీషన్ల మత్తులో కాంగ్రెస్ ఉంటే.. కంపెనీలను బీజేపీ వాళ్లు గుజరాత్‌కు ఎత్తుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ఏమి చేస్తున్నారు’’ అని కేటీఆర్ నిలదీశారు.
పాలిటెక్నిక్ కాలేజీల భూములపై రేవంత్ సర్కారు కన్ను
సిరిసిల్ల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కాలేజీల భూములు, ఆస్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ వ్యవస్థను బలహీనపర్చి కాలేజీల భూములను, ఆస్తులను ఇతర అవసరాలకు వినియోగించుకునే యత్నాలను అడ్డుకుంటామని అన్నారు. జీవో నంబర్ 97 వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడతామన్నారు. ఈ జీవోను రద్దు చేసే వరకు బీఆర్‌ఎస్ విద్యార్థుల వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. శనివారం సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో 97ను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న క్రమంలో కేటీఆర్ వారితో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగివచ్చే వరకు తాము కూడా అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News