Share News

రేవంత్‌ రాజీనామా చెయ్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:37 AM

వెయ్యి రోజులైనా ఆరు గ్యారెంటీలను అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం చీము, నెత్తురు ఉన్నా రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుర్చీ కోసం కాంగ్రెస్‌లో కొట్లాడుకుంటున్నారని విమర్శించారు.

రేవంత్‌ రాజీనామా చెయ్‌
Harish Rao

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌నూ పట్టించుకోరా?

  • జాబ్‌ క్యాలెండర్‌ కాదు.. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌

  • ఇది రైతు రాబందు రాజ్యం: ఎమ్మెల్యే హరీశ్‌రావు

దుబ్బాక/సిద్దిపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వెయ్యి రోజులైనా ఆరు గ్యారెంటీలను అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం చీము, నెత్తురు ఉన్నా రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుర్చీ కోసం కాంగ్రెస్‌లో కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందన్నారు. ఇది రైతులను పీల్చి పిప్పి చేస్తున్న రాబందు రాజ్యమని ధ్వజమెత్తారు. రేవంత్‌ ఓ రాక్షసుడని, ఆయనది రాక్షస పాలన అని, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్‌ చౌరస్తా వద్ద శనివారం నిర్వహించిన రైతు ధర్నా, పొలికేకతోపాటు సిద్దిపేటలో చేపట్టిన నిరసనలో హరీశ్‌రావు మాట్లాడారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సర్కార్‌ చెబుతున్నా.. ఐదారు గంటల మించి సరఫరా ఉండడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో లాగ్‌ బుక్‌లను పరిశీలించి హడావుడి చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చదువురానోళ్లు విద్యాశాఖ మంత్రి అయితే ఇట్లనే ఉంటుందని ధ్వజమెత్తారు. జాబ్‌ క్యాలెండర్‌ కాస్తా జాబ్‌లెస్‌ క్యాలెండర్‌గా మారిందని ఎద్దేవా చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రేవంత్‌ను గల్లా పట్టి నిలదీస్తానని వ్యాఖ్యానించారు. పీఆర్‌సీ కోసం ఐదు లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సిద్దిపేటకు రూ.200కోట్లతో వెటర్నరీ కళశాల మంజూరు చేస్తే.. పనులు నడుస్తుండగానే దొంగలాగా రేవంత్‌రెడ్డి ఎత్తుకుపోయాడని మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేసులు పెట్టాలన్నా, కొట్టాలన్నా..పోలీసులు హరీశ్‌ను దాటి రావాలని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అభినందన సభా.. నిరసన సభా..?

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:37 AM