Share News

అభినందన సభా.. నిరసన సభా..?

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:24 AM

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ నివేదిక తెప్పించుకోవాలి. డిసెంబరులో కొత్త పీఆర్సీ కమిటీని వేయాలి. పెండింగ్‌ బిల్లులు రూ.2,000కోట్లు విడుదల చేయాలి. డీఏలు మొత్తం ఇవ్వాలి. ఇవన్నీ 10వ తేదీలోగా ప్రకటించాలి.

అభినందన సభా.. నిరసన సభా..?
TJAC

  • చలో హైదరాబాద్‌ను మేం ఎలా జరుపుకోవాలి

  • ఇది ప్రభుత్వ పెద్దలకే వదిలేస్తున్నాం

  • పీఆర్సీ, పెండింగ్‌ డీఏలను వెంటనే ఇవ్వండి

  • 10వ తేదీలోగా ప్రకటన చేయండి: టీజేఏసీ

ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ నివేదిక తెప్పించుకోవాలి. డిసెంబరులో కొత్త పీఆర్సీ కమిటీని వేయాలి. పెండింగ్‌ బిల్లులు రూ.2,000కోట్లు విడుదల చేయాలి. డీఏలు మొత్తం ఇవ్వాలి. ఇవన్నీ 10వ తేదీలోగా ప్రకటించాలి. దీనిని బట్టే 10న నిర్వహించే చలో హైదరాబాద్‌ కార్యక్రమ సభను మేం అభినందన సభలా నిర్వహించుకోవాలా లేక నిరసన సభలా జరుపుకోవాలా అన్నది ప్రభుత్వ పెద్దలకే వదిలేస్తున్నాం’’ అని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన చలో హైదరాబాద్‌ సన్నాహక సమావేశానికి వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పదేళ్లు ఓపికపట్టామని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ మూడేళ్లు ఎదురుచూశామని చెప్పారు. ఉద్యోగులు తమ వేతనాలనుంచి దాచుకున్న పైసలనే ఇవ్వాలని తాము అడుగుతున్నామని చెప్పారు. తమకు రావాల్సిన రూ.10,000 కోట్ల బకాయిల్లో 2వేల కోట్లు మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. పీఆర్సీని తక్షణమే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల కోర్కెలు గొంతెమ్మ కోరికలు కావని వారు స్పష్టం చేశారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా పీఆర్సీ పెండింగ్‌ లేదని వారు స్పష్టం చేశారు. సీపీఎస్‌ కూడా కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లోని నాలుగు రాష్ర్టాల్లో అమలవతోందన్నారు. ఇదేవిధంగా సీపీఎ్‌సను తెలంగాణలోనూ అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల 64 సమస్యలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌, టెంపరరీ, గ్రామ పంచాయతీ వర్కర్స్‌, మున్సిపల్‌ వర్కర్స్‌, ఫిక్స్డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీస్‌, డైలీ వేజెస్‌, అదేవిధంగా ఎన్నార్‌ఈజీఎస్‌, ఐకేపీలో పనిచేస్తున్న ఉద్యోగులు 7 లక్షల మంది వరకు ఉన్నారని తెలిపారు. వారికి రెండవ విడతలో హెల్త్‌ కార్డ్స్‌ అమలుచేయాలని కోరారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రికో, ప్రభుత్వానికో వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రామప్ప దేవాలయంలో అద్భుతం ఆవిష్కృతం

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:24 AM