Share News

రామప్ప దేవాలయంలో అద్భుతం ఆవిష్కృతం

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:59 AM

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం ప్రారంభమైంది. ఆలయంలో కొలువుదీరిన రుద్రేశ్వరుడికి 17వ శతాబ్దంలో భూకంపం సంభవించినప్పటి నుంచి సోమసూత్రం (ఆలయ గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే సంప్రదాయ మార్గం) మూసుకుపోయింది

రామప్ప దేవాలయంలో అద్భుతం ఆవిష్కృతం
Ramappa

  • శివయ్యకు ఇకపై నిత్య జలాభిషేకం

  • 300 ఏళ్ల నిరీక్షణ తర్వాత

  • సోమసూత్రం పునరుద్ధరణ

వెంకటాపూర్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం ప్రారంభమైంది. ఆలయంలో కొలువుదీరిన రుద్రేశ్వరుడికి 17వ శతాబ్దంలో భూకంపం సంభవించినప్పటి నుంచి సోమసూత్రం (ఆలయ గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే సంప్రదాయ మార్గం) మూసుకుపోయింది. దీంతో పరిపూర్ణమైన అభిషేకాలు కరువయ్యాయి. ఈ క్రమంలో ఇన్నేళ్ల తర్వాత రామప్ప ఆలయంలో ఆధునిక పరికరాలతో శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులను అనుసరిస్తూ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ ప్రక్రియలో 3డీ మ్యాపింగ్‌, ఎండోస్కోపిక్‌, జీవోప్రో కెమెరాలతో రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ స్ర్కీన్ల ద్వారా పర్యవేక్షించారు. దేవాలయ నిర్మాణానికి ఎటువంటి నష్టం కలగకుండా సాఫ్ట్‌ డ్రిల్లింగ్‌ విధానంలో పొరలు పొరలుగా అడ్డంకులను జాగ్రత్తగా తొలగించారు. దీంతో సోమసూత్రం ఎట్టకేలకు పునరుద్ధరణకు నోచుకుంది. ఈ పనులను దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఏఎ్‌సఐ హైదరాబాద్‌ సర్కిల్‌ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. ఇన్‌టాక్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు, కేంద్ర పురావస్తు శాఖ డీఈ కృష్ణచైతన్య, ఉమ్మడి వరంగల్‌ జిల్లా సీఏలు మల్లేష్‌, కృష్ణవంశీ, రామప్ప ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్‌ సమక్షంలో పునరుద్ధరణ పనులను చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మాజీ భార్య కుటుంబం అంతానికి కుట్ర పన్నిన.. యూకే ఫార్మసిస్టుకు షాక్‌!

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 05:59 AM