వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
ABN , Publish Date - Sep 06 , 2026 | 07:18 AM
వారఫలాలు.. 6 -12 సెప్టెంబర్ 2026 పి. ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
మీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. లావాదేవీలతో తీరిక ఉండదు. స్నేహసంబంధాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించు కోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పిల్లలకు శుభఫలితాలున్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ప్రముఖులను కలుసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయిం చవద్దు. సన్నిహితులతో తరచూ సంభాషి స్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగి స్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ మాటలను కొందరు వక్రీకరిస్తారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూ లంగా ఉంది. ప్రణాళికాబద్థంగా ముందుకు సాగుతారు. సంస్థల స్థాపనలకు తగిన సమ యం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చి తంగా తెలియజేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విందులు, వేడుకకుహాజరవుతారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు చక్కబడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు ఒక పట్టాన సాగవు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. అవతలివారి తీరును గమనించి మెలగండి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ఫలించవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృక్పథంతో మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యల కలయిక వీలుపడదు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగు పడతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
ప్రతికూలతలు అధికం. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ప్రతీ వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. పరిస్థితులు త్వరలో చక్కబడ తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆచితూచి అడుగేయండి. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. సన్నిహితుల సలహా పాటించండి. మొహమాటాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. కావలసిన వ్యక్తుల కల యిక వీలుపడదు. సోదరుల మధ్య కొత్త విష యాలు ప్రస్తావనకు వస్తాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యసాధనలో సఫలీకృతుల వుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచ యాలు ఉన్నతికి దోహదపడతాయి. ఉత్సా హంగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పట్టుదలకు పోవద్దు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధవహించండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అన్ని విధాలా యోగదాయ కమే. లక్ష్యం నెరవేరుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. ఖర్చులు అధికం. పొదుపు ధనం గ్రహిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కొంతమేరకు ఆశాజనకం. పరిస్థితులు చక్కబడతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. నిపుణుల సలహా పాటించండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. కొందరి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం కోలుకుంటుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు అతికష్టంమ్మీద పూర్తవుతాయి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పిల్లల కదలికలపై దృష్టిపెట్టండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి:
రేవంత్‌కు రెండో చాన్స్ ఉందా...
ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్ లీవ్‌లకు సర్కారు ఓకే
Read Latest AP News And Telangana News And International News And Telugu News