Share News

ఏకే-203 రైఫిళ్లకు అదానీ సంస్థ నుంచి బుల్లెట్లు

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:13 AM

భారత్‌లో తయారవుతున్న ఏకే-203 రైఫిళ్ల కోసం ఐదేళ్ల పాటు బుల్లెట్లను(7.62-39ఎంఎం) సరఫరా...

ఏకే-203 రైఫిళ్లకు అదానీ సంస్థ నుంచి బుల్లెట్లు

  • ఐదేళ్ల పాటు సరఫరా చేసేలా ఒప్పందం

  • దేశీయంగా కాన్పూర్‌లో బుల్లెట్ల తయారీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: భారత్‌లో తయారవుతున్న ఏకే-203 రైఫిళ్ల కోసం ఐదేళ్ల పాటు బుల్లెట్లను(7.62-39ఎంఎం) సరఫరా చేయడానికి ‘అదానీ డిఫెన్స్‌’ సంస్థ ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌(ఐఆర్‌ఆర్‌పీఎల్‌) సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ బుల్లెట్లను దేశీయంగా కాన్పూర్‌లోని అదానీ డిఫెన్స్‌ సంస్థలో ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నారు. ఏకే-203లను భారత్‌లో తయారు చేయాలని భారత్‌, రష్యా మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఐఆర్‌ఆర్‌పీఎల్‌ను 2019లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లా కోర్వాలో తుపాకులను తయారు చేస్తున్నారు. ఇక్కడ 6.01లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:13 AM