Share News

పాక్‌ ఆర్మీపై బీఎల్‌ఏ దాడి.. 25మంది హతం

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:15 AM

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ మరోసారి రక్తసిక్తమైంది. వేర్పాటువాద సంస్థ ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’...

పాక్‌ ఆర్మీపై బీఎల్‌ఏ దాడి.. 25మంది హతం

క్వెట్టా, సెప్టెంబరు 5: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ మరోసారి రక్తసిక్తమైంది. వేర్పాటువాద సంస్థ ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (బీఎల్‌ఏ) జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో 25 మంది పాక్‌ సైనికులు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం జియారత్‌ క్రాస్‌ మార్గంలో వెళ్తున్న పాక్‌ ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఎల్‌ఏకు చెందిన ‘ఫతేహ్‌ స్క్వాడ్‌’ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 18 మంది సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఘటనలో, సూరబ్‌ జిల్లాలో బీఎల్‌ఏ స్పెషల్‌ టాక్టికల్‌ ఆపరేషన్స్‌ స్క్వాడ్‌ (ఎస్‌టీవోఎస్‌) రిమోట్‌ కంట్రోల్‌ బాంబుతో సైనిక వాహనాన్ని పేల్చివేసింది. ఈ దాడిలో ఏడుగురు పాక్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకార దాడుల్లో బీఎల్‌ఏ, టీటీపీకి చెందిన 48 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు పాక్‌ ఆర్మీ ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:19 AM