హెగ్సెత్‌కు ట్రంప్ మద్దతు.. అభిశంసన ప్రయత్నాల వేళ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 09:06 AM
ఇరాన్ యుద్ధంలో హెగ్సెత్ తీరుపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలిచారు. వెనెజువెలా, ఇరాన్‌లలో సైనిక చర్యల్లో విజయం సాధించారని ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా నిలిచారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హెగ్సెత్‌ను అభిశంసించేందుకు ప్రయత్నాలు మొదలైన వేళ.. ఆయన పనితీరును ట్రంప్ సమర్థించారు. వెనెజువెలా, ఇరాన్‌లలో రెండు యుద్ధాల్లో విజయం సాధించారని, రక్షణ మంత్రిగా ఆయన మంచి పని చేశారని ప్రశంసించారు. హెగ్సెత్‌కు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు ట్రంప్.
రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్ మాసీ.. హెగ్సెత్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇరాన్‌తో యుద్ధంలో హెగ్సెత్ తీరును తప్పుబడుతూ మాసీ తీర్మానం తీసుకొచ్చారు. యెమెన్, వెనెజువెలాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో ఆయన పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ తీర్మానంపై అమెరికా ప్రతినిధుల సభలో బుధవారం నాటికి ఓటింగ్ జరిగే అవకాశముంది.
అయితే.. ఈ తీర్మానంపై నేడు(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు హెగ్సెత్ ప్రకటించారు. ఆ యుద్ధం ప్రజాదరణ పొందకపోయినా, దేశ భద్రత కోసం చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ.. మాసీ ఓ ఓటమిచెందిన వ్యక్తి అని ఆయన తీరును తప్పుబట్టారు. ఆయనపై విమర్శలు గుప్పిస్తూ.. కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) విలువైన సమయాన్ని ఇలాంటి తీర్మానాలతో వృథా చేయొద్దని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
రూ.37 లక్షల జీతం.. 6 నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బ్లూ టిక్స్ పడకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!